
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తొమ్మిదో వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్. ఈ వారంలో ఇప్పటికే రాము రాథోడ్ సెల్ఫ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీ గుర్తుకొస్తుందని, అమ్మ గుర్తుకొస్తుందని, హౌస్ లో నిద్ర పట్టడం లేదంటూ పాట రూపంలో తన ఆవేదనను వ్యక్తపరిచాడు రాము రాథోడ్. హోస్ట్ నాగార్జునతో పాటు తోటి హౌస్ మేట్స్ రిక్వెస్ట్ చేసినా రాము వినలేదు. హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకే ప్రాధాన్యమిచ్చాడు.దీంతో శనివారం ఎపిసోడ్‌లోనే రాము హౌజ్‌ని వీడాడు. ఈ సందర్భంగా తాను ఎలిమినేట్ అయినందుకు బిగ్ బాస్ ఫ్యాన్స్ కు, ఆడియెన్స్ కు క్షమాఫణలు చెప్పాడీ ఫోక్ సింగర్. ఇదిలా ఉంటే ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందట. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడని, రెగ్యులర్ ఎలిమినేషన్‌లో మరో కంటెస్టెంట్ బయటకు వెళతాడని ప్రచారం జరుగుతోంది. ఓటింగ్ ప్రకారం రాము రాథోడ్ తర్వాత లీస్ట్ లో ఉన్నది శ్రీనివాస సాయి. ఈ క్రమంలో ఆదివారం అతను కూడా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఆదివారం నాటి వీకెండ్ ఎపిసోడ్ లో ఫుల్ క్లారిటీ రానుంది.
కాగా సెప్టెంబర్ 07న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైంది. దాదాపు 22 మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఇందులో చాలా మంది ఇప్పటికే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ పూర్తి కావడానికి మరో ఆరు వారాలు మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ, సంజానా గల్రానీ, రీతూ చౌదరి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, కల్యాణ్ పడాల, నిఖిల్, దివ్య, గౌరవ్, శ్రీనివాస సాయి, భరణి ఉన్నారు. వీరిలో శ్రీనివాస సాయి ఆదివారం ఎపిసోడ్ లో బయటకు రానున్నాడని తెలుస్తోంది. అంటే ఇక మిగిలింది పది మంది మాత్రమే. మరి వీరిలో ఎవరు టాప్ 5కి వెళతారన్నది ఆసక్తికరంగా మారింది.
Sunday entertainment loading… Bigg Boss house is packed with fun and madness! 🎬🔥
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/hIWQPbMaik
— Starmaa (@StarMaa) November 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.