బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన అతిపెద్ద రియాల్టి షో బిగ్బాస్ (Bigg Boss Season 6). హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఈ షోకు మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటికే తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్బాస్.. సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో, లోగో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ఇటీవల వచ్చిన బిగ్బాస్ ఓటీటీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో బుల్లితెర బిగ్బాస్ ప్రియుల కోసం ఈసారి మరిన్ని జాగ్రత్తలు వహించనున్నట్లు తెలుస్తోంది. షో నిర్వహణ, కంటెస్టెంట్స్ ఎంపికపై మరింత శ్రద్ద పెట్టనున్నారట. అయితే ఇప్పటికే ప్రోమోతో మరోసారి హోస్ట్ నాగార్జున అని కాన్ఫార్మ్ చేసిన మేకర్స్..షో స్ట్రీమింగ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ షో టెలికాస్ట్ డేట్ ఇదేనంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
లేటేస్ట్ సమాచారం ప్రకారం బిగ్బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుందట. వాస్తవానికి ఆగస్ట్ చివరి వారంలో ప్రారంభం కావాల్సి ఉండగా.. అనుహ్యంగా వాయిదా పడిందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈసారి బిగ్బాస్ బజ్ హోస్ట్ గా యాంకర్ శివ కనిపించనున్నారని సమాచారం. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో 10 మంది అమ్మాయిలు.. 9 అబ్బాయిలు ఉండనున్నారట. ముందుగా 15 మందిని ఇంట్లోకి పంపించగా.. మిగతావారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తారని తెలుస్తోంది. ఇక ఈసారి షోలో యాంకర్ ఉదయభాను, హీరో నందు, యూట్యూబర్ ఆదిరెడ్డి, శ్రీహాన్, గలాటా గీతూ రాయల్, చలాకి చంటి, జబర్థస్త్ అప్పారావు ఉండనున్నారని.. వీరిలో అత్యధిక పారితోషికం యాంకర్ ఉదయభాను తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.