సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సినిమా పుష్ప (Pushpa). గతేడాది విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పాన్ ఇండియా లెవల్లో పుష్ప మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పుష్పరాజ్ మేనరిజంకు ఫిదా అయ్యారు. ఉత్తరాదిలో పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సోషల్ మీడియాలో పుష్ప సాంగ్స్, డైలాగ్స్ ట్రెండ్ అయ్యాయి. విదేశీయులు సైతం పుష్ప పాటలకు స్టెప్పులేశారు. సామాన్య ప్రేక్షకులే కాకుండా.. సెలబ్రెటీస్, క్రికెటర్స్ పుష్ప రాజ్ మేనరిజంను.. డైలాగ్స్, పాటలకు తమ స్టైల్లో రీల్స్ చేసిన వీడియోలు నెట్టింట్లో తెగ సందడి చేశాయి. పుష్ప సినిమా విడుదలైన నాలుగు నెలలు పూర్తికావోస్తున్న పుష్పరాజ్ మేనియా మాత్రం తగ్గడం లేదు. తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ సైతం పుష్ప సినిమాకు ఫిదా అయినట్టుగా తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా కౌన్ బనేగా కరోడ్ పతి షో నిర్వహిస్తున్న సంగతి తెలసిందే. ఇందులో అమితాబ్ పుష్ప డైలాగ్ చెప్పడమే కాకుండా.. ఆ సినిమాకు సంబంధించిన ప్రశ్నలకు ప్రేక్షకులకు సంధించారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటిరా.. ఫైర్ అంటూ అమితాబ్ పుష్పరాజ్ డైలాగ్ అదరగొట్టేశాడు. ఎర్రచందనం చెట్లు ఏ ప్రాంతానికి చెందినవి.. ఎ. పశ్చిమ కనుమలు, బి. సుందర్ బన్స్, సి. తూర్పు కనుమలు, డి. దోబా అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇప్పటికే పుష్ప డైలాగ్స్, పుష్పరాజ్ మేనరిజాన్ని ఫాలో అవుతున్న సెలబ్రెటీస్.. ఏకంగా అమితాబ్ సైతం పుష్ప డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ లైక్ చేశారు. త్వరలోనే పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
” Amitabh Bachchan ” garu ???
Dialogue & #Pushpa Movie Reach ?
Thank You Anna @alluarjun ?❤️!!!! pic.twitter.com/f2BFGfQHEz
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) April 23, 2022
Also Read: Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్.. పవన్ సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీ ?..
Ram Charan: బాబాయ్‌తో సినిమా చేయాలని ఉంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ చరణ్..
Health Tips: వీటితోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు.. మర్చిపోతే ప్రాణాలకే ప్రమాదం..