ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య గురించి గొప్పగా మాట్లాడతాడు రాజ్. ‘భార్య అంటే అర్థం కావ్య’ అని గొప్పగా తన ఫ్రెండ్స్ ముందు చెప్తాడు. అది విని కావ్య, శ్వేతలు ఇద్దరూ కూడా షాక్ అవుతారు. మిగతా ఫ్రెండ్స్ అందరూ చప్పట్లు కొడతారు. ఆ తర్వాత పక్కకు వెళ్లిన రాజ్ దగ్గరకు కావ్య వస్తుంది. అసలు ఏంటండీ మీరు.. ఏమీ అర్థం కావడం లేదు. మనిద్దరి మధ్య ఉండే నిశ్శబ్దానికి ఇవాళ మంచి శబ్దమే ఇచ్చారు. నాతో చెప్పిన నిజాలన్నీ ఇక్కడ అబద్దాలయ్యాయి. ఇక్కడ చెప్పిన విషయాలన్నీ ఇంటికి వెళ్లే సరికి అబద్దాలు అవుతాయి. ఏది నిజం? ఏది అబద్ధం? ప్రశ్నా మీరే.. జవాబు మీరే.. మంచి మీరే.. చెడూ మీరే.. అని కావ్య అంటే.. కళావతీ నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఇంకా నీ నిందలతో నన్ను ఇబ్బంది పెట్టకు. నాకు గిల్టీగానే అనిపిస్తుంది. నిన్ను మోసం చేశానని.. అని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్‌ని రకరకాలుగా ప్రశ్నిస్తుంది. ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డకు తల్లి ఎవరు అని అడుగుతుంది కావ్య. అయినా రాజ్ నోరు విప్పడు.
ఈ సీన్ కట్ చేస్తే.. ఇంటికి వచ్చిన రాహుల్.. పేపర్స్ తీసుకొచ్చావా అని రుద్రాణిని అడుగుతాడు. ఏంటి తీసుకొచ్చేది. ఉదయం నుంచి ఫుడ్ అని జ్యూస్ అని తీసుకుని వెళ్తూనే ఉన్నాను. కంటిన్యూగా జ్యూసులు పిండుతూనే ఉన్నా. ఏదీ తినడం లేదు. తాగడం లేదని రుద్రాణి అంటే.. అదేంటి? అని రాహుల్ అడిగితే.. ఏం తిని సచ్చిందో అరగడం లేదని అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. జ్యూసులు పిండలేక చస్తున్నా అని రుద్రాణి అంటుంది. అప్పుడే పై నుంచి వచ్చిన స్వప్న.. అత్తయ్యా ఆకలి వేస్తుందని అంటుంది. ఈలోపు రాహుల్ స్వప్నను మాటల్లో పెడతాడు. నెక్ట్స్ రాహుల్‌కి స్వప్న గడ్డి పెడుతుంది. ఈలోపు జ్యూసులో మత్తు మందు కలిపేస్తుంది రుద్రాణి. ఇది తెలియని స్పప్న జ్యూస్ తాగేస్తుంది.
ఆ తర్వాత.. ఆడవాళ్లందరూ ఒక దగ్గర, మగవాళ్ల బ్యాచ్ అందరూ ఒక దగ్గర కూర్చుని చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉంటున్నారు. అప్పుడే కావ్యను మాట్లాడమని అడుగుతారు. ఇంట్లో వాళ్లకు డబ్బు ఇస్తే తప్పేంటి? చివరి దాకా అన్నతమ్ముళ్లతో, అక్కచెళ్లెల్లతో ఉంటే తప్పేంటి? భర్తను బానిసలా చూడకూడదని చెప్తుంది. ఆ తర్వాత శ్వేత.. మగవాళ్ల బ్యాచ్ దగ్గరకు వెళ్తుంది. అక్కడున్న మగవాళ్లందరూ భార్యల గురించి తప్పుగా మాట్లాడితే.. అది తప్పని, భార్య తప్ప మన కోసం బ్రతికేవారెవరూ ఉండరు. చివరి వరకూ మనతో ఉండేది భార్య మాత్రమే అని చెప్తాడు రాజ్.
ఈలోపు బాబు ఏడుస్తున్నాడని ఆయా వస్తుంది. రాజ్ బాబును ఎత్తుకుని ఓదార్చుతూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి.. నా బిడ్డా అని ఏడుస్తూ వచ్చి ఎత్తుకుంటుంది. నీకు మానవత్వం ఉందా? నీకు అసలు మనసే లేదు. బాబునూ, బిడ్డను వేరు చేస్తావా? అని అందరి ముందూ ప్రశ్నిస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏంటి నమ్మేశారా? నన్ను గుర్తు పట్టలేదా రాజ్ అని అడుగుతుంది. ఎవరు నువ్వు అని రాజ్ అడిగితే.. నేను నీరజని అని చెబుతుంది. నువ్వు ఇంకా ప్రాక్టికల్ జోక్స్ మానలేదా అని రాజ్ అడుగుతాడు. ఆ తర్వాత అందరూ నవ్వుతారు.
అప్పుడే శ్వేతకు కాల్ వస్తుంది. ఎక్కడున్నావ్ అని శ్వేత అడిగితే.. ఇంకా 20 మినిట్స్ పడుతుందని చెబుతుంది. ఓహ్.. అవునా నీ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం అని చెబుతుంది. అందరూ అంటే.. రాజ్ కూడా వచ్చాడా? అని అడుగుతుంది. ఎందుకు? ఇంత మంది ఫ్రెండ్స్ ఉండగా రాజ్‌నే అడుగుతున్నావ్? తను లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చాడని చెబుతుంది శ్వేత. అవునా సరేలే వస్తున్నా.. అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వెన్నెల. అప్పుడే కావ్య వచ్చి.. శ్వేత ఏమైంది అని అడుగుతుంది. రాజ్‌ని అడిగిందని శ్వేత చెబుతుంది. అవునా సరేలే ఆ వెన్నెల రానీ.. చూద్దాం అని కావ్య చెబుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.