Karthika Deepam: సవతి తల్లి పెంపకంలో కష్ఠాలు నీకు తెలుసు… మళ్ళీ నీ పిల్లలకు అదే పరిస్థితి రావాలా అంటున్న సౌందర్య

| Edited By: Team Veegam

Apr 07, 2021 | 6:40 PM

ప ఇన్నాళ్లు అనుభవించిన పేదరికం చాలు.. నా కోడలికి ఒక ఉన్నత స్థానం కల్పిస్తాను.. ఫ్యాక్టరీ పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను.. కారులో దర్జాగా వెళ్లేలా చేస్తాను అంటాడు. ఆనందరావు. నా కోడలు ఇడ్లి బండి పెట్టినా...

Karthika Deepam:  సవతి తల్లి పెంపకంలో కష్ఠాలు నీకు తెలుసు... మళ్ళీ నీ పిల్లలకు అదే పరిస్థితి రావాలా అంటున్న సౌందర్య
Karthika Deepam
Follow us on

Karthika Deepam Latest Episode: దేశవిదేశాల్లో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ గా సాగుతుంది కార్తీకదీపం సీరియల్. దాదాపు నాలుగేళ్ళ నుంచి ప్రసారమవుతున్న ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈరోజు (ఏప్రిల్ 7) 1007 ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. దీపని పిల్లలని కార్తీక్ ఇంటికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం..!

దీప ఇన్నాళ్లు అనుభవించిన పేదరికం చాలు.. నా కోడలికి ఒక ఉన్నత స్థానం కల్పిస్తాను.. ఫ్యాక్టరీ పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను.. కారులో దర్జాగా వెళ్లేలా చేస్తాను అంటాడు. ఆనందరావు. నా కోడలు ఇడ్లి బండి పెట్టినా ఇండస్ట్రీ పెట్టినా సక్సెస్ ఫుల్ గా నడిపించే సత్తా నాకోడలుతుంది. తనకు ఉన్నత స్థానం కల్పిస్తాను.. నువ్వేమీ అభ్యంతరం పెట్టవు కదా.. అంటాడు ఆనందరావు.. లేదు డాడీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.. అంటాడు కార్తీక్.. నేను తీసుకొచ్చింది నా భార్యగా కాదు.. మీ కోడలిగా.. దీప ఆరోగ్యం క్షిణిస్తే తట్టుకోలేరు అంటూ.. మనసులో అనుకుని..తనను ఉన్నత స్థాయిలో నిలబెడితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.. నా పిల్లలకు తల్లిగా దీప ఉన్నత స్థాయిలో ఉంటె అది నా పిల్లలకే గౌరవం.. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. డాడీ ప్లీజ్ నా మాట వినండి.. దీప మానసికంగా నలిగిపోయింది. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది.. మీ అందరి ఆదరాభిమానులున్నాయి కనుక కోలుకోవడానికి సమయం పడుతుంది. అప్పుడు బాధ్యతలు అప్పగించండి అంటాడు కార్తీక్.. ఆనందరావు కార్తీక్ .. నువ్వు ఒక్కసారి ఒంటరిగా ఆలోచించు దీప మీద నీకు ప్రేమ ఉందని తెలుస్తోంది. అంటాడు

మురళీ కృష్ణ ఫోటోకి భాగ్యం పూజ చేస్తుంది. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఆస్పత్రిలో చేర్పించి షాక్ ట్రీట్మెంట్ ఇప్పించాలి అంటాడు మురళీ కృష్ణ. దీప దొరికిందా.. దీపని తీసుకొచ్చావా అంటూ భాగ్యం మురళీ కృష్ణను అడుగుతుంది. నేను తీసుకుని రాలేదు.. డాక్టర్ బాబు వచ్చి దీపని పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు అని చెబుతాడు.. దీంతో భాగ్యం షాక్ తింటుంది.

మరోవైపు సౌందర్య.. కార్తీక్ మాటల గురించి ఆలోచిస్తుంది. ఇంతలో హిమ శౌర్య వచ్చి నానమ్మ అంటూ వస్తారు.. మేము ఎక్కడికి వెళ్ళం నానమ్మ.. ఇక్కడ ఉంటేనే అమ్మ బాగుంటుంది.. అమ్మ మిమ్మల్ని రోజూ గుర్తు చేసుకుంటుంది..నేను కూడా మిమ్మల్ని చాలా బాగా గుర్తు చేసుకున్నా అంటుంది. ఇంతలో శౌర్య నానమ్మ నీకు ఒక ఫోటో చూపించాలి అంటూ.. కార్తీక్ ఇడ్లి బండి దగ్గర దోశలు వేస్తున్న ఫోటో చూపిస్తారు.

