Brahmamudi, March 28th episode: కావ్య ఔదార్యానికి రాజ్ ఫిదా.. రాజ్‌ని కోర్టుకు లాగుతానన్న స్వప్న..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పిల్లాడిని ఉయ్యాలలో వేసి పడుకోబెడుతుంది కావ్య. దీంతో రాజ్ థాంక్స్ చెప్తాడు. మీరు థాంక్స్ చెప్తే సంతోషపడే రోజులు పోయాయి. నేను అడిగితే మీరు చెప్పలేరు. మీరు చెప్పేది నాకు అక్కర్లేదని అంటుంది. ఆ తర్వాత ఉదయం అవుతుంది. డెలివరీ బాయ్ వచ్చి.. మేడమ్ డెలివరీ అని అంటాడు. ఏం డెలివరీ ఎవరికి డెలివరీ.. ఆల్రెడీ ఇక్కడ డెలివరీ అయిపోయి.. బేబీ బాయ్ కూడా పుట్టుకొచ్చాడు. నువ్వేం డెలివరీ చేయడానికి వచ్చావ్ బాబూ అని సెటైరికల్‌గా..

Brahmamudi, March 28th episode: కావ్య ఔదార్యానికి రాజ్ ఫిదా.. రాజ్‌ని కోర్టుకు లాగుతానన్న స్వప్న..
Brahmamudi
Follow us

|

Updated on: Mar 28, 2024 | 11:17 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పిల్లాడిని ఉయ్యాలలో వేసి పడుకోబెడుతుంది కావ్య. దీంతో రాజ్ థాంక్స్ చెప్తాడు. మీరు థాంక్స్ చెప్తే సంతోషపడే రోజులు పోయాయి. నేను అడిగితే మీరు చెప్పలేరు. మీరు చెప్పేది నాకు అక్కర్లేదని అంటుంది. ఆ తర్వాత ఉదయం అవుతుంది. డెలివరీ బాయ్ వచ్చి.. మేడమ్ డెలివరీ అని అంటాడు. ఏం డెలివరీ ఎవరికి డెలివరీ.. ఆల్రెడీ ఇక్కడ డెలివరీ అయిపోయి.. బేబీ బాయ్ కూడా పుట్టుకొచ్చాడు. నువ్వేం డెలివరీ చేయడానికి వచ్చావ్ బాబూ అని సెటైరికల్‌గా అంటుంది రుద్రాణి. రాహుల్ వెళ్లి.. ఆ డెలివరీ తీసుకుంటాడు. మమ్మీ ఇదేదో ఉయ్యాలలా ఉంది అని అంటాడు. అరెరే వదినా.. ఈ ఉయ్యాల నువ్వే ఆర్డర్ పెట్టావా అని వెటకారంగా అడుగుతుంది రుద్రాణి. నిన్ను పడుకోబెట్టి ఊపుదామని అని కోపంగా అంటుంది. మేమందరం ఏమో అనుకుంటాం అని నీ కొడుకు మీద ప్రేమని, నాన్నమ్మ ప్రేమని ఎన్నాళ్లు దాచుకుంటావ్.. ఈ ఉయ్యాల ఆర్డర్ పెట్టింది నువ్వే నీ మనవడి కోసమే కదా అని రుద్రాణి అంటుంది.

అపర్ణను రెచ్చగొడుతున్న రుద్రాణి..

షటప్.. నేను నా కొడుకునే పక్కన పెట్టాను.. ఇక వాడి కొడుకుని ఎలా పడుకోపెడతాను అని అంటుంది రుద్రాణి. అప్పుడే రాజ్ వచ్చి నేనే ఆర్డర్ పెట్టాను అని అంటాడు. ఇక ఆ ఉయ్యాల డిస్పాచ్ చేసి.. అందులో పిల్లాడిని పడుకోబెడతాడు రాజ్. ఈ లోపు రుద్రాణి ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఓహో ఘనంగా బారసాల చేస్తాడా.. మరి బాబుకు మా నాన్న పేరు పెడతారా.. ఆ ఇంకా ఏవేవో బొమ్మలు కూడా ఆర్డర్ పెట్టలేకపోయావా.. రుద్రాణి అంటుంది. దీంతో ఇంట్లోని వాళ్లందరూ కోపంగా రుద్రాణి వైపు చూస్తారు. కావాలనే.. అపర్ణను రెచ్చగొడుతుంది.

