Krishna Mukunda Murari 1st September: కృష్ణ ప్రేమ కోసం మురారీ తపన.. నీ ప్రేమ గొప్పది ఓడిపోదు అంటూ ముకుందని ఎగదోస్తున్న అలేఖ్య..

|

Sep 01, 2023 | 7:19 AM

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారీ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.    ప్రేమించిన ప్రియురాలి పంతానికి,  భార్య ప్రేమకు మధ్య ఓ యువకుడి కథతో సాగుతున్న కృష్ణ ముకుంద మురారీ  బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ సొతం చేసుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది.  కృష్ణ ఇంటికి తిరిగి రావడంతో షాక్ తిన్న ముకుంద కృష్ణను ఇలాగైనా ఇబ్బంది పెట్టి ఇంటినుంచి వెళ్ళగొట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. మురారీ.. కృష్ణ ప్రేమని దక్కించుకుని తమ పెళ్ళికి పరిపూర్ణ న్యాయం చేయాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు సెప్టెంబర్ 1వ తేదీన ఏమి జరుగుతుందో చూద్దాం.. 

Krishna Mukunda Murari 1st September: కృష్ణ ప్రేమ కోసం మురారీ తపన.. నీ ప్రేమ గొప్పది ఓడిపోదు అంటూ ముకుందని ఎగదోస్తున్న అలేఖ్య..
Krishna Mukunda Murari
Image Credit source: Hotstar
Follow us on

ప్లీజ్ కృష్ణా నాకు బుల్లెట్స్ అన్నా భయం ఉండదు కానీ ఇంజెక్షన్ అంటే భయం అంటూ కృష్ణకు దొరకకుండా పారిపోతాడు..మీ భయానికి ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టేస్తా అంటూ కృష్ణ.. మురారీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. పడిపోబోతున్న కృష్ణను మురారీ పట్టుకుంటాడు. ఇలా నా కళ్లలో ప్రేమని చూసైనా నా ప్రేమని అర్ధం చేసుకోవయ్యా సామి.. ఈ లోగా ఇంజెక్షన్ చేస్తా అని కృష్ణ అనుకుంటుంటే.. నీ కళ్లలో ప్రేమ కనిపిస్తుంది. కానీ మాటల్లో ఆరాధన చేతిల్లో కృతజ్ఞత ఒక మనిషిలో ఇన్ని కోణాలు.. అందుకే అన్నారు ఏమో కవులు.. ఆడవారు అర్ధంకారని.. నువ్వు నాకు అర్ధం కాకపోయినా పర్వాలేదు.. కానీ నన్ను వదిలి వెళ్ళిపోకు కృష్ణ ఎప్పటికీ ఇలాగె ఉండి పో కృష్ణ అని అనుకుంటాడు.. ఇన్నాళ్లు మీకు నా మీద ప్రేమ లేదని అనుకున్నా.. కానీ మీకు నేను అంటే ప్రేమ అని తెలిశాక ఎలా వదిలి ఉండగలను.. నేను జీవితాంతం మీతోనే ఉంటా ఏసీపీ సార్ అనుకుంటుంది కృష్ణ.. ఇంతలో ఇంజెక్షన్ చేస్తుంది. ఏసీపీ సార్ అయిపోయింది అని చెప్పి నవ్వుతుంది కృష్ణ.

నేను ఏమిటి ఏసీపీ సార్ కి ఇంత దగ్గర అయ్యిపోయాను .. మన పెళ్లి అగ్రిమెంట్ కాదు పరిమినెంట్ అని నేనే చెప్పేస్తా.. ఇన్నాళ్ల దూరాన్ని నేనే దగ్గర చేస్తాను ఏసీపీ సార్ ఇక చూసుకోండి అని అనుకుంటుంది కృష్ణ.. నా ప్రేమతో మీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తా.. నా ప్రేమతో మిమ్మల్ని హింసిస్తాను అనుకుంటూ కృష్ణ నవ్వుతుంది.

