Nirupam Paritala: కొత్తింట్లోకి అడుగుపెట్టిన డాక్టర్ బాబు.. కల నెరివేరిందంటూ పోస్ట్..

|

Apr 18, 2024 | 4:35 PM

తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ అడియన్స్ డాక్టర్ బాబు అని పిలుచుకుంటారు. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో నిరుపమ్ దంపతులకు ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. నిరుపమ్ భార్య మంజుల నెట్టింట సందడి చేస్తుంటుంది. అటు ఇన్ స్టా.. ఇటు యూట్యూబ్ లో వరుస వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా తమ సొంతింటి కలను నెరవేర్చుకున్నారు నిరుపమ్ దంపతులు. ఇందుకు సంబంధించిన ఫోటోలోను నెట్టింట షేర్ చేశారు.

Nirupam Paritala: కొత్తింట్లోకి అడుగుపెట్టిన డాక్టర్ బాబు.. కల నెరివేరిందంటూ పోస్ట్..
Nirupam Paritala, Manjula P
Follow us on

బుల్లితెరపై అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించికున్న నటుడు నిరుపమ్ పరిటాల. చంద్రముఖి సీరియల్ ద్వారా మొదలైన ప్రయాణం.. ఇప్పటికీ ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో నిరుపమ్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పుక్కర్లేదు. కార్తీక దీపం సీరియల్ తో మరింత గుర్తింపు వచ్చింది. దాదాపు ఏడు సంవత్సరాలు ఈ సీరియల్ మంచి ఆదరణ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ అడియన్స్ డాక్టర్ బాబు అని పిలుచుకుంటారు. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో నిరుపమ్ దంపతులకు ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. నిరుపమ్ భార్య మంజుల నెట్టింట సందడి చేస్తుంటుంది. అటు ఇన్ స్టా.. ఇటు యూట్యూబ్ లో వరుస వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా తమ సొంతింటి కలను నెరవేర్చుకున్నారు నిరుపమ్ దంపతులు. ఇందుకు సంబంధించిన ఫోటోలోను నెట్టింట షేర్ చేశారు.

శ్రీరామనవమి సందర్భంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు నిరుపమ్ దంపతులు. ఈ విషయాన్ని తెలుపుతూ మంజుల ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. చంద్రముఖి సీరియల్ ద్వారా మంజుల తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. ఇందులో జంటగా నటించిన సమయంలోనే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. నిరుపమ్, మంజుల దంపతులకు ఓ బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత చాలాకాలం పాటు సీరియల్లకు దూరంగా ఉన్న మంజుల ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. పాజిటివ్ కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తుంది.

అలాగే ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ విషయాలు, వెకేషన్స్, టూర్స్ ఇలా అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక అప్పుడప్పుడు నిరుపమ్ సైతం భార్యతో కలిసి ఫన్నీగా వీడియోస్ షేర్ చేస్తుంటాడు. ప్రస్తుతం నిరుపమ్, మంజుల కొత్తింటి ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇక నిరుపమ్‌ దంపతులకు టీవీ నటీనటులు, సన్నిహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.