Gunde Ninda Gudi Gantalu: రోహిణి ఫ్రాడ్‌ బట్టబయలు.. అపర కాళిలా ప్రభావతి..!

Gunde Ninda Gudi Gantalu August 5th Episode: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్‌లో రోహిణి చేసిన మోసం బయటపడటంతో ఇంట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుంది. మాణిక్యం ఒక్కో నిజాన్ని బయటపెట్టగా, ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది. రోహిణి అసలు బాగోతం తెలుసుకున్న మనోజ్ తాను మోసపోయానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu: రోహిణి ఫ్రాడ్‌ బట్టబయలు.. అపర కాళిలా ప్రభావతి..!
Gunde Ninda Gudi Gantalu Aug 5 Episode
Image Credit source: JioHotstar

Edited By:

Updated on: Aug 05, 2026 | 1:27 PM

గుండె నిండా గుడి గంటలు బుధవారం సీరియల్‌లో రోహిణి చేసిన మోసం బయటపడటంతో రోహిణిని అంతా ఛీదరించుకుంటారు. తనేం తప్పు చేసాననీ అంతా దాడికి దిగారని రోహిణి ఎదురు ప్రశ్నిస్తుంది. రోహిణిలో పశ్చత్తాపం ఎక్స్‌పెక్ట్‌ చేసిన ప్రభావతి అపర కాళి అవుతుంది. రోహిణి పాపాల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతాడు మాణిక్యం. రోహిణి మోసం చేసిన విషయాన్ని ఆ నిజాల్ని బాలు ఇంటికి వచ్చి మాణిక్యం పూసగుచ్చినట్లు చెప్తాడు. మాణిక్యం బయటపెట్టిన రోహిణి బాగోతం విని కంగుతింటారు ప్రభావతి, మనోజ్. పెళ్లాం చేతిలో మోసపోయిన బిగ్‌ ఫూల్‌ నేను అంటూ మనోజ్‌ బాధపడుతుంటాడు.

పెళ్లింట్లో నగలు కొట్టేయబోయిన దొంగ జంట పద్మ, పురుషోత్తంను రెడ్‌ హాండెడ్‌గా పట్టుకున్న బాలు మీనాకి స్వీట్‌ ఇస్తే సరిపోదు సన్మానం చేయాల్సిందే అని రంగతో అంటాడు మాణిక్యం. చెపినట్లుగా బ్యాండ్‌ వాళ్లను వెంటేసుకుని పూల దండలు తీసుకుని వస్తాడు. మాణిక్యంను చూసి బాలు, మీనా విస్తుపోతారు. నా స్నేహితుడి కొడుకు కోడలు అని చెప్పానే.. వీళ్లే బాలూ మీనా అని రంగా పరిచయం చేస్తాడు. ఈయన పెళ్లికొడుకు మేనమామ .. ఈ రోజు వంట మాస్టార్‌కి ఒంట్లో బాగోలేకపోతే వంటలు చేయించాడు. ఈయన నాటకాలు కూడా వేస్తారంట.. అంటుంది కామాక్షి. మలేషియా మాయమై .. అస్తికలు గోదాట్లో కలిపి.. చివరికి మటన్‌ కొట్టు మాణిక్యమై .. ఇదే ఊళ్లో కాపురం ఉంటున్నావా మావయ్యా అని బాలూ పంచ్‌లు వేస్తాడు. మాణిక్యంను ఇంటికి తీసుకెళతాడు.

“ఎందుకైనా మంచిది ..అమ్మ ముందు బాటిల్‌ నీళ్లు పెట్టు.. హాస్పిటల్‌కి ఫోన్‌ చేసి అంబులెన్స్‌కి చెప్పు” అని మీనాతో అంటాడు బాలు. “ఎందుకు అందరినీ రమ్మంటున్నావ్” ప్రభావతి బాలుతో అంటుంది. ” రోహిణి మలేషియా మామయ్యకి మర్యాద చేయాలి” అంటాడు బాలు. అదిగో .. మలేషియా మేక మామ.. అంటూ మాణిక్యం ఎంట్రీ అదిరిపోయేలా బాలూ పంచ్‌లు సెటైర్లతో రోహిణిని ఫుల్‌ టెన్షన్‌ పెట్టిస్తుంటాడు. వీర లెవెల్‌లో బాలు వేస్తున్న పంచ్‌లకి రోహిణి.. ఏదో అనర్థం జరగబోతుందని గ్రహిస్తుంది.

“నా కోడలు మలేషియా.. కోడలి మేనమామ కేసులు గెలిచి.. ఆస్తులు మోసుకొస్తాడు .. అని నోరు విప్పితే మలేషియా భజన చేసే అత్తయ్యా.. మాణిక్యం .. సుందరి భర్తకి మాత్రమే మేనమామ.. రోహిణికి కాదు.. అవాక్కయ్యారా?” ప్రభావతిని మీనా దెప్పిపొడుస్తుంది. “ఓ మోసకారిని కోడలిగా తెచ్చుకున్న నిజం మింగుడుపడటం లేదా?” అంటుంది మీనా.

“అస్తికల పేరుతో బూడిద తెప్పించిందీ రోహిణీయే.. మొత్తం నాటకం ఆడింది ఈమే..” రోహిణి తనతో చెప్పించిన ఒక్కో అబద్ధాన్ని మాణిక్యం బయటపెడతాడు. మాణిక్యంపై పోలీసు కేసు పెట్టాలంటాడు మనోజ్‌. “మనింటి బంగారం మంచిదయితే కదా .. పుట్ట మాణిక్యం అయితే.. పాము నీ పెళ్లాం రా” అంటాడు బాలు. “నీకు మనస్సాక్షి లేదా.. ఎందుకు అబద్ధాలాడాల్సి వచ్చింది..” అని మామయ్య కోడలు రోహిణితో అంటాడు. పశ్చాత్తాపం ఏ మాత్రం కనబరచదు రోహిణి. “ఏం తప్పు చేసాననీ నా పై అంతా దాడి చేస్తున్నారు?” రోహిణి అందర్ని ఉద్దేశించి అంటుంది. ఈసారి ప్రభావతికి కోపం కట్టలు తెంచుకుంటుంది. అపర కాళిలా మారి .. “చంపేస్తా..” అంటూ రోహిణి మెడ పట్టుకుంటుంది. ఈ రోజు ఎపిసోడ్ స్టార్ మాలో చూసేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us