
బిగ్ బాస్ తెలుగు సీజన్ దాదాపు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 13 వారం ఎండింగ్ కు చేరుకున్న ఈ రియాలిటీ షోకు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో టాప్ -5 కంటెస్టెంట్స్ ఎవరు? రన్నర్ ఎవరు? కప్పు ఎవర కొట్టునున్నారు? అన్న విషయాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది? అలాగే డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండనుందని ప్రచారం జరగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ ని ఎంపిక చేసే టాస్కులు హోరా హోరీగ సాగుతున్నాయి. ఈ వారం ఒకరికి తొలి ఫైనలిస్ట్ గా అవకాశం లభించనుంది. దీంతో ఆ ఒక్కరు ఎవరు అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమకు ఇచ్చిన గడులను పూర్తి చేసుకుంటూ చివరి వరకు పోటీలో నిలిచి విజయం సాధించిన వారికే తొలి ఫైనలిస్ట్ గా ఛాన్స్ లభించబోతోంది.
మొదటి ఫైనలిస్ట్ పోటీటీలో భాగంగా ముందుగా పవన్ కళ్యాణ్ పడాల, రీతూ చౌదరి, భరణి కలర్స్ టాస్క్ ఆడారు. ఈ ముగ్గురూ తమకి కేటాయించిన కలర్స్ ని బోర్డు పై అంటించాలి. ఎవరి కలర్ బాగా కనిపిస్తే వాళ్లు విజయం సాధిస్తారు. ఈ టాస్క్ లో కల్యాణ్ విజయం సాధించాడు. అయితే ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ సీక్రెట్ గా స్ట్రాటజీ మొదలు పెట్టారు. భరణి, రీతూలను టార్గెట్ చేసుకున్న వీరిద్దరూ కాయిన్స్ ని బ్యాలెన్స్ చేసే టాస్క్ లో కావాలని ఓడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తామిద్దరం కావాలనే ఓడిపోతున్నట్లు రీతూకి తెలియకూడదని ఇమ్ము, కళ్యాణ్ సీక్రెట్ గా మాట్లాడుకున్నారు. అనుకున్న విధంగానే కళ్యాణ్, ఇమ్ము బ్యాలెన్స్ చేయరా డింభకా టాస్క్ లో ఓడిపోయారు. చివరకు ఈ టాస్క్ లో రీతూ విజయం సాధించింది. ఇమ్ము, కళ్యాణ్ ప్లాన్ వేసినట్లుగానే నెక్స్ట్ టాస్క్ లో రీతూ.. భరణిని పోటీగా ఎంచుకుంది. ట్రైయాంగిల్, సర్కిల్ ఇలా కొన్ని ఆకారాలని వరుసగా అమర్చే టాస్క్ అది. ఇందులో భరణి ప్రారంభంలో పైచేయి సాధించారు. కానీ చివరికి రీతూ విజయం సాధించింది.
అయితే కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ ఆడిన గేమ్ పై మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి ఫైర్ అయ్యాడు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసులో ఉన్న కల్యాణ్, ఇమ్మూలు కన్నింగ్ గేమ్ ఆడారని మండి పడ్డాడు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో షేర్ చేశాడు ఆది రెడ్డి.ప్రస్తుతం ఈ వీడియ నెట్టింట బాగా వైరలవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.