Bigg Boss 7: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టనున్న టీమిండియా క్రికెటర్‌ ! ఎవరో తెలుసా?

ఏడో సీజన్‌కి సంబంధించి ఇటీవల స్టార్‌ మా బిగ్‌బాస్‌ సీజన్‌ 7 టైటిల్‌ ప్రోమోను రిలీజ్‌ చేసి చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా బిగ్‌బాస్‌ 7 సీజన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. బిగ్‌బాస్‌ 7 ఎప్పుడు ప్రారంభం కానుంది? ఈసారి హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు ఎవరు? అనే అంశాలపై ఓ పెద్ద చర్చ జరుగుతూనే ఉంది.

Bigg Boss 7: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టనున్న టీమిండియా క్రికెటర్‌ ! ఎవరో తెలుసా?
Bigg Boss 7 Telugu

Updated on: Jul 18, 2023 | 3:05 PM

బుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌’ మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే సక్సెస్‌ ఫుల్‌గా ఆరు సీజన్లను కంప్లీట్‌ చేసుకున్న ఈ మెగా టీవీ షో ఈసారి మరిన్ని హంగులతో మన ముందుకు రానుంది. సుమారు 3 నెలల పాటు సాగే ఈ ఎంటర్‌టైన్మెంట్ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏడో సీజన్‌కి సంబంధించి ఇటీవల స్టార్‌ మా బిగ్‌బాస్‌ సీజన్‌ 7 టైటిల్‌ ప్రోమోను రిలీజ్‌ చేసి చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా బిగ్‌బాస్‌ 7 సీజన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. బిగ్‌బాస్‌ 7 ఎప్పుడు ప్రారంభం కానుంది? ఈసారి హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు ఎవరు? అనే అంశాలపై ఓ పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌7 కు సంబంధించిన ఒక వార్త ట్రెండింగ్‌లో ఉంది. అదేంటంటే.. టీమిండియా మాజీ క్రికెటర్‌, ఆంధ్రా ప్లేయర్‌ వై. వేణుగోపాల రావు ఈ మెగా షోలోకి రానున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇందుకోసం బిగ్‌బాస్‌ నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట.

ఒకవేళ ఇదే నిజమైతే బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన తొలి క్రికెటర్‌గా వేణుగోపాలరావు రికార్డు క్రియేట్ చేయనున్నాడు. కాగా భారత జట్టు తరఫున ఆడిన అతి తక్కువ మంది తెలుగు క్రికెటర్లలో వేణు కూడా ఒకడు. అలాగే ఐపీఎల్‌ ప్రారంభంలో దక్కన్‌ ఛార్జర్స్‌ తరఫున ఆడి క్రికెట్‌ అభిమానులను అలరించాడు. టీమిండియా తరఫున 16 వన్డేలు మాత్రమే ఆడిన వేణు ఐపీఎల్‌లో 65 మ్యాచ్‌లు (2008-2014 ఆడాడు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. అయితే వేణుగోపాల రావు బిగ్ బాస్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Venugopal Rao

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.