
బిగ్ బాస్ తెలుగు 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే పదో వారంలోకి అడుగు పెట్టింది. తొమ్మిదో వారంలో ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 11 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. ఇమ్మాన్యూయెల్, తనూజ, కళ్యాణ్, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, సుమన్ శెట్టి, గౌరవ్, నిఖిల్, దివ్య నికితా, భరణి, సంజనా ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. ఇక సోమవారమంటే నామినేషన్స్ ప్రక్రియ ఉంటుంది. అలా పదో వారం కూడా ఈ ప్రక్రియ వాడివేడిగా జరిగింది. కంటెస్టెంట్స ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ నామినేట్ చేసుకున్నారు. ఇమ్మాన్యుయెల్ భరణిని నామినేట్ చేశాడు. రీతూ చౌదరి దివ్యను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్న యుద్దమే జరిగింది. ఇక సంజనాని నామినేట్ చేసిన గౌరవ్ ‘నువ్వొక సెల్ఫీష్ ప్లేయర్’ అంటూ కామెంట్ చేశాడు.
మరోవైపు కళ్యాణ్ నిఖిల్‌ని నామినేట్ చేశాడు. ఆట బాగా లేదని, ఇంకా ఆడాలని నిఖిల్ కు సూచించాడుకల్యాణ్. ఇలా మొత్తానికి దివ్యని భరణి, రీతూ.. నిఖిల్‌ని సుమన్, కళ్యాణ్.. గౌరవ్‌ని తనూజ, సంజనా, పవన్‌లు, సంజనాని గౌరవ్.. రీతూని నిఖిల్ నామినేషన్ చేశారు. మొత్తానికి ఈ వారం కంటెస్టెంట్స్ అందరూ గౌరవ్ నే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అతనితో పాటు దివ్య, భరణి, నిఖిల్, గౌరవ్, రీతూ, సంజనా నామినేషన్స్ లో నిలిచారు. కాగా ఇంత కాలం నిఖిల్, గౌరవ్ ఏదో ఒక విధంగా నామినేషన్ ని తప్పించుకుంటూ వచ్చారు. ఈ సారి వాళ్లు నామినేషన్‌లో ఉండటంతో ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు భరణి మళ్లీ నామినేట్ కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వార ఎలిమినేషన్ కూడా నిఖిల్, గౌరవ్, భరణిల మధ్య ఉండే అవకాశం ఉంది. భరణి సంగతి పక్కన పెడితే.. నిఖిల్, గౌరవ్ లకు బయటి నుంచి కూడా పెద్దగా మద్దతు లేదు. ఓట్లు ఎలా పడతాయో కూడా తెలియదు. కాబట్టి వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Uhalanu tharumaru chese Nominations modhalu 😵💫🔥
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/4xswhJpSNW
— Starmaa (@StarMaa) November 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.