బిడ్డ కోసం ఇంట్లో రచ్చ.. రుద్రాణి దెప్పిపొడుపు మాటలు..

ఇంకొక్క మాట ఎక్కువగా మాట్లాడితే నీకు తలంటు పోస్తా.. ఆరేసరికి ఆరు నెలలు పడుతుంది. నోరు మూసుకో అని పెద్దావిడ క్లాస్ పీకుతుంది. ఇంతలో రాజ్‌కి ఫోన్ వచ్చి.. బయటకు మాట్లాడటానికి వెళ్తాడు. వాడి తల్లేమో.. కొడుకు యోగక్షేమాలు కనుక్కోవడానికి అని రుద్రాణి అంటుంది. ఏంటి అత్తయ్యా ఇది నట్టింట్లో ఉయ్యాల వేసినా.. ఎవరూ నోరు ఎత్తక పోతే ఎలా అని ధాన్య లక్ష్మి అంటుంది. ఈలోపు రుద్రాణి సెటైర్లు వేస్తుంది. అప్పుడే బాబు బాగా గట్టిగా ఏడుస్తాడు. దీంతో కావ్య ఎత్తుకోవాలనిన చూస్తుంది. కానీ అపర్ణను చూసి ఆగిపోతుంది. బాబు అలాగే చాలా సేపు ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో స్వప్న వచ్చి ఎత్తుకుంటుంది. ఏంటి బాబు ఏడుస్తుంటే అందరూ కాళ్లకు మేకులు కొట్టిన బొమ్మల్లా నిల్చున్నారు. ఎవరికీ మానవత్వం లేదా అని స్పప్న అంటే.. వాడు రాజ్ బిడ్డా అని రుద్రాణి అంటుంది. దీంతో స్వప్న షాక్ అవుతుంది. ఏంటి మళ్లీ చెప్పండి.. రాజా.. రాహులా అని స్వప్న అడుగుతుంది. అంత లేదు.. ఎవర్నో తల్లిని చేసి.. నా బిడ్డ అని ఎత్తుకొచ్చాడు అని రాహుల్ అంటాడు. నేను నమ్మను అని స్వప్న అంటే.. ఇంతలో రాజ్ వచ్చి నా బిడ్డే అని.. బాబును తీసుకుని వెళ్తాడు. స్వప్న అలా నిల్చుండిపోతుంది.

ఇవి కూడా చదవండి

రాజ్‌ని కోర్టుకు లాగాలి అన్న స్వప్న..

ఈ సీన్ కట్ చేస్తే.. జరిగినదంతా స్వప్నకు చెప్తుంది కావ్య. నువ్వు ప్రయాణం చేసి అలిసి పోయినట్టు ఉన్నావ్.. రెస్ట్ తీసుకో. నేను వెళ్లి బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తాను అని కావ్య అంటే.. చెయ్ బాగా చెయ్ ఆకలితో ఎదురు చూస్తూ ఉంటాడు. రాజ్‌కి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టం కదా చేయ్. ఇప్పుడు అసలే బిడ్డను ఆడించడానికి శక్తి కావాలి అని చెప్తుంది. ప్రపంచం తల కిందులైనా నీకు ఇవే ముఖ్యం కదా.. ఏ చిరాకు వస్తుందా.. అసలు నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా? చొక్కా పట్టుకుని నిలదీయ్. నేను ఉండగా మరో ఆడదానితో ఎందుకు సంసారం చేశావ్ అని అడుగు. పదా.. పోలీస్ట్ స్టేషన్‌కి వెళ్లి రాజ్ మీద కేసు పెడదాం. రాజ్‌కి శిక్ష పడాల్సిందే అని స్వప్న అంటే.. ఈ ఇంటి పరువు తీయమంటావా అని కావ్య అంటుంది. నా భర్త జైలుకు వెళ్తే.. నాకు పరిష్కారం దొరుకుతుందా? ఇప్పటికే ఇంట్లో వాళ్లు అందరూ కలిసి శిక్ష వేశారని కావ్య అంటుంది. వదిలేస్తావా.. అని స్వప్న అంటే.. ఎలా వదిలేస్తానే.. నాకు నిజం తెలిసేంత వరకూ ఎదురు చూస్తాను. అప్పటివరకూ నువ్వు ఎలాంటి గొడవ చేయను.. నాకు హెల్ప్ చేయ్ అని కావ్య అంటుంది. సరే అప్పటివరకూ వెయిట్ చేస్తే.. ఇంతకు మించి ఇంకేం జరిగినా ఇంట్లో వాళ్లందర్నీరోడ్డు మీదకు ఈడుస్తా అని స్వప్న అనేసి వెళ్లి పోతుంది.

