
కార్తీక దీపం సీరియల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వంటలక్క అలియాస్ దీప. ఈ పాత్రలో ప్రేమి విశ్వనాథ్ అభినయం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇక దీప భర్త పాత్రలో నిరూపమ్ నటన కూడా ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. అయితే ఇదే సీరియల్ లో వంటలక్క కూతుళ్లుగా నటించిన హిమ, సౌర్య పాత్రలు కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ఈ పాత్రల్లో అద్భుతంగా నటించి అందరనీ కట్టిపడేథారు
చిన్నారి హిమ (సహృద), సౌర్య (కృతిక). కొన్ని సీన్లలో అయితే వారి నటన కంటతడి పెట్టించింది. కాగా ‘కార్తీక దీపం’ సీరియల్ సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. దీంతో ఈ ఛైల్డ్ ఆర్టిస్టులు ఎక్కువ భాగం షూటింగ్ సెట్ లోనే గడిపారు. అయితే, ఇప్పుడు చిన్నారులు బాగా పెద్దగైపోయారు. ప్రస్తుతం వారి లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోకతప్పదు.
హిమ (సహృద), సౌర్య (కృతిక) పాత్రల్లో నటించిన ఆ ఆడ పిల్లలు ఇప్పుడు టీనేజ్ వయసులోకి అడుగుపెట్టారు. దీంతో ఈ పాపలిద్దరూ గుర్తు పట్టలేకుండా మారిపోయారు. సహృద, కృతిక ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తరచూ తమ ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఇవి క్షణాల్లోనే వైరల్ గా మారుతున్నాయ. ఇప్పుడీ పిల్లలు చాలా స్టైలిష్ దుస్తులు ధరించి ఎంతో అందంగా కనిపిస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వంటలక్క పిల్లలు ఎంత పెద్దవారైపోయారేంటి అని ముక్కుమీద వేలేసుకుంటున్నారు.
సహృద, కృతిక ఇద్దరూ చదువుతో పాటు నటనను కొనసాగిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.