Jabardasth Vinod: పోలీసులను ఆశ్రయించిన జబర్థస్త్ వినోద్.. అతనిపై ఫిర్యాదు.. న్యాయం చేయాలని కోరిన కమెడియన్..

జబర్ధస్త్ షో ఎంతోమందికి సెలబ్రెటీ హోదాను తీసుకువచ్చింది. ఇక ఈ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తమదైన కామెడీతో ప్రేక్షకును ఆకట్టుకునే

Jabardasth Vinod: పోలీసులను ఆశ్రయించిన జబర్థస్త్ వినోద్.. అతనిపై ఫిర్యాదు.. న్యాయం చేయాలని కోరిన కమెడియన్..
Jabardasth Vinod

Edited By:

Updated on: Apr 08, 2021 | 8:08 PM

జబర్ధస్త్ షో ఎంతోమందికి సెలబ్రెటీ హోదాను తీసుకువచ్చింది. ఇక ఈ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తమదైన కామెడీతో ప్రేక్షకును ఆకట్టుకునే నటులలో వినోద్ ఒకరు. వినోద్ అని పిలిస్తే కాకుండా.. వినోదిని అంటే అందరికి ఠక్కున గుర్తోస్తుంది. అందమైన ముఖం చక్కటి స్వరంతో అచ్చం అమ్మాయిగా కనిపిస్తూ.. జబర్ధస్త్ వేదికగా ప్రేక్షకులను ఫుల్‏గా నవ్విస్తాడు. తాజాగా ఈయన మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలంటూ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని ఆయన ఆఫీసులో కలిసి తను అద్దెకుంటున్న ఇంటి యాజమానిపై ఫిర్యాదు చేశాడు. గతంలో ఆయన అద్దెకుంటున్న ఇంటిని కొనుక్కుందామని ఆ ఇంటి ఓనర్‏కు రూ.13 లక్షలు అడ్వాన్స్‏గా ఇచ్చినట్లు తెలిపాడు. అయితే అప్పట్లో రూ.40 లక్షలకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు వెల్లడించాడు..

కానీ ఇప్పుడు ఆ ఇంటి యజమాని ఎక్కువ డబ్బులు ఇస్తేనే ఇంటిని అమ్ముతానని.. ఒకవేళ ఇల్లు కొనుక్కోకపోతే.. అడ్వాన్స్‏గా ఇచ్చిన రూ.13 లక్షలు కూడా వెనక్కి ఇవ్వనని చెప్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కోన్నాడు. గతంలో వినోద్ ఇంటి యాజమాని అతనిపై దాడి చేసినట్టు కాచిగూడ పోలీస్ స్టేషన్‏లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు వినోద్ కంటి భాగంలో తీవ్ర గాయమైంది. అలాగే వినోద్ ఫ్యామిలీ అతనికి పెళ్లి చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా అతను తన మణికట్టును కట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read: Naga Chaitanya: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ వాయిదా..

రోడ్డెక్కిన ‘కార్తీకదీపం’.. డాక్టర్ బాబు.. వంటలక్క కలవాలంటూ ఫ్లెక్సీలు.. ఎక్కడో తెలుసా..