Brahmamudi, November 23rd episode: కావ్య, రాజ్ ల కామెడీ.. అప్పూకి తండ్రి హితబోధ.. అడ్డంగా బుక్ అయిన స్వప్న!

|

Nov 23, 2023 | 11:20 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో సీతా రామయ్య ఇచ్చిన నగలను స్వప్న తాకట్టు పెట్టి అరుణ్ కి డబ్బు ఇవ్వాలని అనుకుంటుంది. ఇదంతా దొంగతనంగా చూసిన రాహుల్.. స్వప్నని బయటకు గెంటేయడానికి మంచి అవకాశం దొరికిందని అనుకుంటాడు. ఈలోపు దొంగ రాత్రి తాళ్లు కట్టేయడంతో అలానే పడుకుంటారు కావ్య, రాజ్ లు. ఇక తెల్లవారుతుంది ఈలోపు రాజ్ కి మెలకువ వస్తుంది. సరిగ్గా అదే సమయానికి ధాన్య లక్ష్మి.. కావ్యా అని పిలుస్తుంది. ఈలోపు పిన్ని వచ్చేస్తుందని, చూస్తాడని రాజ్ కంగారు పడతాడు. ఇక నేరుగా డోర్ తీసి చూసిన ధాన్య లక్ష్మి.. కర్మ కర్మ..

Brahmamudi, November 23rd episode: కావ్య, రాజ్ ల కామెడీ.. అప్పూకి తండ్రి హితబోధ.. అడ్డంగా బుక్ అయిన స్వప్న!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో సీతా రామయ్య ఇచ్చిన నగలను స్వప్న తాకట్టు పెట్టి అరుణ్ కి డబ్బు ఇవ్వాలని అనుకుంటుంది. ఇదంతా దొంగతనంగా చూసిన రాహుల్.. స్వప్నని బయటకు గెంటేయడానికి మంచి అవకాశం దొరికిందని అనుకుంటాడు. ఈలోపు దొంగ రాత్రి తాళ్లు కట్టేయడంతో అలానే పడుకుంటారు కావ్య, రాజ్ లు. ఇక తెల్లవారుతుంది ఈలోపు రాజ్ కి మెలకువ వస్తుంది. సరిగ్గా అదే సమయానికి ధాన్య లక్ష్మి.. కావ్యా అని పిలుస్తుంది. ఈలోపు పిన్ని వచ్చేస్తుందని, చూస్తాడని రాజ్ కంగారు పడతాడు. ఇక నేరుగా డోర్ తీసి చూసిన ధాన్య లక్ష్మి.. కర్మ కర్మ.. ఎప్పుడూ రాంగ్ టైమ్ లోనే వస్తాను. ఆ చేతులు, కాళ్లూ కట్టుకోవడం ఏంటి? విడ్డూరం కాకపోతే అని అంటుంది. ఈలోపు రాజ్ చెప్పడానికి ట్రై చేస్తే.. నేను చెప్తాను.. ఇదంతా మీ అబ్బాయి ఆడిన ఆట.. నాకేం సంబంధం లేదని కావ్య కావాలనే ఇరికించేస్తుంది. ఆ తర్వాత కట్లు విప్పమని అడుగుతుంది కావ్య. ధాన్య లక్ష్మి కట్లు విప్పేసి వెళ్తుంది. పిన్నికి అసలు విషయం ఎందుకు చెప్పలేదని రాజ్ అడిగితే.. దొంగ వచ్చాడని తెలిస్తే ఒక్క దొంగని కూడా డీల్ చేయలేరని అనుకుంటారని కావ్య అంటుంది. సరే ఆకలిగా ఉంది వెళ్లి టిఫిన్ చేయ్ అని చెప్తాడు రాజ్. ఏంటో చెప్పకుండా ఎలా చేస్తాను.. ఏం చేయమంటారో చెప్పండి అని కావ్య అడుగుతుంది.

స్వప్నని కావాలనే కంగారు పెట్టించిన రుద్రాణి:

స్వప్న బ్యాగ్ పట్టుకుని కిందకు వెళ్తుంది. ఈలోపు రుద్రాణి వచ్చి పిలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావ్? అని అడుగుతుంది. బయటకు వెళ్తున్నా.. అని చెప్తుంది స్వప్న. బయటకు వెళ్తున్నప్పుడు కనీసం అత్తగారికి చెప్పాలని కూడా తెలీదా.. అని రుద్రాణి కావాలనే అడుగుతుంది. ఏం చెప్పాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ పార్లర్ కి అని చెప్తుంది స్వప్న. ఫేషియల్ కోసం మనం వెళ్లడం ఏంటి? నీకు కావాలంటే బ్యూటీషియన్నే ఇక్కడికి పిలిపిస్తానని రుద్రాణి అంటుంది. అంటే ఆంటీ హెడ్ మసాజ్ కూడా చేయించుకుందాం అని స్వప్న అంటే.. వాళ్లను కూడా ఇక్కడికే పిలిపిస్తా అని రుద్రాణి అంటుంది. వాళ్లను కూడా ఇక్కడికే పిలిస్తా అని రుద్రాణి అంటే.. అంటే హెడ్ మసాజ్ చేసేది నా ఫ్రెండ్.. క్వాలిటీ హెయిర్ ఆయిల్ వాడుతుంది. మళ్లీ ఆయిల్ మారితే జుట్టు రాలి పోతుందని స్వప్న చెప్తుంది.