కృష్ణమీద పగ పెంచుకున్న ముకుంద

ముకుంద మురారీ రూమ్ లో మారిన క్యాప్షన్ ను గుర్తు చేసుకుని కృష్ణ ఎందుకు తిరిగివచ్చింది.. కొంపదీసి మురారీకూడా తనను ప్రేమిస్తున్నది తెలిసిపోయిందా అని ఆలోచిస్తుంది. రేవతి అత్తయ్య వేసిన ప్లాన్ అనుకుంటా.. నా ప్రేమకి అందరూ శత్రువులైపోయారు. నేను ప్రేమించిన వాడు కూడా ప్రత్యర్థుల వైపే ఉన్నాడు.. అయినా నా ప్రేమని నేను దక్కించుకుంటా.. ఎవరు అడ్డుకున్నా ఈ ప్రపంచం అంతా ఏకమైనా నా ప్రేమని నేను చంపుకోను.. ఈ విషయంలో నాకు హెల్ప్ చేసేది మా నాన్న ఒక్కరే అని ముకుంద ఆలోచిస్తూ అత్తయ్యతో మా ప్రేమ విషయం చెప్పమని నాన్నతో చెప్పాలి అనుకుంటుంది.

ఏసీపీ సార్ జ్యుస్ తాగమని అడిగితే .. నేను తాగను అని వాదించుకుంటారు కృష్ణ, మురారీలు. చివరకు మురారీతో జ్యుస్ తాగిస్తుంది కృష్ణ. షార్ట్ మీద ఒలికించేసుకున్నారు. అని అంటే నీ తింగరి తనం వల్లనే షర్ట్ మీద జ్యుస్ వలికింది. అంటే.. నువ్వు మూతి సున్నా లా పెట్టావ్ అంటాడు.. అయితే ఏమిటి అంటే.. నాకు కళ్లు ఉన్నాయి కదా చూశాను అంటాడు మురారీ.. క్యూట్ గా అనిపించే సరికి జ్యుస్ వలికింది. అని అంటాడు. షర్ట్ క్లిన్ చేస్తాను అంటుంది కృష్ణ.

కృష్ణ నామీద ప్రేమతో నాతో జీవితం పంచుకోవడానికి వచ్చిందా.. లేదా అమ్మ బలవంతం మీద వచ్చిందా అడిగి తెలుసుకుందాం అని మురారీ అనుకుంటాడు. కృష్ణ నిన్ను నీ పద్దతిలో సూటిగా ఒకడి అడుగుతా నిజం చెబుతావా.. అని అంటూ నా ఆరోగ్యం బాగోలేదని.. నేను కోలుకోవాలని తిరిగి వచ్చావు అంతేనా.. అంటే.. మీరు మాత్రం మీ ఇష్టాన్ని డైరెక్ట్ గా చెప్పరు.. నా మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అని కృష్ణ ఆలోచిస్తుంది. కాదు నా స్వార్ధం అని అంటే.. అదేమిటి అని అడుగుతాడు మురారీ.. నేను మీ దేవుడిని అంటావు కదా డైరెక్ట్ గా చెప్పలేవా అని అంటే.. అయితే అది మీరే తెలుసుకోండి అని కృష్ణ మురారీకి చెబుతుంది. కృష్ణ ఇంటికి రావడానికి స్వార్ధం అని అంది.. తనలో కూడా స్వార్ధం ఉంటుందా.. మునుపిటికంటే హుషారుగా ఉంది.. కారణం ఏమైఉంటుంది అని మురారీ ఆలోచిస్తాడు.

