రౌడీతో జాన్వీ… పూరి ప్లాన్ నిజమేనా?

| Edited By:

Aug 17, 2019 | 6:11 PM

ప్రముఖ నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన భామ జాన్వీ కపూర్‌. తొలి సినిమా ధడక్‌తోనే నటిగా మంచి మార్కులు సాధించిన ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్‌కు పరిచయం కానుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఆ బాధ్యతను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసుకున్నారట. ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్‌ హిట్ అందుకున్న పూరి, తదుపరి చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలోనే జాన్వీ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. గతంలో జాన్వీ, సౌత్‌ హీరోల్లో విజయ్‌ […]

రౌడీతో జాన్వీ... పూరి ప్లాన్ నిజమేనా?
Follow us on

ప్రముఖ నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన భామ జాన్వీ కపూర్‌. తొలి సినిమా ధడక్‌తోనే నటిగా మంచి మార్కులు సాధించిన ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్‌కు పరిచయం కానుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఆ బాధ్యతను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసుకున్నారట. ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్‌ హిట్ అందుకున్న పూరి, తదుపరి చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలోనే జాన్వీ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. గతంలో జాన్వీ, సౌత్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ అంటే తనకు ఇష్టమని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో విజయ్‌తో నటించేందుకు జాన్వీ ఓకె చెప్పే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై పూరి టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.