Acharya : సరికొత్త రికార్డును సృష్టించిన నీలాంబరి.. దూసుకుపోతున్న “ఆచార్య” పాట..

| Edited By: Ravi Kiran

Nov 12, 2021 | 7:02 AM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజాచిత్రం ఆచార్య ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా

Acharya : సరికొత్త రికార్డును సృష్టించిన నీలాంబరి.. దూసుకుపోతున్న ఆచార్య పాట..
Acharya
Follow us on

Acharya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజాచిత్రం ఆచార్య ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా చందమామా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే కనిపించనుంది. ఇక చిరంజీవి , చరణ్ కలిసి నటిస్తే చూడాలని మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆ కల ఇప్పుడు ఆచార్య రూపంలో నిజం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆచార్య నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం చిరు అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి,చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు.

ఇప్పటికే  ఈసినిమానుంచి టీజర్ తోపాటు ఓ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.ఇటీవలే ఆచార్య నుంచి సెకండ్ సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రామ్ చరణ్, పూజాహెగ్డే లపై ఈ పాటను చిత్రీకరించారు. నీలాంబరి అంటూ సాగే ఈ పాట విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ  నెల 5వ తేదీన యూ ట్యూబ్ లో వదిలిన ఈ పాట దూసుకుపోతుంది. యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ ను సృష్టిస్తుంది ఈ పాట. ఈ పాట చాలా వేగంగా 9 మిలియన్ వ్యూస్ మార్క్ ను టచ్ చేసింది. ఫస్టు సాంగ్ తో పాటు సెకండ్ సాంగ్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుండటం చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Sirish: సోషల్‌ మీడియాను వీడిన అల్లు శిరీష్‌.. అసలు మ్యాటరేంటంటే..

Divi Vadthya: ఏ ‘దివి’లో విరిసిన పారిజాతమో… బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు వైరల్ 

Anchor Vishnu Priya: తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ విష్ణు ప్రియ.. ఇదిగో పోస్ట్..