Karthika Deepam: ‘కార్తీక దీపం’ మళ్లీ వచ్చేస్తోంది.. ‘శౌర్య చెప్తున్న అమ్మనాన్నల కథ’.. ప్రోమో చూశారా ?..

|

Feb 20, 2024 | 8:13 AM

కొన్నేళ్లపాటు టీవీల్లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయి.. టీఆర్పీలో సంచలనం సృష్టించిన సీరియల్ కార్తీక దీపంకు ఇప్పుడు సీక్వెల్ వచ్చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. 'కార్తీక దీపం ఇది నవవసంతం' అంటూ సీక్వెల్ టైటిల్ కూడా రివీల్ చేశారు. ఇక ఇటీవల విడుదల చేసిన సెకండ్ పార్ట్ ప్రోమో ఆకట్టుకుంటుంది. తెలుగు లోగిళ్లు మరువని కథ కొత్త వెలుగులతో మళ్లీ వస్తోంది అంటూ చెప్పుకొచ్చారు.

Karthika Deepam: కార్తీక దీపం మళ్లీ వచ్చేస్తోంది.. శౌర్య చెప్తున్న అమ్మనాన్నల కథ.. ప్రోమో చూశారా ?..
Karthika Deepam 2
Follow us on

బుల్లితెర ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొన్నాళ్ల క్రితం టీవీల్లో సెన్సెషన్ సృష్టించిన సీరియల్‍కు సీక్వెల్ వస్తుంది. మీరు విన్నది నిజమే. సాధారణంగా సినిమాలకు సీక్వెల్స్, సెకండ్ పార్ట్స్ రావడం సహజమే… ఈ సీక్వెల్ ట్రెండ్ ఇప్పుడు మరింత ఎక్కువైంది. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో భారీ బడ్జెట్ చిత్రాలన్నింటిని ఇప్పుడు అలాగే అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. క్లైమాక్స్ లో సీక్వెల్ అని కాకుండా..ముందే రెండు పార్టులు అంటూ వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ బుల్లితెరపైకి వచ్చేసింది. మంచి రెస్పా్న్స్ అందుకున్న సీరియల్స్ కు సీక్వెల్ తీసుకువస్తున్నారు మేకర్స్. ఇందులో ప్రేక్షకులకు శుభవార్త ఏంటీ ? అనుకుంటున్నారా ?. అదెనండి.. కొన్నేళ్లపాటు టీవీల్లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయి.. టీఆర్పీలో సంచలనం సృష్టించిన సీరియల్ కార్తీక దీపంకు ఇప్పుడు సీక్వెల్ వచ్చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. ‘కార్తీక దీపం ఇది నవవసంతం’ అంటూ సీక్వెల్ టైటిల్ కూడా రివీల్ చేశారు. ఇక ఇటీవల విడుదల చేసిన సెకండ్ పార్ట్ ప్రోమో ఆకట్టుకుంటుంది. తెలుగు లోగిళ్లు మరువని కథ కొత్త వెలుగులతో మళ్లీ వస్తోంది అంటూ చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో శౌర్య పాత్రను మాత్రమే చూపించారు. అందులో శౌర్య వాయిస్ తో.. “నాకు చీకటి అంటే భయం.. ఈ చీకటిలో నాకు ధైర్యాన్ని ఇచ్చే వెలుగు మా అమ్మ.. కష్టాల నుంచి కాపాడే మా నాన్న ఎక్కడున్నాడో తెలియదు. కానీ అమ్మైనా.. నాన్నైనా.. నాకు మా అమ్మే. ఇంతకీ నా పేరు ఏంటో తెలుసా శౌర్య.. ఇప్పుడు నేను చెప్పబోయేది మా అమ్మనాన్నల కథ” అంటూ చెప్పుకొచ్చింది. కార్తీకదీపం 2 త్వరలోనే స్టార్ మా ఛానెల్లో ప్రసారం కానుంది. అయితే సెకండ్ పార్ట్ లో వంటలక్క, డాక్టర్ బాబు ఇద్దరు కనిపిస్తారా ?.. ఇద్దరి రీఎంట్రీ ఉంటుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గతంలో కనిపించిన శౌర్య, హిమ, మోనిత పాత్రలు మళ్లీ కనిపిస్తాయా ? అనేది చూడాలి.

బుల్లితెరపై కార్తీక దీపం ప్రభంజనం సృష్టించింది. ఇందులో దీప అలియాస్ వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ కనిపించింది. ఆమె నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సీరియల్ ద్వారా ప్రేమీ విశ్వనాథ్ కు ప్రత్యేక ఫ్యా్న్ బేస్ ఏర్పడింది. అలాగే డాక్టర్ బాబుగా నిరుపమ్ పాత్ర గురించి చెప్పక్కర్లేదు. మొత్తం ఆరేళ్లపాటు 1559 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తెలుగులో అత్యధిక టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్న సీరియల్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సీరియల్ కు సీక్వెల్ మళ్లీ రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.