Karthika Deepam Serial: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది. ఈరోజు తో 1016 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టిన కార్తీక దీపం సీరియల్ మంచి రసపట్టు సాగుతుంది. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ ఏమిటో చూద్దాం..
దీప ఫ్యామిలీ మొత్తం కలిసి సంతోషంగా ఉంటారు. ఆనందావు సంతోషంగా ఉందని అంటాడు. దీప వంట చేస్తాను అంటే.. సౌందర్య నువ్వు ఈ ఇంటి కోడలు.. నీకు అవసరం లేదు.. అంటే.. ఇవాళ ఈ వంటలక్క వంట రుచి చూడండి. నా ఇంట్లో నేను దర్జాగా గరిట తిప్పుతాను అంటుంది. శ్రావ్య వంట మీద అందరూ జోక్స్ వేసుకుంటూ సంతోషంగా నవ్వుకుంటారు. పదేళ్లు ఏడిచాను. మిగతా జీవితం అంతా నాకుటుంబం మధ్య భద్రంగా బతికేచాలు. ఇలాగే నవ్వుతూ పోయినా నాకు సంతోషమే అంటుంది. దీపని చూడడానికి వచ్చిన భాగ్యం సందడి చేస్తుంది. నేను దీపతో గొడవపడానికి వచ్చాను వదిన. అల్లుడుగారు నయాపైసా ఖర్చులేకుండా మందులు ఇస్తే.. ఎందుకు మందులు వేసుకోను అన్నావు అంటూ అడుగుతుంది. అక్కడ ఆసుపత్రికి వెళ్లారు.. మందులు వేసుకున్నారు అని చెబుతుంది శ్రావ్య. వంటలక్క డాక్టర్ బాబు కలిసిపోయారని తెలిసి సంతోషపడుతుంది. మురళీ కృష్ణను భోజనానికి పిలుస్తుంది.
మరోవైపు మోనిత కారులో వస్తున్న కార్తీక్.. దీప ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. మోనిత ని దీప అని పిలుస్తాడు. దీంతో మోనిత కోపంతో రేపు దీపకి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు అంటుంది. దీప ఎంతైనా నీ భార్య కదా అంటుంది. నీకు దీప మీద ఇంత సాప్ట్ కార్నర్ ఉందా.. ఏమిటి ఇంత మార్పు అని అడిగితే .. ఇంకొన్ని రోజుల్లో ఈ మార్పు ఏమిటో తెలుసుకుంటావు అని నవ్వుకుంటుంది మోనిత.
కార్తీక్ ని ఇంటి దగ్గర దింపుతూ.. దీప జాగ్రత్త అని చెబుతుంది. ఇంట్లోకి వస్తూ .. సంతోషంగా ఉన్న దీపని చూసి.. డాక్టర్ మాలతి చెప్పిన మాటలు గుర్తు తెచ్సుకుంటాడు. ఇంతలో నవ్వడం ఆపేసిన వాళ్ళను చూసి.. శౌర్య దెబ్బలాడుతుంది.. కార్తీక్.. శౌర్యని దగ్గరకి తీసుకుని టాబ్లెట్స్ వేసుకున్నావా.. అందరూ గమనిస్తూ ఉండాలి.. వేసుకోక పోతే చెవి మెలేయండి అంటాడు కార్తీక్. సౌందర్య నువ్వు ఏమందు ఇచ్చావో తెలియదు.. నా కోడలి ముఖం నవ్వుతు.. ప్రశాంతంగా నిర్మలంగా కనిపిస్తుంది అంటుంది.
హిమ శౌర్యలు తన తల్లితో మాట్లాడుతున్న కార్తీక్ ని చూసి సంతోష పడతారు.. కార్తీక్ ని భోజనానికి రమ్మని పిలుస్తారు.. ప్రెష్ అయ్యి వస్తాను అన్న కార్తీక్ తో .. నీ పెళ్ళామే వంట చేసింది అని సౌందర్య చెబుతుంది. దీంతో మాలతి ఏమయ్యింది అమ్మా.. దీపకి హెల్త్ బాగోలేదు అని తెలుసుకదా.. ఎందుకు వంట చేసింది.. వంటలక్కగా రిటైర్ అవ్వమను.. మాలతి ఉందిగా వంట చేస్తుంది అని మండిపడతాడు.. నీ పెళ్ళాన్ని మేము కష్టపెట్టలేదు.. అది వంట మాత్రమే చేసింది. మిగతావన్నీ మేము చేశామని అంటుంది సౌందర్య. దీపకి వచ్చిన వ్యాధి గురించి చెబితే.. ఎవరూ తట్టుకోలేరు అంటూ తనలో తానే మధనపడతాడు. ఒక్కరోజులోనే మీ ఆయన ఎంత మారిపోయాడే.. నీతో వంట కూడా చేయించకూడదు అంట.. అని సంతోష పడుతుంది సౌందర్య. కార్తీక్ రియాక్షన్ గురించి దీప ఆలోచించడం మొదలు పెడుతుంది.
నిద్రపోతున్న ప్రియమణి ని మోనిత తిడుతుంది.. కారులో చికెన్ ఉంది. తెచ్చి. ధామ్ బిర్యానీ చేయి అంటుంది. ఇంతలో వారణాసికి ఫోన్ చేసి.. కార్తీక్ కారు బాగుచేయించి ఇవ్వమని చెబుతుంది.
సౌందర్య ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం చేస్తుంటే.. కార్తీక్ వస్తాడు. తనను టెర్రస్ మీదకు వెళ్ళమని సౌందర్య చెబుతుంది. దీంతో కార్తీక్ నేను ఇక్కడే తింటా అని అంటే.. అందరూ ఏమైంది అని ప్రశ్నిస్తారు. కార్తీక్ టెర్రస్ మీదకు భోజనానికి వెళ్లకపోతే దీప తో పాటు. తాను కూడా మందులు వేసుకోనని ఆనందరావు బెదిరిస్తాడు.. మరి కార్తీక్ దీప పిల్లల తో కలిసి భోజనం చేస్తాడా.. లేక తన రూమ్ కి వెళ్తాడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాల్సిందే..
Also Read: ప్రపంచంలోనే అతిపొడవైన జుట్టు 12 ఏళ్ల తర్వాత కట్.. ఆ హెయిర్ ను ఏంచేసిందంటే..!