Jabardasth Tanmay: ‘మా నాన్న చనిపోయినప్పుడు జబర్దస్త్‌లో అతనొక్కడే సాయం చేశాడు’: జబర్దస్త్ తన్మయి ఎమోషనల్

జబర్దస్త్ టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో తన్మయి ఒకరు. తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించే ఆమె తన జీవితంలో పలు కన్నీటి కష్టాలున్నాయంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన్మయి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చింది.

Jabardasth Tanmay: మా నాన్న చనిపోయినప్పుడు జబర్దస్త్‌లో అతనొక్కడే సాయం చేశాడు: జబర్దస్త్ తన్మయి ఎమోషనల్
Jabardasth Tanmayi

Edited By:

Updated on: May 07, 2025 | 1:21 PM

అబ్బాయిగా పుట్టినప్పటికీ తానెందుకు అమ్మాయిగా మారాల్సి వచ్చిందో ఓ టీవీ షోలో ధైర్యంగా చెప్పుకొచ్చింది తన్మయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా తాను లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తన్మయి వెల్లడించింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుందామె. అయితే ప్రస్తుతం అడపాదడపా మాత్రమే టీవీ షోల్లో కనిపిస్తోంది తన్మయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తన్మయి. రీల్స్, వీడియోలు చేస్తూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఎక్కువ శాతం జబర్దస్త్ నటీనటులతో డ్యాన్స్ రీల్స్ చేస్తుంటుంది తన్మయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో తాను పడిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనలైంది. కాగా గతేడాది ఆగస్టులో తన్మయి తండ్రి కన్నుమూశాడు. ‘కొడుకునైనా, కూతురినైనా నేను మీ బిడ్డనే’ అంటూ దుఃఖాన్ని దిగమింగుతూ తానే దగ్గరుండి తండ్రి అంతిమ సంస్కారాలన్నీ నిర్వహించింది.

‘ముందు రోజు షూటింగ్ చేసుకొని రాత్రి ఇంటికి వచ్చి నాన్నతో వీడియో కాల్ మాట్లాడాను. ఆ తర్వాతి రోజే ఉదయం 11 గంటలకు నాన్న చనిపోయాడు అని వార్త వచ్చింది. నాకు ఏం చేయాలో తెలియలేదు. దుఃఖం పొంగుకొచ్చింది. కాళ్లు చేతులు ఆడలేదు. నేను విజయవాడ వెళ్లాలి. కొంతమందికి ఫోన్ చేశాను. కానీ కుదరదన్నారు. ఇమ్మాన్యుయేల్ కి షూట్ ఉంది లేకపోతే వచ్చేవాడు. కానీ నా కోసం అన్నీ పనులు వదిలి పెట్టుకుని నూకరాజు వచ్చాడు. అతని పనులు, షూటింగ్ అన్ని వదులుకొని నాకు తోడుగా వచ్చాడు. కార్ తీసుకొని వచ్చి నన్ను విజయవాడకు తీసుకెళ్లాడు. నన్ను ఓదారుస్తూ, నాకు దైర్యం చెప్తూ నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పాడు. ఆ క్లిష్ట సమయంలో జబర్దస్త్ లో నూకరాజు తప్ప ఇంకెవరూ సపోర్ట్ చేయలేదు’

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ నూకరాజుతో తన్మయి..

నూకరాజుతో  కలిసి తన్మయి డ్యాన్స్..

‘ఇప్పుడు నాకు ఉన్న ఫ్రెండ్స్ నూకరాజు, ఇమ్మాన్యుయేల్ మాత్రమే. వారిద్దరు నన్ను అక్కా అని పిలుస్తారు. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నేను ఎవరితోనూ షేర్ చేసుకోను. కానీ వాళ్లు నాకు సపోర్ట్ చేస్తారు’ అని చెప్పుకొచ్చింది తన్మయి.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us