మురారీ దగ్గరకు వచ్చిన ముకుంద .. ఏమి చేస్తా మురారీ… అని అని అడిగితే.. ఉన్న చోట ఉండక ఫోటోలు చూపిస్తా అది చేస్తా అని నన్ను టెన్షన్ పెడతావా.. వెధవ బిల్డప్ లు ఇస్తావా.. చెబుతా నీ సంగతి మళ్ళీ నా జోలికి రాకూడదు అని అనుకుంటూ .. ముకుంద ఏమి ఆలోచిస్తున్నావు అంటే.. ఇందాక కృష్ణ ఒక జ్యుస్ తీసుకొచ్చి ఇచ్చింది ముకుంద.. చాలా తియ్యగా ఉంది.. ఏమి కలిపి ఇచ్చావు కృష్ణ అంటే.. కొంచెం తాగి ఇచ్చాను ఏసీపీ సార్ అని అంది.. అంటూ సిగ్గుపడతాడు  మురారీ. రొమాంటిక్ కదా తను అంటే.. నువ్వు తనతో ఇలా రొమాంటిగ్ గా ఉండడం.. సరసాలు ఆడడం నాకు నచ్చదు అని ముకుంద అంటే.. ఓహో నాకు కావాల్సింది కూడా అదే అని మురారీ అనుకుంటాడు. నా కృష్ణను ఇంటిలో నుంచి పంపించేలా చేస్తా అంటావా.. నీకు ఇంకొంచెం డోసు ఇస్తా.. చూడండి ముకుంద గారు.. మేమిద్దరం భార్యాభర్తలం మా ఇద్దరి మధ్య సరదాలు, సరసాలు లేకపోతె ప్రాబ్లెమ్ కానీ ఉంటె తప్పులేదు కదా.. మీకు ఇంకో విషయం తెలుసా.. ఇందాక జ్యుస్ నాకు కృష్ణే తాగించింది. అప్పుడు నేను ఏమి చేసానో తెలుసా.. కావాలనే జ్యుస్ షర్ట్ మీద ఒలికించుకున్నా అప్పుడు  తనే తుడిచింది. అప్పుడు ఆ అమ్మాయి బుగ్గలు చూడాలి.. ఓహ్ రొమాంటింగ్ అంటూ మురారీ సిగ్గుపడతాడు. ముకుంద కోపంతో మురారీ అని అంటే.. ముకుంద గారు మీరు అరిస్తేనో బెదిరిస్తేనో నేను భయపడను దయచేసి మామానాన్న మమ్మల్ని వదిలిస్తే మీకు మంచిది మాకు మంచిది అని అంటే.. నేను మీ ఇద్దరినీ అసలు మనశాంతిగా ఉండనివ్వను అని ముకుంద .. వార్నింగ్ ఇస్తుంది మురారీకి. చాలు చాలెండి మీ బెదిరింపులకు భయపడను.. ఇందాక ఫోటోలు చూపిస్తా అది చేస్తా అని అన్నావు అప్పుడు కూడా కృష్ణే గెలిచింది. ఏమైంది వెల్కమ్ కృష్ణ అని గ్రాండ్ గా రాసి ఉంది అని మురారీ .. ఇక మీదట కూడా అంతే ముకుంద.. ఎందుకండీ మీది కానిదాని కోసం ఆరాటం సరే ఉంటాను అని ముకుంద కు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

కృష్ణ దగ్గరకు రేవతి వచ్చి.. ఏయ్ తింగతి ఏమి చేస్తున్నావు.. నీ ప్రేమతో హింసిస్తాను అన్నావు ఎంతవరకూ వచ్చింది అని అంటే.. ఎక్కడ అత్తయ్య ఈ రోజే కదా వచ్చింది.. ఇంజెక్షన్ చేస్తా అంటేనే ఇల్లంత పరిగెత్తి గోల గోల చేశారు అని చెబుతుంటే రేవతి నవ్వుతుంది. అలాంటిది ఆయనతో నిజం చెప్పించాలంటే టైం పడుతుంది అని అంటుంటే.. ఆల్మోస్ట్ తగ్గిపోయినట్లే అని అంటుంది కృష్ణ.

