Bigg Boss Telugu 9: గ్రాండ్‌ ఫినాలే అయ్యాక బిగ్‌బాస్ హౌస్ సెట్‌ను ఏం చేశారో చూశారా? వీడియో ఇదిగో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ముగియగానే సెట్ ప్రాపర్టీస్ అన్నింటినీ తీసేయడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన బిగ్ బాస్ ఫ్యాన్స్ కాస్త ఎమోషనల్ అవుతున్నారు.

Bigg Boss Telugu 9: గ్రాండ్‌ ఫినాలే అయ్యాక బిగ్‌బాస్ హౌస్ సెట్‌ను ఏం చేశారో చూశారా? వీడియో ఇదిగో
Bigg Boss Telugu 9

Updated on: Dec 23, 2025 | 6:29 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ముగిసింది. సుమారు 105 రోజుల పాటు బుల్లితెర ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ రియాల్టి షోకు ఆదివారం (డిసెంబర్ 21) తో ఎండ్ కార్డ్ పడనుంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ సాగిన ఈ రియాలిటీ షో చివరకు కామనరే విజేతగా నిలిచాడు. చాలా మంది ఊహించినట్లుగానే పవన్ కల్యాణ్ పడాల బిగ్ బాస్ కప్పును అందుకున్నాడు. ఇక సీజన్ ప్రారంభం నుంచి టైటిల్ రేసులో టాప్ లో నిలిచిన తనూజ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకుంది. డిమాన్ పవన్ టాప్-3 గా నిలిచాడు. జబర్దస్త్ కమెడయన్ నాలుగు, సంజనా గల్రానీ ఐదో ప్లేసుతో బయటకు వచ్చారు. కాగా సుమారు 3 నెలలుగా బుల్లితెర ఆడియెన్స్ ను అలరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు ఎండ్ కార్డ్ పడడంతో చాలా మంది డిజప్పాయింట్ అవుతున్నారు. మరో కొత్త బిగ్ బాస్ సీజన్ కోసం ఏడాది దాకా ఆగాలా? అంటూ నిట్టూరుస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిశాక హౌస్ ని ఏం చేస్తారు? నెక్ట్స్ సీజన్ వరకు అలాగే ఉంచుతారా? లేక వేరే కార్యక్రమాలకు వినియోగిస్తారా? అని చాలా మందికి అనుమానాలు రావొచ్చు. అలాంటి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం దొరికింది. ఇందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన బిగ్ బాస్ ఆడియెన్స్ ఎమోషనల్ అవుతున్నారు.

ఇ ఈ వీడియోలో ఇప్పటి వరకు ఉన్న బిగ్ బాస్ హౌస్‌లోని ప్రాపర్టీస్ అన్నింటిని తీసేస్తుండటం మనం చూడవచ్చు. బిగ్ బాస్ టీమ్, ఇతర సిబ్బంది హౌస్ లోకి రావడం, ప్రాపర్టీస్ అన్నింటినీ తొలగించడం, ప్యాక్ చేయడం తదితర దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఆడియెన్స్ బాగా ఫీలవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ బోసిపోయింది. ఐ మిస్ యూ బిగ బాస్. మీ రాక కోసం వేచి చూస్తుంటాం’ అంటూ నెటిజన్లు ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అయ్యాక సెట్స్ ప్రాపర్టీ మొత్తం తీసేస్తారు. వీటిని తర్వాతి సీజన్ కు సరికొత్త థీమ్ తో డిజైన్ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికల రచిస్తారు. మరి కంటెస్టెంట్ల లేని బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో ఈ వైరల్ వీడియోలో మీరూ చూసేయండి

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.