Bigg Boss Telugu 9: తను చాలా జెన్యూన్.. ఈసారి బిగ్‌బాస్ కప్పు కొట్టేది ఎవరో చెప్పిసిన దివ్వెల మాధురి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది దశకు వచ్చింది. అప్పుడే టాప్- కంటెస్టెంట్స్ ఎవరు? టైటిల్ ఎవరు గెలుస్తారన్న దానిపై సోషల్ మీడియాల ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై మాజీ కంటెస్టెంట్ దివ్వెల మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Bigg Boss Telugu 9: తను చాలా జెన్యూన్.. ఈసారి బిగ్‌బాస్ కప్పు కొట్టేది ఎవరో చెప్పిసిన దివ్వెల మాధురి
Bigg Boss Telugu 9

Updated on: Nov 12, 2025 | 9:05 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. మధ్యలో మరో ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ లోకి వచ్చారు. అలాగే ఇప్పటివరకు మొత్తం తొమ్మిది వారాల్లో దాదాపు 11 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. అయితే భరణి లాంటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్లీ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే బిగ్ బాస్ షో పదో వారంలోకి అడుగు పెట్టింది. అంటే ఈ రియాలిటీ షో దాదాపు తుది దశకు చేరుకున్నట్లే. మరో 5 లేక 6 వారాల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో ఈ సారి టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరు? టైటిల్ ఎవరు గెలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ రివ్యూయర్లు, మాజీ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాజ్ విజేతలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఇదే విషయంపై మాజీ కంటెస్టెంట్ దివ్వెల మాధురి కూడా స్పందించింది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. మిగిలారు. ఇమ్మాన్యూయెల్‌, తనూజ, కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, రీతూ చౌదరీ, సుమన్‌ శెట్టి, గౌరవ్‌, నిఖిల్‌, దివ్య నికితా, భరణి, సంజనా ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. కాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది మాధురి. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో బిగ్ బాస్ టైటిల్ గెలిచేది ఎవరు అనే ప్రశ్నకు మాధురి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘ బిగ్ బాస్ హౌస్ లో వారం వారం సమీకరణాలు మారిపోతుంటాయి. అయితే తనూజనే ఈసారి విజేతగా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలను. ముందుగా ఆమె సీరియల్ యాక్టింగ్ చేస్తోందని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఆమెతో ఉన్నప్పుడు తనూజ చాలా జెన్యూన్ అని నాకు అర్థమై పోయింది. తను చాలా బాగా గేమ్ ఆడుతోంది. కాబట్టి ఈ సీజన్ విజేత తనూజనే అని చెప్పగలను’ అని మాధురి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో తనూజ..

మాధురి కామెంట్స్ ను తనూజ ఫ్యాన్స్ ను వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇమ్మాన్యుయేల్ ఫ్యాన్స్ మాధురి కామెంట్స్ కు కౌంటర్లు ఇస్తున్నారు. ఇమ్మాన్యుయేల్ కచ్చితంగా బిగ్ బాస్ కప్పు కొడతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.