Bigg Boss 5 Telugu: ‘దాక్కో దాక్కో మేక’ అంటూ కంటెస్టెంట్స్‌ను పరిగెత్తించిన నాగార్జున..

|

Oct 03, 2021 | 5:37 PM

తెలుగు బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు 5సీజన్‌లోకి అడుగుపెట్టింది. సీజన్ మొదలైన దగ్గర నుంచి ఇంటిసభ్యుల మధ్య లవ్ స్టోరీలు, గొడవలు..

Bigg Boss 5 Telugu: దాక్కో దాక్కో మేక అంటూ కంటెస్టెంట్స్‌ను పరిగెత్తించిన నాగార్జున..
Bigg Boss5
Follow us on

Bigg Boss 5 Telugu: తెలుగు బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు 5సీజన్ లోకి అడుగుపెట్టింది. సీజన్ మొదలైన దగ్గర నుంచి ఇంటిసభ్యుల మధ్య లవ్ స్టోరీలు, గొడవలు, ఏడుపులతో నానా హంగామాగా ఉంది బిగ్ బాస్ సీజన్ 5.  బిగ్ బాస్ సీజన్స్ లో శనివారం ఆదివారం చాలా ఇంట్రస్ట్ గా ఉంటుంది. హోస్ట్ నాగార్జున ఎంట్రీతో కంటెస్టెంట్స్ లో జోష్ మరింత పెరుగుతుంది. నాగ్ కూడా రకరకాల టాస్క్ లు ఇచ్చి అలరిస్తూ ఉంటారు. నాలుగో వారాంతం నాగార్జున వచ్చి ఒక్కొక్కరినీ ఆడుకున్నాడు.  నిన్నే పెళ్లాడుతా సినిమా వచ్చి 25 ఏళ్లు అవుతుండటంతో స్పెషల్ పర్ఫామెన్స్‌లు చేసినట్టున్నారు. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన పీఎంఓను విడుదల చేశారు.

తాజాగా విడుదల చేసిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. కంటెస్టెంట్స్ చేత డాన్స్ లో చేయించాడు నాగ్. ఎప్పటిలానే అందగత్తెలతో కలిసి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. ఇంట్లో ఉన్న వారితోకూడా స్టెప్పులు వేయించాడు నాగ్. ఓ రొమాంటిక్ సాంగ్ కు మాటెక్కించే డాన్స్ చేశారు హౌస్ లోనో అందాల భామలు. ఆతర్వాత ల్దాక్కో దాక్కో మేక అనే గేమ్ ఆడించాడు నాగార్జున. హామీద పరిగెత్తుతుంటే శ్రీరామ్ పట్టుకోవాలని  చెప్పాడు నాగార్జున. అలాగే ఆనీ మాస్టర్ ను రవి, జెస్సీని శ్వేతా, సన్నీని ప్రియా, షణ్ముఖ్ ను సిరి, కాలేజ్ లోబోని, విశ్వ నటరాజ్ మాస్టర్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న లోబో, సిరి, ఆనీ , నటరాజ్ మాస్టర్ లో ఒకరు ఎలిమినేటి అవ్వనున్నారని చెప్పాడు నాగార్జున. దాంతో ఈ వారం ఎవరు బయటకు వస్తారన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vikram : కమల్ హాసన్- లోకేష్ కనగరాజ్ కాంబోలో రానున్న ‘విక్రమ్’.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న యూనివర్సల్ హీరో…

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో.. కనీళ్ళు వస్తున్నాయంటూ ఎమోషనల్ అయిన నాగ్..

MAA Elections 2021: హోరాహోరీగాఎన్నికల ప్రచారం.. నటసింహంను కలిసిన మంచు విష్ణు.