Gunde Ninda Gudi Gantalu: మెడ పట్టి బయటకు గెంటిన ప్రభావతి.. రోహిణి మరో అతి పెద్ద సీక్రెట్‌

Gunde Ninda Gudi Gantalu August 6th Episode: మనస్ఫర్థలు .. కుటుంబంలో కలహాలు.. ఆనందాలు.. నమ్మకద్రోహం.. ఇలాంటి రకరకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న "గుండెనిండా గుడిగంటలు" సీరియల్‌ సరికొత్త ట్విస్ట్‌తో ఈ రోజు ఆగస్ట్‌ 6న ప్రసారం కాబోతోంది. కథలో ట్విస్ట్‌ అండ్‌ టర్న్ ల కోసం రివ్యూ చూసేయండి.

Gunde Ninda Gudi Gantalu: మెడ పట్టి బయటకు గెంటిన ప్రభావతి.. రోహిణి మరో అతి పెద్ద సీక్రెట్‌
Gunde Ninda Gudi Gantalu August 6th Episode
Image Credit source: JioHotstar

Edited By:

Updated on: Aug 06, 2026 | 3:54 PM

“గుండెనిండా గుడిగంటలు” సీరియల్‌ సరికొత్త ట్విస్ట్‌తో ఆసక్తికరంగా సాగుతోంది. మనోజ్‌ భార్యగా ఇంట్లోకి అడుగుపెట్టిన రోహిణి అసత్యాల బండారం బయటపడుతుంది. మాణిక్యం జరిగిందంతా చెప్పేయడంతో ప్రభావతి, మనోజ్‌ షాకవుతారు. మనోజ్‌ అత్యాశకు తగిన శాస్తి జరిగిందని మీనా, బాలు అనుకుంటారు. “వెళ్లిపో .. ఈ ఇంట్లో నీకు స్థానం లేదు”.. అంటూ రోహిణిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది ప్రభావతి. విద్య దగ్గరికి వెళుతుంది రోహిణి. తను ఎంతకైనా తెగిస్తుంది. పెద్ద కోడల్ని తన్ని తరిమేసారని ప్రభావతిపై నిందలు వేస్తారు. అప్పుడు తనను వెతుక్కుంటూ రాకపోతారా? తిరిగి ఆ ఇంటికి వెళ్లకపోతానా .. అని విద్య దగ్గర బిల్డప్‌ ఇస్తుంది.

ఇదంతా నీ వల్లే.. రోహిణి కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు..బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ చేయకుండా గుడ్డిగా నమ్మేశాం..ఈ ఎపిసోడ్‌లో
ప్రభావతి మరొకామెను తప్పుపట్టడం ఆసక్తికరంగా సాగుతుంది. ఆ శాల్తీ పని పడతాను అంటూ ఆవేశంగా బయల్దేరుతుంది.

రోహిణి మోసాన్ని మాణిక్యం బయటపెట్టడంతో ..”కోటీశ్వరుడి కూతురని అబద్ధాలు చెప్పి.. నన్ను భ్రమలో పెట్టి .. ఇంతకాలం నా ఇంట్లో ఎలా ఉన్నావే ..” ప్రభావతి రోహిణిని ఓ ఆట ఆడేసుకుంటుంది.పెళ్లాం చేతిలో ఇలా మోసపోయానేంటి.. ఓ బిగ్‌ ఫూల్‌ని.. అంటుంటాడు మనోజ్‌. “ఒక మటన్‌ కొట్టు అతన్ని తీసుకొచ్చి.. మామయ్య అని చెప్పింది. అది గుర్తొస్తుంటుంటే ఒళ్లంతా భగభగమండిపోతోంది.. నా భర్త నన్ను ముందూ వెనకా ఆలోచించుకొమ్మని .. ఎంత చెప్పినా వినలేదు .. ఆయన మాటల్ని పెడచెవిన పెట్టాను..కట్టుకున్న భర్త మనోజ్‌.. నిన్నెంత ప్రేమించాడు.. ఎంత నమ్మాడు.. వాడికైనా నిజం చెప్పాలని అనిపించలేదా నీకు..రోహిణితో అంటుంది ప్రభావతి.

రోహిణికి మెసేజ్‌ చేస్తుంది విద్య.. రోహిణి ఎలా ఉందో ఏమో.. క్షేమంగా ఉంటే చాలు.. అనుకుంటుంది. డోర్‌ తీస్తూనే లోపలికి వస్తుంది రోహిణి.. “నీ కెన్ని సార్లు ఫోన్‌ చేసినా ఫోన్‌ లిఫ్ట్‌ చేయవేంటి? నువ్వెళ్లిన పెళ్లి .. మాణిక్యం పెళ్లి ఒక్కటే.. అది చెప్పాలనే నీకు కాల్‌ చేసాను.. ఇంతకీ ఏమైంది? ” విద్య అంటుంది. ” ఏం జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. మాణిక్యం మలేషియా విషయం నాటకమని తెలిసిపోయింది.. ఇంట్లో అందరి ముందు నా పరువును బజారున పెట్టినంత అవమానం జరిగింది. జుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చి బయటికి తోసేసింది అత్తయ్య.. ” విద్యతో రోహిణి అంటుంది.

” అవునూ.. మలేషియా విషయం మాత్రమే బయటపడిందా.. నీకు పెళ్లయి కొడుకు కూడా ఉన్నాడన్న విషయం తెలిసిందా” రోహిణితో విద్య అంటుంది. ” ఆ విషయం కూడా బయటపడితే .. నీ ఇంటికి నేనొచ్చేదాన్ని కాదు.. నా పెద్ద కర్మ అతని ఇన్‌విటేషన్‌ వచ్చేది.. ఇన్నాళ్లూ నిజం ఎక్కడ బయటపడుతుందో అని భయపడేదాన్ని.. ఇక భయం అవసరం లేదు.. నా మనోజ్‌తో హ్యాపీగా ఉంటాను.” ” చింటూ పెద్ద సీక్రెట్‌ మెయింటెయిన్‌ చేస్తున్నావు.. దాని గురించి భయం లేదా..” రోహిణితో విద్య అంటుంది.

“హలో .. నమస్కారం.. బాగున్నారా.. చల్లగా ఉండండి..” మనోజ్‌ పదే పదే అదే మాట అంటుంటాడు. “రోహిణిని వెనక్కి తీసుకురాను..జీవితంలో రోహిణిని చూడను” మనోజ్‌ అనేసి వెళ్లిపోతాడు. “నేనెంతగానో నమ్మే కామాక్షి రోహిణిని పరిచయం చేసింది.. అందుకే నమ్మాను.. నమ్మిన పాపానికి నిలువునా ముంచేసింది. కామాక్షి పని చెప్తాను..అంతు చూస్తా .. కోపంతో రగిలిపోతుంది ప్రభావతి. చేతిలో గొడుగుతో కామాక్షి ఇంటికి వెళుతుంది. ప్రభావతి అన్నంత పనీ చేసిందా? ఈ సాయంత్రం స్టార్‌ మా లో ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో చూడండి.

Loading...
Unable to load recommendations.
Follow Us