Vijay Sethupathi: ఈరోజు స్టార్ హీరోలుగా సెలబ్రెటీ హోదాను అందుకుంటూ.. తమ నటనలో ఆకాశంలో ధ్రువ తారలా వెలుగుతున్న వారిని చూసి.. చాలామంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే.. మరికొందరు వారి వైభవాన్ని చూసి అసూయపడతారు. కానీ ఈరోజు ఓ రేంజ్ లో ఫేమ్ ను సొంతం చేసుకున్న నటీనటుల్లో చాలామంది.. మొదట్లో ఎన్నో కష్ఠాలు పడినవారే. జీవితంలో ఎదగడానికి.. తమకంటూ ఓ పేరు సంపాదించుకునే క్రమంలో కొంతమంది ట్యూషన్ చెప్పుకుంటే.. మరికొందరు చిన్న చిన్న పనులు చేసుకుని బతికినవారే.. అలా ఓ కోలీవుడ్ నటుడు తాను జీవితంలో ఎదిగే సమయంలో పడిన కష్టాలు ఇటీవల ఓ కార్యక్రమంలో తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ నటుడు ఎవరో కాదు.. విజయ్ సేతుపతి.
ఒకప్పుడు కోలీవుడ్ హీరో ఇప్పుడు తన విలక్షణ నటనతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు.. ఈరోజు విజయ్ సేతుపతి డేట్స్ కోసం దక్షిణాది సినీ నిర్మాతలు ఎదురు చూసే స్థాయికి చేరుకున్నాడు. అయితే విజయ్ సేతుపతి.. ఎప్పుడు తనకు వచ్చిన అవకాశాలను అందుకోవడంలో సెలక్టివ్ గానే ఉన్నాడు. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ.. రోజు రోజుకీ కెరీర్ లో దూసుకుపోతున్నాడు.. తెలుగు లో సైరా నరసింహ రెడ్డి , ఉప్పెన సినిమాల్లోని విజయ్ సేతుపతి పాత్రలు ఎంతగానో పేరు తెచ్చాయి. మరిన్ని అవకాశాలను అందించాయి. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే విజయ్ సేతు పతి మళ్ళీ బుల్లి తెరపై అడుగు పెట్టాడు..
మాస్టర్ చెఫ్ అనే ఓ టీవీ ప్రోగ్రాంకు విజయ్ యాంకర్‌గా చేస్తున్నాడు. ఇటీవల ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. తనకు వంటలంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. అంతేకాదు.. తన జీవితంలో ఎన్నో కష్టాలు పడినట్లు.. తెలిపాడు.. కాలేజీ రోజుల్లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేవాడిని చెప్పాడు. సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12:30 గంటలవరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేస్తూ.. అక్కడే రాత్రి భోజనం కూడా చేసేవాడినని అప్పటి రోజులు గుర్తు చేసుకున్నాడు విజయ్ .
అంతేకాదు తనకు ఉల్లి సమోసా అంటే ఇష్టమని.. అయితే ప్రస్తుతం ఈ స్నాక్ ఎక్కడా దొరకడం లేదు. కానీ ఇంట్లో ఉంటే మాత్రం సాయంత్రం పూట ఉల్లి సమోసా తిని ఓ టీ తాగుతా’ అంటూ తనకు ఇష్టాలను.. కష్టాలను పంచుకున్నాడు. ప్రోమోతోనే తమిళనాడులో మాస్టర్ చెఫ్ ప్రొగ్రామ్ పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.