
ప్రస్తుతం వెండితెరపై, బుల్లితెరపై నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న తారల గురించి చెప్పక్కర్లేదు. కానీ సినిమాల్లో తమ కామెడీతో అలరించే హాస్యనటుల జీవితాల్లో ఎంతో విషాదం దాగి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది కమెడియన్స్ తమ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తాజాగా జబర్దస్థ్ కమెడియన్ తన జీవితంలో ఎదురైన అవమానులు, ఆర్థిక కష్టాలను గుర్తు చేసుకున్నారు. అతడే జబర్దస్త్ కమెడియన్ నరేశ్. తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఒకప్పుడు ఎన్నో కష్టాలు చూసిన అతడు కామెడీ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు, పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..
నరేశ్ మాట్లాడుతూ.. “మాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఆస్తులు లేవు. మా నాన్నకు ట్రాలీ ఆటో ఉండేది. కానీ సరిగ్గా ఈఎమ్ఐ కట్టలేదని ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లిపోయారు. అప్పుడు మాకు చిన్న చెత్త షాప్ ఉండేది. పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలు కొనేవాళ్లం. అప్పుడు నేను ఆ షాపులోనే ఉండేవాడిని. కానీ పరిస్థితులు బాగలేక దానిని కూడా అమ్మేశాం. నాకు చదువు అంతగా రాలేదు. తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నాను. ఒకరోజు ఢీ జూనియర్స్ ఆడిషన్స్ కు వెళ్లాను. అక్కడ పరిచయమైన వ్యక్తి నన్ను జబర్దస్త్ కు తీసుకెళ్లారు. అప్పుడు సుధాకర్ అన్న చూసి యాక్టివ్ గా ఉన్నాను అని చంటి అన్నకు పరిచయం చేశారు. అక్కడ ఒక స్కిట్ వేయించారు. ఆ తర్వాత అక్కడే సెటిల్ అయిపోయాను” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
“నేను చాలా కమర్షియల్ అని ప్రచారం జరిగింది. ఇలాంటి స్నేహితుడంటే కట్ చేసేయండి అని నన్ను విమర్శించారు. కానీ నేనంత కమర్షియల్ కాదు. సినిమా అవకాశాలు వస్తున్నయి.. కానీ డేట్స్ కుదరడం లేదు. ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత సినిమాలకు షిఫ్ట్ అవుతాను” అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..