Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

సేతుపతి వెర్సెస్ దళపతి.. రచ్చహ.. రచ్చస్య… రచ్చోభ్యహ!

Thalapathy Vijay Vs Vijay Sethupathi, సేతుపతి వెర్సెస్ దళపతి.. రచ్చహ.. రచ్చస్య… రచ్చోభ్యహ!

Thalapathy Vijay Vs Vijay Sethupathi: తమిళ ఇండస్ట్రీలో దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరికీ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ కూడా సూపర్ స్టార్లు..మరి అలాంటి స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఊహిస్తున్న ఊహే అద్భుతంగా ఉంటే.. సినిమా వస్తే ఇంకెంత అదిరిపోతోందో చెప్పనక్కర్లేదు. ఇక ఈ ఇద్దరు హీరోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మూడో లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘బాహుబలి’ పోస్టర్ మాదిరిగా దళపతి, సేతుపతి ఎదురెదురుగా ముఖాలపై గాయాలతో కనిపిస్తారు. ఇక ఈ మూవీలో విజయ్ సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, చిత్ర యూనిట్ విడుదల చేసిన కొద్దిగంటల్లోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.

మాళవిక మొహనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియా, శాంత ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎక్స్‌బీ ఫిలిమ్‌ క్రియేషన్స్‌ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కాగా, సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.

 

Related Tags