Bigg Boss Emmanuel: ప్రియురాలిని పరిచయం చేసిన ‘బిగ్‌బాస్‌’ ఇమ్మాన్యుయేల్! త్వరలో శుభవార్త చెప్పనున్నాడా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫేమ్, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఇవాళ (డిసెంబర్ 26) సోషల్ మీడియాలో రెండు ఆసక్తికర పోస్టులు షేర్ చేశాడు. అందులో ఒకటి తన గర్ల్ ఫ్రెండ్ గురించి పరిచయం చేస్తున్నట్లు ఉంది. మరి త్వరలో ఇమ్మూ గుడ్ న్యూస్ చెబుతాడా?

Bigg Boss Emmanuel: ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్‌బాస్‌ ఇమ్మాన్యుయేల్! త్వరలో శుభవార్త చెప్పనున్నాడా?
Bigg Boss Telugu 9 Fame Emmanuel

Updated on: Dec 26, 2025 | 6:14 PM

ఇటీవలే ముగిసిన బిగ్‌బాస్ 9వ సీజన్‌లో టాప్-5లో నిలిచిన కంటెస్టెంట్లలో ఇమ్మాన్యుయేల్ ఒకడు. జబర్దస్త్ కాకామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు ఈ రియాలిటీ షోలోనూ ఆకట్టుకున్నాడు. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటాడు. తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. ఒకానొకదశలో ఇమ్మూనే బిగ్ బాస్ విన్నర్ అనుకున్నారు. కానీ చివరకు నాలుగో స్థానంలో సరిపెట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు మళ్లీ టీవీ షోలు, సినిమాలతో బిజీ కానున్నాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జబర్దస్త్ కమెడియన్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో రెండు ఇంట్రెస్టింగ్ పోస్టులు పెట్టాడు. అందులో ఒక ఫొటో తన గర్ల్ ఫ్రెండ్ దేమోనని అనిపిస్తోంది. ఆమె ఎవరు ఏంటనేది, ఫొటో లాంటి బయటపెట్టలేదు కానీ ఇన్ స్టా ఖాతా పేరు మాత్రం రుచి అని ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇమ్మాన్యుయేల్ త్వరలో గుడ్ న్యూస్ చెబుతాడేమోనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది ఈమె గురించేనా?

కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ బయట పెట్టాడు ఇమ్మాన్యుయేల్.. ‘ ఓరోజు నా ఇన్ స్టాలో ఓ పెద్ద మెసేజ్ వచ్చింది. మీ స్టాండప్ కామెడీ నాకు బాగా నచ్చింది. ఓ వ్యక్తి ఇంతమందిని నవ్వించగలడా అనిపించింది అని ఓ అమ్మాయి మెసేజ్ చేసింది. ఆ అమ్మాయి కాంప్లిమెంట్ కు నేను థ్యాంక్స్ చెప్పాను. తిరిగి ఆ అమ్మాయి మీకు ఓకే అయితే ఫోన్ నెంబర్ ఇస్తారా? అని అడిగింది. నేను క్యాజువల్ గానే అనుకుని ఫోన్ నంబర్ ఇచ్చాను. ఆ తర్వాత ఇద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఆ అమ్మాయి డాక్టర్ కోర్సు చేస్తోంది. ఆమె నా ఫేమ్ చూసి ఇష్టపడిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పటికి నాకంతా పెద్దగా గుర్తింపు లేదు. పోనీ అందం చూసి ప్రేమించిందా? అంటే.. నేను ఎలా ఉంటానో నాకు తెలుసు.. అందుకే ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నేను కనీసం ఆమె ఫోటో చూడకుండానే ప్రపోజ్ చేశా. దానికి ఆమె నాకు కాస్త టైమ్ కావాలి అని చెప్పింది. తర్వాత ఆమెని మా ఇంట్లో వాళ్లకు కూడా పరిచయం చేశాను. ఇదంతా ఓ వారంలోనే జరిగిపోయింది. ఆ తర్వాత ఇద్దరం చాలా సార్లు కలిశాం. కానీ క్రమ క్రమంగా షూటింగ్స్ బిజీలో పడి తనని సరిగా పట్టించుకునేవాడిని కాదు. చిన్న విషయాలకు చిరాకుపడేవాడిని, తిట్టేవాడిని. ఆమెను చాలా బాధపెట్టాను.

‘ ఈ నవంబరులో తను పీజీ చేయడం కోసం ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్‌బాస్‌కి వెళ్తున్నానని ఆగిపోయింది. ఇప్పుడు కూడా నేను ఆమె కోసమే గేమ్ ఆడుతున్నా. ఈ బిగ్ బాస్ షో అవ్వగానే పెళ్లి చేసుకుంటాం. తన విలువ ఏంటో బిగ్ బాస్ కు వచ్చిన తర్వాతే తెలిసింది’ అని ఇమ్మూ ఎమోషనల్ అయ్యాడు. మరి ఇప్పుడు ఇమ్మూ ఇన్ డైరెక్టుగా ఆ అమ్మాయినే పరిచయం చేశాడేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

 ఇన్ స్టా స్టోరీస్ లో ఇమ్మాన్యుయేల్ షేర్ చేసిన పోస్టులు..

Bigg Boss Emmanuel Post