ఇవి కూడా చదవండి

తింగరి స్వప్న అడ్డంగా బుక్ అయిపోయింది:

అవును నువ్వు వెళ్లి నీ ఫ్రెండ్ ని కలవడం కరెక్ట్ అని రుద్రాణి అంటే.. ఫ్రెండ్ ఏంటి? అని అడుగుతుంది స్వప్న. ఆ తర్వాత రుద్రాణి స్వప్నని పిలిచి.. ఆ బ్యాగ్ ఏంటి?, ఇందులో ఏం తీసుకెళ్తున్నావ్ అని అడుగుతుంది రుద్రాణి. అంటే క్రీమ్స్ అన్నీ అయిపోయాయి.. వాటిని తీసుకు రావాలంటే బ్యాగ్ ఉండాలి కదా చెప్పి వెళ్తుంది స్వప్న. అప్పుడే రాహుల్ కిందకు వచ్చి.. చూశావా మామ్.. ఎంత తేలిగ్గా అబద్ధాలు ఆడుతుందో అని అడుగుతుంది అంటాడు. అదేం చెప్తే మనకు ఎందుకురా.. అరుణ్ కి డబ్బులు ఇస్తున్నట్టు ఫొటోలు తీయమని చెప్పు అని అంటుంది రుద్రాణి. సరే అని చెప్తాడు రాహుల్.

అప్పూ కన్నీళ్లను తుడిచిన కృష్ణమూర్తి.. బాధతో వెళ్లి పోయిన అప్పూ:

ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ దిగాలుగా కూర్చుంటే.. టిఫిన్ చేయడానికి పిలుస్తాడు కృష్ణ మూర్తి. చిన్నప్పుడు మీకు నేను ఇలాగే కలిపి పెట్టి తినిపించే వాడిని. కానీ మీరు పెద్ద వాళ్లు అయిపోయాక మీరే తినడం నేర్చుకున్నారు. మీకు మీరే నిర్ణయం తీసుకుంటారు. కానీ మీరు ఒక్కటే మర్చి పోతున్నారు. వయసు తొందరపడమని చెప్తుంది. మనసు మాట వినమని చెప్తుంది. అలా అని నువ్వు తప్పు చేశావని కాదురా.. కానీ నువ్వు అందరిలానే ప్రేమించావ్.. సమస్య ఏంటంటే.. ఆ ఆశకే ఆయువే లేకుండా ఆ దేవుడు చేశాడు. నువ్వు ప్రేమించిన అబ్బాయి.. మరో అమ్మాయితో జత చేశాడు. అది తెలిసి కూడా నువ్వు ఇంకా అదే బాధలో ఉంటే ఎలా.. నిజాన్ని తెలుసుకో అప్పూ. బయటకు రా.. ఇలా నువ్వు బాధ పడతూ.. ఇంట్లో వాళ్లను బాధ పెడతూ ఎన్నాళ్లు ఇలా ఉంటావ్.. కానీ మనం మధ్య తరగతి వాళ్లం.. మనసును మోసం చేసి బతికేయడం మీకు అలవాటు చేశాను కదా.. ఇప్పుడు కూడా అలానే అనుకుని మనసులో నుండి ఆ ఆలోచన తీసేయ్. తండ్రిగా నీ కన్నీళ్లను తుడవగను కానీ.. నీ మనసు పెడుతున్న కన్నీళ్లను నువ్వే తుడుచు కోవాలి రా అని చెప్తాడు కృష్ణ మూర్తి. బాధతో అప్పూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

రాజ్ తో ఓ ఆట ఆడుకున్న కావ్య.. ఫ్రస్ట్రేషన్ లో రాజ్:

ఏంటి ఇవాళ ఇంత ఆకలి వేస్తుంది.. అనుకుంటాడు రాజ్. అప్పుడే టిఫిన్ తీసుకొచ్చి ఇస్తుంది కావ్య. మూత తీసి షాక్ అయ్యి.. ఇదేంటే అని అడుగుతాడు. ‘ఏదో ఒకటి’ చేయమని అడిగారు కదా.. అదే చేసుకొచ్చాను అని చెప్తుంది రాజ్. దీంతో ఆవేశంతో కావ్యపై చేయి ఎత్తుతాడు రాజ్. ఇక కావ్య దొరికిందే ఛాన్స్ కదా అని.. ఓవర్ యాక్షన్ చేస్తుంది. వసేయ్ దొరికిందే ఛాన్స్ కదా అని ఓవర్ యాక్షన్ చేయకే.. నేను ఏదో మాట వరసకు అన్నాను. ఏదో ఒకటి అంటే.. దోశనో, గారనో, ఇడ్లీనో అని అర్థం. నువ్వు ఎక్కడ దొరికావే నాకు అని తిట్టుకుంటాడు రాజ్. అయ్యయ్యో ‘ఏదో ఒకటి’లో ఇంత లిస్ట్ ఉందని తెలుసుకోలేక పోయాను అని ఏదో రాగాలు తీస్తూ ఉంటాడు. కానీ మరో వైపు రాజ్ ఆకలితో అలమటిస్తాడు. అయితే రండి ఉప్మా చేస్తాను అని అంటుంది కావ్య. ఏంటి ఉప్మానా.. అని అంటాడు రాజ్. ఏ వద్దా అని అంటుంది కావ్య.. అయితే రండి అని ఇద్దరూ వెళ్తారు. అప్పుడే ధాన్య లక్ష్మి ఎదురవుతుంది. ఏమ్మా కావ్య టిఫిన్ చేయవా అని అడుగుతుంది. ఏం చేయమంటారు చిన్న అత్తయ్యా అని కావ్య అడిగితే.. ఏదో ఒకటి అని చెప్తుంది. పిన్నీ.. ఏదో ఒకటి అని మాత్రం చెప్పొద్దు. ఆ ఏదో ఒకటి అని క్లారిటీగా చెప్పు పిన్నీ అని అంటాడు రాజ్. ఆ ఏడుపు మొహం మార్చండి.. దోశలు, గారెలు, ఇడ్లీలు అన్నీ వేడి వేడిగా చేసి పెట్టాను తిందురు రండి అని కావ్య పిలుస్తుంది. ఓసేయ్ రాక్షసి అని అనుకుంటూ వెళ్లి పోతాడు రాజ్.

అరుణ్ కి డబ్బు ఇచ్చిన స్వప్న.. డ్రామా షురూ చేసిన రాహుల్, రుద్రాణిలు:

ఈ సీన్ కట్ చేస్తే.. అరుణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది స్వప్న. అప్పుడే వచ్చిన అరుణ్ హాయ్ డార్లింగ్ అని పిలుస్తాడు. ఏంట్రా డార్లింగ్ అని అంటుంది స్వప్న. మనం ఇంతకు ముందు అలానే పిలుచుకునే వాళ్లం కదా.. నా లైఫ్ లో ఏదైనా లోటు ఉందంటే అది నువ్వు నా లవ్ ని ఒప్పుకోక పోవడమే. నీకు ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చిందే కాదు కదా.. మనీ తెచ్చావా అని అంటాడు అరుణ్. తెచ్చాను అని స్వప్న అంటే.. మరింకెందుకు లేట్ ఇవ్వు అని అంటాడు అరుణ్. ఇస్తాను కానీ మళ్లీ నువ్వు బ్లాక్ మెయిల్ చేయవని గ్యారెంటీ ఏంటి? అని స్వప్న అంటే.. మనం ఏమైనా బిజినెస్ చేసుకుని విడి పోతున్నామా.. నమ్మాలి అంతే అని అరుణ్ అంటాడు. నిన్ను ఎందుకు నమ్మాలి.. మళ్లీ ఇలాగే ఆడుకోవాలని చూస్తున్నావా అని అంటుంది స్వప్న. నిజంగానే నిన్ను బ్లాక్ మెయిల్ చేయాలని అనుకోలేదు. కేవలం ఆస్పత్రి కోసమే అంటాడు అరుణ్. నన్ను నమ్ము స్వప్న అంటాడు అరుణ్. ఇక తింగరి స్వప్న.. అరుణ్ నమ్మి ఆ డబ్బు ఇచ్చి బుక్ అయి పోతుంది. ఆ తర్వాత అరుణ్ కి గట్టి వార్నింగ్ ఇస్తుంది అరుణ్ కి. ఇదంతా స్వప్నకి తెలియకుండా ఫోటోలు తీస్తారు. అరుణ్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రాహుల్, రుద్రాణిలు. అప్పుడే రాహుల్ ఫోన్ కి ఫొటోలు పంపిస్తాడు అరుణ్. ఇప్పుడు స్వప్న ఎప్పుడు ఇంటికి వస్తుందా? తనని బయటకు గెంటేయడానికి ఎదురు చూస్తారు. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.