అప్పూకి కళ్యాణ్ ఫోన్.. అనామిక దొంగ బుద్ధి..

ఆ తర్వాత కళ్యాణ్.. అప్పూకి కాల్ చేస్తాడు. బ్రో ఎలా ఉన్నావ్ అని కళ్యాణ్ అంటే.. మీ అన్నయ్య చేసిన పనికి చాలా బాధ పడుతున్నాం అని అప్పూ అంటుంది. ఇంతలో అనామిక వచ్చి అన్నీ వింటుంది. కానీ ఏం చేస్తే ఈ కష్టం తీరుతుందో అర్థం కావడం లేదు బ్రో. అన్నయ్య మీద ఎంత కోపం వచ్చినా వదిన వల్ల ఆగుతున్నాను. నేను హెల్ప్ చేస్తాను అన్నా చేయనివ్వడం లేదని కళ్యాణ్ అంటాడు. మా అక్కకు సహాయం చేయాలని ఉంది కానీ కుదరదు అని అప్పూ బాధ పడుతుంది. నేను ఉన్నాను కదా చూసుకుంటాను. ముందు నువ్వు పోలీస్ సెలక్షన్స్‌కి బాగా ప్రిపేర్ అవ్వు. ఇక్కడ నేను చూసుకుంటాను అని కళ్యాణ్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే అనామిక చూసి.. ఇలా దొంగచాటుగా వినడం మానవా నువ్వు అని కళ్యాణ్ అడిగితే.. నేనే నీ భార్యను అయినా ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నా మానవా.. నీ లవర్‌తో ముచ్చట్లు పెడుతున్నావ్ అని అనామిక అంటే.. అప్పూ నా ఫ్రెండ్ మాత్రమే అని కళ్యాణ్ అంటాడు. ఇలాంటి చీప్ బుద్ధులు ఎలా వచ్చాయా అని అనుకున్నా.. కానీ మీ అన్నయ్యను చూశాక క్లారిటీ వచ్చింది. ఒకటే రక్తం కదా అని అనామిక అంటే.. కళ్యాణ్ సీరియస్ అవుతాడు. అవకాశం దొరికింది కదా అని పిచ్చి పిచ్చిగా వాగకు అని అంటాడు. నేను మీ వదిన టైప్ కాదు.. ఏం చేస్తానో నాకే తెలీదని అనామిక అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ సీరియస్‌గా వెళ్లిపోతాడు.

బాబుకు స్నానం.. కావ్యకు పాట్లు..

ఇక ఆ తర్వాత బాబును స్నానం చేయించడానికి రాజ్ తీసుకెళ్తాడు. ఎక్కడికి? ఎలా చేయిస్తారని కావ్య అడుగుతుంది. ఏముంది మనలాగే షవర్ కింద నిలబెడతాను. అబ్బే ఎందుకు వాడినే పంపించండి స్నానం చేసి వస్తాడు అని కావ్య వెటకారంగా అంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అని రాజ్ అంటే.. వాడికి సున్ని పిండి కావాలి. గార్డెన్‌లోకి రండి.. అన్నీ సిద్ధం చేసి పెడతాను. చూశారా నాలాంటి వెర్రి బాగుల్ది ఎక్కడైనా ఉంటుందా అని అని కావ్య అంటే ఉండదు అని రాజ్ అంటాడు. సడెన్‌గా ఆ మాట ఎందుకు అన్నావ్ అని రాజ్ అంటే.. మీ పాపంలో సగం నేను కూడా పాపం పంచుకుంటున్నా కాబట్టి.. మర్యాదగా తొందరగా ఆ బిడ్డ తల్లి ఎవరో చెప్పాల్సిందే అని కావ్య అంటుంది. ఇక గార్డెన్‌లోకి వెళ్తారు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో