
బిగ్ బాస్ సీజన్ 9.. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరనేది తెలియనుంది. ఇప్పటికే ఫినాలే షూటింగ్ స్టార్ట్ కాగా.. టాప్ 5 నుంచి సంజన, ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇమ్మూ ఎలిమినేషన్ పై అడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ సీజన్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందంటే ఇమ్మాన్యూయేల్ మాత్రమే. అలాగే టాస్కులలో ఇరగదీసింది.. ప్రతి సందర్భంలో న్యాయంగా ఉన్నది కూడా అతడే. కానీ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కావాలంటే.. ఆల్ రౌండర్ అయితే సరిపోదు.. గట్టి పీఆర్ టీమ్ కూడా ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. సీజన్ మొదటి రోజు నుంచి చివరి వరకు ప్రతిసారి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించి ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా నిలిచాడు. అలాగే అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఇమ్మాన్యూయేల్. అవకాశం ఉన్నంతవరకు ప్రతి టాస్కులోనూ పోటీ పడి మరీ విన్నర్ అయ్యాడు.
దీంతో మొదటి నుంచి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఇమ్మాన్యూయేల్ అనేంతగా తన ఆట తీరుతో కట్టిపడేశాడు. ఆ తర్వాత టాప్ 3లో ఇమ్మాన్యూయేల్ అంటూ ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా టాప్ 4లో ఎలిమినేట్ కావడంతో అడియన్స్, ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇదే విషయంపై జబర్దస్త్ రోహిణి సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కష్డపడిన విలువ, రిజల్ట్ రాదని.. ఈ సీజన్ 9 అసలైన విన్నర్ ఇమ్మూ అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.
Actress Rohini
“థాంక్యూ వెరీ మచ్.. చాలా నిరాశకు గురయ్యాను. సీరియస్ గా చెప్తున్నాను..ఇమ్మాన్యూయేల్ విషయంలో ప్రతి ప్రేక్షకుడు అలాగే బిగ్ బాస్ టీం కూడా ఫెయిల్ అయ్యింది. ఈ సీజన్ 9 చాలా డిజప్పాయింట్ చేసింది. దీనికో దండం. కష్టపడినా విలువ ఉండదు. కష్టానికి తగ్గ రిజల్ట్ ఉండదు. మరోసారి నిరూపించారు. ఎంటర్టైనర్స్ కేవలం నవ్వించడానికి మాత్రమేనని.. ఇమ్మాన్యుయేల్..నువ్వే అసలైన రియల్ విన్నర్ వి.. ఏది ఏమైనా కానియ్.. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. మై డియర్ బ్రదర్” అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress : స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై.. ఇప్పుడు 400 కోట్ల ఇంట్లో ఆ హీరోయిన్..