Tollywood: రూ.500తో కెరీర్ మొదలుపెట్టి రూ.280 కోట్ల ఆస్తులు సంపాదించిన కమెడియన్..

|

Apr 02, 2024 | 5:51 PM

ఎన్నో అడ్డంకులు.. అడ్డంకులు ఎదుర్కోని టాప్ స్టాండప్ కమెడియన్ గా నిలిచాడు. కానీ ఒకప్పుడు తన కష్టాలను తీర్చుకోవడానికి ఎన్నో పనులు చేశానని.. రూ. 500 తన మొదటి జీతం అని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమది చాలా నిరుపేద కుటుంబం అని.. ఎప్పుడూ తన తల్లికి ఇంటి పనుల్లో సాయం చేసేవాడినని అన్నారు. అలాగే కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయడానికి PCo, టెక్స్ టైల్ తయారీ కంపెనీలో పనిచేసేవాడనని అన్నారు.

Tollywood: రూ.500తో కెరీర్ మొదలుపెట్టి రూ.280 కోట్ల ఆస్తులు సంపాదించిన కమెడియన్..
Comedian
Follow us on

స్టాండప్ కమెడియన్‏గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కపిల్ శర్మ. ఈరోజు (ఏప్రిల్ 2న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కపిల్ శర్మకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం బీటౌన్ టాప్ మోస్ట్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న కపిల్ సినీ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. ఎన్నో అడ్డంకులు.. అడ్డంకులు ఎదుర్కోని టాప్ స్టాండప్ కమెడియన్ గా నిలిచాడు. కానీ ఒకప్పుడు తన కష్టాలను తీర్చుకోవడానికి ఎన్నో పనులు చేశానని.. రూ. 500 తన మొదటి జీతం అని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమది చాలా నిరుపేద కుటుంబం అని.. ఎప్పుడూ తన తల్లికి ఇంటి పనుల్లో సాయం చేసేవాడినని అన్నారు. అలాగే కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయడానికి PCo, టెక్స్ టైల్ తయారీ కంపెనీలో పనిచేసేవాడనని అన్నారు.

ఒకప్పుడు కుటుంబాన్ని పోషించేందుకు చిన్న చిన్న పనులు చేసి నెలకు రూ. 500 సంపాదించిన కపిల్ శర్మ ప్రస్తుత ఆస్తి విలువ రూ. 280 కోట్లు. ఒక్క షో కోసం.. ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 50 లక్షలు తీసుకుంటాడని సమాచారం. ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’లో కపిల్ విజయం, ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’, ‘ది కపిల్ శర్మ షో’ అతని కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచాయి. ప్రస్తుతం ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో అనుబంధంలో ఉన్నాడు.

Kapil Sharma

మ్యాజిక్‌బ్రిక్స్ నివేదించిన ప్రకారం.. ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ముంబై ఆస్తుల విలువ 15 కోట్లకు చేరుకోగా, పంజాబ్‌లో 25 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ను కలిగి ఉన్నాడు. నివేదికల ప్రకారం, కపిల్ రేంజ్ రోవర్ ఎవోక్, మెర్సిడెస్ బెంజ్ S350, వోల్వో XC90, విలాసవంతమైన DC డిజైన్ చేసిన వానిటీ vcan వంటి లగ్జరీ కార్లు కలిగి ఉన్నాడు. వ్యాన్ ధర రూ. 5.5 కోట్లు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.