తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడనున్న నాని!

ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకెళ్తున్నాడు నేచురల్ స్టార్ నాని. అలాగే కొత్త దర్శకులని కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రస్తుతం నాని శివ నిర్వాణతో చేస్తున్న 'టక్ జగదీష్' మినహా ఆ తర్వాత చేయబోయే చిత్రాలన్నీ..

తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడనున్న నాని!

Edited By:

Updated on: May 24, 2020 | 9:00 AM

ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకెళ్తున్నాడు నేచురల్ స్టార్ నాని. అలాగే కొత్త దర్శకులని కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రస్తుతం నాని శివ నిర్వాణతో చేస్తున్న ‘టక్ జగదీష్’ మినహా ఆ తర్వాత చేయబోయే చిత్రాలన్నీ కొత్త డైరెక్టర్లతో చేస్తున్నవే. వీటిలో రాహుల్ సంకృత్యాన్, వివేక్ ఆత్రేయ చిత్రాలతో పాటు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్‌తో కూడా ఓ కొత్త చిత్రం చేయనున్నాడు. ఈ సినిమాని సుధాకర్ చెరకూరి నిర్మించనున్నారు.

వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో నాని తొలిసారిగా తెలంగాణ భాషలో మాట్లాడనున్నారట. అలాగే ఇందులో నాని స్టైల్ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినదిగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ కోసం గోదావరి యాస మీద పట్టు సంపాదించాడు నాని. అలాగే గతంలో ‘కృష్ణార్జున యుద్ధం’లోనూ చిత్తూరు యాసలో మాట్లాడి అందరినీ నవ్వించాడు. ఇప్పుడీ క్రమంలోనే ఈ రాబోయే కొత్త ప్రాజెక్టు కోసం తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడని సమాచారం.

కోవిడ్ సోకిన గర్భిణీలకు ఆ ప్లేస్‌లో గాయాలు.. ముప్పే అంటోన్న నిపుణులు