మరోవైపు సౌందర్య.. కార్తీక్ మాటల గురించి ఆలోచిస్తుంది. ఇంతలో హిమ శౌర్య వచ్చి నానమ్మ అంటూ వస్తారు.. మేము ఎక్కడికి వెళ్ళం నానమ్మ.. ఇక్కడ ఉంటేనే అమ్మ బాగుంటుంది.. అమ్మ మిమ్మల్ని రోజూ గుర్తు చేసుకుంటుంది..నేను కూడా మిమ్మల్ని చాలా బాగా గుర్తు చేసుకున్నా అంటుంది. ఇంతలో శౌర్య నానమ్మ నీకు ఒక ఫోటో చూపించాలి అంటూ.. కార్తీక్ ఇడ్లి బండి దగ్గర దోశలు వేస్తున్న వీడియో చూపిస్తారు. ఏమిటి మీ నాన్న ఈ పనులన్నీ చేశాడా.. అవును నానమ్మ.. అమ్మా దీప తాతయ్య మీ కాళ్ళు పెట్టుకుంటా అన్నా వినకుండా చేశాడు అని చెబుతారు హిమ.. శౌర్యలు ఇంతలో దీప వస్తుంది.. అమ్మా టాబ్లెట్ వేసుకున్నావా అంటుంది శౌర్య.. సౌందర్య ఏమైంది అని అడుగుతుంది.. అమ్మకి హెల్త్ బాగోలేదు అంటారు

దీప పిల్లలని దీపుతో ఆడుకోండి అని పంపిస్తుంది. నాతో ఏమైనా మాట్లాడాలా అంటుంది సౌందర్య.. అవును తప్పు చేశారు అత్తయ్య.. నేను మీకోడలిగా ఉండాల్సి వస్తే.. ఆనాడు ఎందుకు గడప దాటతాను.. ఈ నాడు వరకూ ఎందుకు బయట ఉంటాను.. నాకు కావాల్సింది భర్త మనసులో స్థానం.. ఆయన నన్ను నమ్మాలి.. అపుడు భార్యగా ఇంటికి తీసుకుని రావాలని కోరుకున్నాను అంటుంది దీప.. నాకు తెలుసు.. అయితే నువ్వు ఏదొకరూపంలో ఇక్కడికి రావాలని కోరుకున్నాను. అలాగైనా మీ కష్టాలు తీరతాయని ఒక అత్తగా నానమ్మగా ఆలోచించా సౌందర్య. అది తప్పు ఎలా అవుతుంది.. అని ప్రశ్నిస్తే.. నాకు తప్పే అవుతుంది అంటుంది దీప.. ఎందుకు ఎవరికీ తెలియకుండా ఊరు విడిచి వెళ్ళిపోతాను .. నా మనసు ముక్కలైంది.. ఈ ఇంట్లోనాకు అవమానం జరిగితేనే కదా నాకు అన్యాయం జరిగింది.. నా మనసుకు గాయం అయ్యింది. అందుకే వెళ్లిపోయారు. ఇక్కడికి వచ్చే వరకూ నాకు నిజాంగా తెలియదు..ఆయన భార్యగా నన్ను తీసుకుని రాలేదని.. అంటుంది దీప. భర్త లేనిదే అత్త ఎలా వస్తుంది. అని ప్రశ్నిస్తుంది.

పిల్లలకోసం తీసుకొచ్చినా.. నాకిచ్చిన మాట కోసం తీసుకొచ్చినా వాడిలో కొంచెమైనా మార్పు వచ్చింది కదా.. ఇదివరకు అంత కోపం వాడిలో లేదు.. నిదానంగా వడిలో మార్పు వస్తుంది. దూరంగా ఉండే కంటే.. దగ్గరగా ఉంటె మార్పు వస్తుంది ఎక్కడో ఉండి ఎప్పుడొస్తాడో.. తెలియక నువ్వు పడే బాధ కొంచెం అయినా తప్పుతుంది. అంటుంది సౌందర్య..

లేదు అంటుంది దీప.. నేను ప్రేమించే మనిషి నన్ను ద్వేషిస్తుంటే.. కళ్ళ ముందు తిరగలేను అంటుంది దీప. భర్త ఉండి నేను ఒక అతిథిలా ఉండాల్సి రావడం కంటే నరకం లేదు.. అంటుంది దీప.. నాకు తెలుసు దీప ఆడదానిగా నువ్వు పడుతున్న బాధ.. ఏ ఆడది భరించలేదు.. అయినా నువ్వు ఉండాలి.. పిల్లల భవిష్యత్ కోసం.. నీ భర్తలో మార్పు కోసం ఉండాలి.. లేదు.. ఆయనలో మార్పు రాదు అందుకనే కాదా నేను వెళ్ళిపోయింది. అంటుంది దీప.. ఆ మార్పు వచ్చిందనే కదా మళ్ళీ వచ్చింది అని సౌందర్య అనగానే .. లేదు నేను మోసపోయాను అత్తయ్య.. ఆయనలో మార్పు వచ్చింది అని వచ్చాను.. కానీ ఇక్కడకు వచ్చాక తెలిసింది.. వాడు చేసింది మోసం కాదు దీప.. గత్యంతరం లేదు వాడికి. నిన్ను పిల్లల్ని ఆ ఇడ్లి బండికి అంకితం చేసి… ఇక్కడ వాడు దర్జాగా ఉండలేదు వాడు.