ముకుందకు సలహా ఇచ్చిన అలేఖ్య

ముకుంద ఏమిటి అలా దిగులుగా ఉన్నావు అని అలేఖ్య అడిగితె.. నేను ఒంటరిని అని ఫీలింగ్ కలుగుతుంది నా ప్రేమకి ఎవరూ సపోర్ట్ చేయడం లేదు..  నన్ను ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు అంటే.. అలేఖ్య ఒకటి గుర్తు పెట్టుకో ముకుంద నీ ప్రేమ విలువ నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు..  అని అంటుంది కనుక నువ్వు ఎవరో నీకు సపోర్ట్ చెయ్యాలని ఎదురుచూడకు.. నిన్ను నువ్వు నమ్ముకో.. నీప్రేమని నువ్వే గెలిపించుకో.. నిజమైన ప్రేమకు  మరణం లేదని ముకుందకు చెబుతుంది. థాంక్స్ అలేఖ్య థాంక్యూ సో మచ్ అని అంటే.. నీ బ్రేస్లెట్ బాగుంది అని అంటే.. నీకు ఏదన్నా కావాలంటే అడుగు ఇచ్చేస్తాను .. అంతేకాని ఇలా నీ అవసరాలకు పొగిడి స్నేహాన్ని దిగజార్చకు.. ఇలా నా ఫ్రీలింగ్స్ తో ఎమోషన్స్ తో ఆడుకోకు అని చెప్పి తన చేతికి ఉన్న బ్రేస్లెట్ ను తీసి అలేఖ్యకు ఇచ్చేస్తుంది.

కొత్త లవ్ స్టోరీ వినిపించిన మధు

మధు ప్రసాద్ తో నాన్న నీవు ఒక స్టోరీ చెబుతా విని ఎలా ఉందొ చెప్పు అని అంటూ.. ఒక అమ్మాయి ఒకబ్బాయిని లవ్ చేస్తుంది.. ఆ అబ్బాయి మరొక అమ్మాయిని లవ్ చేస్తాడు ఆ అమ్మాయి ఇంకెవరినో లవ్ చేస్తూ ఉంటుంది .. ఇలా ఎవరిని ఎవరు లవ్ చేస్తున్నారో ఎవరీ తెలియదు .. ఇదే నా కాన్సెప్ట్.. టైటిల్ ఎవరికీ ఎవరో అంటే.. నీ కాన్సెప్ట్ నచ్చడం కాదు తొక్కేయాలని పిస్తుంది అని అంటుంటే.. ఇంతలో మధు తల్లి అక్కడికి వస్తుంది.. డాడీ నువ్వు డ్యాన్స్ చేస్తే నేను వీడియో తీస్తా అంటాడు మధు.

ఇంతలో భవానీ మురారీ ఆదర్శ్ ఆచూకీ కోసం గైడెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ ముకుంద విషయం కూడా తేల్చేయాలి రా.. తను ఎదురైనప్పుడల్లా తన కారణంగానే ఆదర్శ్ రావడం లేదేమో అని ఆలోచన వచ్చి గుండె తరుక్కుపోతుంది అని భవానీ మురారీతో చెబుతుంది. ఇక వాళ్ల నాన్న రోజూ గుడ్ మారునింగ్ పెడుతున్నాడు.. అంటే ఆదర్శ్ కోసం అని అర్ధం.. వీలైనంత త్వరగా ముకుంద ప్రేమిమించింది ఎవరినో తెలుసుకో అని అంటుంది.

వరలక్ష్మి వ్రత విశిష్టత చెప్పిన కృష్ణ

రెండు రోజుల్లో ఒక అకేషన్ ఉంది.. మన కోడలల్లో ఒక అకేషన్ ఉంది.. ఎవరికైనా గుర్తుందా అని అంటే కృష్ణ నాకు గుర్తుంది రేపు వరలక్ష్మి వ్రతం అని అంటే.. అలేఖ్య హలొ అంటూ ఫోన్ లో మాట్లాడుతున్నట్లు చేస్తే.. ఈ ఓవర్ యాక్షన్ మీ ఆయన దగ్గర చెయ్యి నా దగ్గర కాదు అని అంటే.. ఈ వర లక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారో నాకు తెలుసు.. రేపు వెళ్లి పూజకు కావాల్సినవి అన్నీ తెస్తాం అని అంటుంటే.. కృష్ణ ని వర లక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు విశిష్ట చెప్పమని అడుగుతుంది భవనీ.. అప్పుడు కృష్ణ.. వరలక్ష్మి వ్రతం గురించి

రేపటి ఏపీసోడ్ లో ..

ముకుంద మురారీ కి వర లక్ష్మి వ్రతం గురించి చెబుతుంది.. మరోవైపు కృష్ణ చాప కోసం తిప్పలు పడుతుంది.

 

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి