
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎందరో ఆర్టిస్టులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షో ద్వారానే తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెప్పారు. గతంలో జబర్దస్త్ లో స్కిట్స్ చేసిన సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా, నిర్మాతలుగా, డైరెక్టర్లుగా.. ఇలా తమకు అచ్చొచ్చిన రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే వీరంతా జబర్దస్త్ కు రాక ముందు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొన్న వారే. పొట్ట కూటి కోసం చేతికొచ్చిన పని చేసిన వారే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే జబర్దస్త్ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కమెడియన్ ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. కమెడియన్ గా, సహాయక నటుడిగా ఆడియెన్స్ మన్ననలు అందుకుంటున్నాడు. అయితే జబర్దస్త్ లోకి రాక ముందు ఇతను ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కుటుంబ పోషణ కోసం హైదరాబాద్‌లోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు, గొడుగులు అమ్మాడు. కోఠి మార్కెట్ లో రోడ్లపై నిలబడి రకరకాల వస్తువులు విక్రయించాడు.
హైదరాబాద్ లోని బాగా ఫేమస్ అయిన చార్మినార్, కామత్, ఉడిపి తదితర హోటళ్లలోనూ ఈ జబర్దస్త్ కమెడియన్ పనిచేశాడు. క్యాటరింగ్ వర్క్ కూడా చేశాడు. పాత్రలు కడిగాడు. చివరికీ బాత్రూమ్స్ కూడా క్లీన్ చేశాడట. అదే సమయంలో తన మిమిక్రీ ట్యాలెంట్ తో జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. తన దైన కామెడీ పంచులతో అదరగొట్టాడు. ముఖ్యంగా లేడీ గెటప్పులతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరనుకుంటున్నారా?
‘మాకు పశువులంటే ప్రాణం’ అన్న ఒకే ఒక ట్రేడ్ మార్క్ డైలాగ్ తో బాగా ఫేమస్ అయిన కమెడియన్ కొమురక్క అలియాస్ కుమార్. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూకు హాజరైన అతను కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నాడు. తాను నటుడిగా ఎదగడంలో తన భార్య పాత్ర మరవలేనిదని చెపుతూ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఈ జబర్దస్త్ నటునికి షాద్ నగర్ లో వారసత్వంగా వచ్చిన భూములు ఉన్నాయట. ఇప్పుడు అవి వందల కోట్లు పలుకుతున్నాయట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.