Akhil Sarthak And Monal Gajjar: ‘ఆ ప్రాజెక్ట్‌ను అఖిల్ కోసమే ఓకే చేశాను’.. మోనాల్ గజ్జర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Akhil Sarthak And Monal Gajjar: బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న జంట అఖిల్ సార్ధక్, మోనాల్ గజ్జర్. వీరిద్దరూ...

Akhil Sarthak And Monal Gajjar: ఆ ప్రాజెక్ట్‌ను అఖిల్ కోసమే ఓకే చేశాను.. మోనాల్ గజ్జర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Updated on: Feb 16, 2021 | 5:00 PM

Akhil Sarthak And Monal Gajjar: బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న జంట అఖిల్ సార్ధక్, మోనాల్ గజ్జర్. వీరిద్దరూ కలిసి నటిస్తే బాగుంటుందని అప్పట్లో చాలామంది అభిమానులు కోరుకున్నారు. ఇక వారి కోరిక ఎట్టకేలకు ఫలించింది. ‘తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి’ అనే వెబ్ సిరీస్‌లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్‌గా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌ గురించి ఓ ఇంటర్వ్యూ‌లో మాట్లాడుతూ మోనాల్ పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఈ వెబ్ సిరీస్‌లో అఖిల్ నటిస్తున్నాడని చెప్పేసరికి.. వెంటనే ఓకే చెప్పానని మోనాల్ గజ్జర్ వెల్లడించింది. బిగ్ బాస్‌లో మా ఇద్దరి పెయిర్‌కు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే మమ్మల్ని స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నారని మోనాల్ స్పష్టం చేసింది. కాగా, గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు జాబ్ కోసం వచ్చిన అమ్మాయికి.. విలేజ్ నుంచి సిటీకి వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయికి మధ్య నడిచే లవ్ స్టోరీనే ఈ వెబ్ సిరీస్ కథాంశం. భాస్కర్ బంటుపల్లి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!