Bigg Boss 6 Telugu: శ్రీసత్య పై అర్జున్ కళ్యాణ్ ఫీలింగ్స్.. అసలు విషయం చెప్పేసిన శ్రీహాన్.. పాపం అన్నా అనేసిందిగా..

|

Sep 22, 2022 | 5:06 PM

ఆమె ఏం మాట్లాడిన కరెక్ట్ అంటూ మద్దతిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. శ్రీసత్య పై అర్జున్‏కు ఫీలింగ్స్ ఉన్నాయంటూ అసలు విషయం చెప్పేశాడు శ్రీహాన్.

Bigg Boss 6 Telugu: శ్రీసత్య పై అర్జున్ కళ్యాణ్ ఫీలింగ్స్.. అసలు విషయం చెప్పేసిన శ్రీహాన్.. పాపం అన్నా అనేసిందిగా..
Bigg Boss
Follow us on

బిగ్ బాస్ రియాల్టీ షోలో లవ్ ట్రాక్ ఉండడం కామన్. గత సీజన్లలో లవ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. వారిద్దరు ఫ్రెండ్స్ అయినా.. ఆడియన్స్‏కు ప్రేమికులుగా చూపించడంలో బిగ్ బాస్ మేకర్స్ దిట్ట. ఇక ఇప్పుడు సీజన్ 6 ప్రారంభమై (Bigg Boss 6 Telugu) మూడు వారాలు గడుస్తుంది. కానీ ఇప్పటికీ హౌస్‏లో లవ్ ట్రాక్ మొదలు కాలేదు. దీంతో ఇప్పటికే పలువురు ఇంటి సభ్యుల మధ్య రొమాంటిక్ ట్రాక్ వేసేందుకు తెగ ట్రై చేస్తున్నారు బిగ్ బాస్. శని, ఆదివారాల్లో ఈ రచ్చ మరింత ఎక్కువవుతుంది. ఇప్పటికే ఓ జంటను చూపిస్తున్న బిగ్ బాస్.. ఇప్పుడు మరో జోడిని సిద్ధం చేస్తున్నారు. మొదటి నుంచి శ్రీసత్య అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్న అర్జున్ కళ్యాణ్.. ఆమె ప్రతి మాటకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఏం మాట్లాడిన కరెక్ట్ అంటూ మద్దతిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. శ్రీసత్య పై అర్జున్‏కు ఫీలింగ్స్ ఉన్నాయంటూ అసలు విషయం చెప్పేశాడు శ్రీహాన్.

తాజాగా విడుదలైన ప్రోమోలో.. మెరీనా, నేహ మధ్య మాటల యుద్ధం నడిచింది. అలాగే.. తన బొమ్మలు దొంగిలించడంలో రేవంత్ తెగ ఫీల్ అవుతున్నాడు. దీంతో సుదీప నచ్చచెప్పేందుకు ట్రై చేయగా.. వద్దంటూ వెళ్లిపోయాడు. ఇక శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, రేవంత్ మధ్య సంభాషణ జరుగుతుండగా.. తాను ఇంట్లో ఉన్న వాళ్లందరిని అన్నా అని పిలుస్తానని చెప్పడంతో వావ్.. సూపర్ అని అనేసాడు. ఇక వీరిద్దరి గురించి మరోచోట నేహ, శ్రీహాన్ ముచ్చట్లు పెట్టారు. వారిద్దరి గురించి తనకు ఏం అర్థం కావడం లేదని.. శ్రీ సత్య ఏం చెప్పినా..వావ్ సూపర్ అనేస్తున్నాడని నేహ అనగా.. ఆమెపై అర్జున్ కళ్యాణ్ కు ఫీలింగ్స్ ఉన్నాయంటూ అసలు విషయం చెప్పేశాడు శ్రీహాన్. ఇక తాజా ప్రోమో నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.