
యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించింది పవిత్ర. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి మంచ పేరు తెచ్చుకుంది పవిత్ర. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేసిన ఆమె కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే పవిత్ర లైఫ్ లో ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. గతంలో ఆమె సంతోష్ అనే వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. అందరికీ తన ప్రియుడిగా పరిచయం చేసింది కూడా. 2023 నవంబర్‌లో ప్రియుడు తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను షేర్ చేసిన పవిత్ర తమ ప్రేమకు ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకున్నారని తెగ సంబరపడిపోయింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లే అని చాలా మంది ఫిక్స్ అయ్యారు. కానీ ఇది జరిగిన రోజులకే పవిత్ర- సంతోష్ విడిపోయారు. గతేడాది వాలంటైన్స్‌డే రోజు.. వారు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని పవిత్రనే స్వయంగా వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ జబర్దస్త్ నటికి మరొకరు లవ్ ప్రపోజ్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ పవిత్రకు అందరి ముందే తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. అయితే ఇది జరిగింది ఓ టీవీ షోలో..
సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఫ్యామిలీ స్టార్స్ షో ప్రోమో ఇటీవలూ రిలీజైంది. బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ కూడా ఈ షోలో సందడి చేశాడు. ఈ సందర్భంగా స్టేజీపై జబర్దస్త్ పవిత్రకు ఓ మాట చెప్పాలంటూ సిగ్గులు మొగ్గలేశాడు. మరోవైు అతను ఏం చెప్తాడో ఏంటోనని కంగారుపడ్డ పవిత్ర.. ఏయ్, పిచ్చిలేసిందా?మా అమ్మ ఇక్కడే ఉంది అని బదులిచ్చింది. అయినా అసలు వెనక్కు తగ్గని యావర్.. ప్లీజ్ అని బతిమాలడంతో పవిత్ర నడుచుకుంటూ స్టేజీ మధ్యలోకి వచ్చింది. దీంతో యావర్.. నిజం చెప్తున్నా పవిత్ర.. ఐ లవ్యూ అంటూ ఆమెను ఎత్తుకుని వేదికంతా తిప్పాడు. దీంతో అక్కడున్న వారందరూ షాక్ తో నోరెళ్ల బెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం ఇంత చేయాలా? మీరు చేసినవన్నీ నమ్మడానికి రెడీగా లేమంటూ స్పందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.