నీకు ఇంకో మాట చెప్పాలి ఇది మోనిత విషయం ..అంటూ హిమ కోసం పెట్టిన ప్రపోజల్ గురించి చెబుతుంది. అందుకనే దీనికి పరిష్కారం ఆలోచించా.. మోనిత నీ స్థానంలో రాకూడాదు అంటే.. నీ స్థానంలోకి నువ్వు రావాలి.. మోనిత కు ఎలాంటి అవకాశం దక్కనీయకూడదు. అందుకనే కార్తీక్ ని ఇలా కోరాను.. ఇదంతా నీ భవిష్యత్ కోసం పిల్లల భవిష్యత్ కోసం కోరాను.. సరే నువ్వు అన్నట్లుగానే తప్పు చేశాను.. తప్పే చేశాను.. ఇది వరమా శాపమా అని ఆలోచించే సమయం లేదు. వాడిని పెళ్లి చేసుకోవడం కోసమైనా మోనిత ఊరూర జల్లెడ పడ్తుంది.. ఆలోపు నువ్వు రావాలని ఈ కోరిక కోరాను.

నువ్వు సవతి తల్లి పెంపకంలో పెరిగావు.. ఎన్ని కష్టాలు పడ్డావో నీకు తెలుసు. అదే గతి నీ పిల్లలకు ఏర్పడితే నువ్వు భరించగలవా.. మోనిత నీ పిల్లలకు తల్లిగా ఉండగలదా.. ఒక్కసారి ఆలోచించు. మోనిత ఎందుకు హిమనీ తీసుకుని రాలేదు .. దాని ఉద్దేశం ఏమిటో అదే బయటపెడుతుంది నువ్వు ఏమీ ఆలోచించకు దీప అంటుంది సౌందర్య.
ఇక కార్తీక్ రూమ్ లో నాన్న టిఫిన్ సెంటర్ బోర్డు చూసిన హిమ, శౌర్య లు ఏమిటి అని అడుగుతారు. మీరు పెట్టిన పేరే.. మీ కోసమే తీసుకొచ్చాను.. నాన్నను నమ్మలేదు.. నాన్న పేరు పెట్టుకుని టిఫిన్ అమ్ముతున్నారు. నాన్న అక్కర్లేదు కదా అంటదు కార్తీక్.. మేము కావాలని వెళ్ళలేదు. మీరు ఉండమని అడగలేదు అంటారు పిల్లలు. నేను మిమ్మల్ని ఉండమని అడిగితె మీరు ఉండేవాళ్లా.. అని ప్రశ్నిస్తాడు కార్తీక్ .. అమ్మని కూడా ఉండమని అడిగితె మేము ఉండేవాళ్ళం అని చెబుతారు. నాకు తెలుసు.. అందుకే ఉండమనలేదు..

మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు డాడీ.. అప్పుడు ఉండమంటే.. అమ్మ ఇంత కష్టపడేది కాదు.. ఆరోగ్యం పాడుచేసుకునేది కాదు.. నువ్వు గుర్తుకొస్తే బాగా ఏడుపొచ్చేది.. నేను ఫోన్ చేయాలనుకున్నా శౌర్య అంటుంది.. నేనే వద్దన్నా అంటుంది.. హిమ.. మరి నాన్న అంటే ప్రేమ లేదా అంటే.. నువ్వు రావు కదా నాన్న అంటుంది హిమ.. మేమే కాదు అమ్మ కూడా నిన్ను తలచుకునేది.. డాక్టర్ బాబు దేవుడు అని అమ్మ కూడా చెప్పేది..అంటుంది శౌర్య. దీంతో కార్తీక్ కు తాను దీపని అన్న మాటలు గుర్తుకొస్తాయి. అమ్మ వెళ్లినప్పటి నుంచి నిన్ను తలచుకుని ఉంది. బొట్టులో మంగళ సూత్రం లో నువ్వు ఉంటావంట అని శౌర్య చెబితే కార్తీక్ కన్నీరు పెడతాడు..దీప అత్తగారి మాటకు విలువ ఇచ్చి ఇంట్లో ఉంటున్నా.. లేక మళ్ళీ పిల్లలని తీసుకుని బయటకు వెళ్తుందా.. మరి రేపటి ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి మరి

Also Read: మీలో సృజనాత్మక ఉందా..! అయితే మాస్కు తయారు చేయండి.. 3. కోట్లు గెలుచుకోండి..

కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!

ఆ గ్రామ ప్రజలు పేరుకే కోటీశ్వరులు.. అసలు బట్టలే ధరించరు.. పర్యాటకులకు ఇదే రూల్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!