
బిగ్ బాస్ సీజన్ 9.. ఈసారి జనాలకు నచ్చిన కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. మొదటి నుంచి అడియన్స్ ఫేవరేట్ లిస్టులో ఉన్నది ఇమ్మాన్యుయేల్, తనూజ, సుమన్ శెట్టి, భరణి. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. మొదట్లో తన ప్రవర్తనతో జనాలకు చిరాకు తెప్పించిన కామనర్ కళ్యాణ్ టైటిల్ రేసులో తనూజకు గట్టిపోటీ ఇస్తున్నాడు. మరోవైపు ఫిజికల్ టాస్కులలో అదరగొట్టేస్తూ డీమాన్ సైతం ఓటింగ్ లో దూసుకుపోతున్నారు. ఇక ఎప్పటిలాగే తనూజ, ఇమ్మాన్యుయేల్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ ముగింపుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు ఆట తీరుతోపాటు…ప్రవర్తన సైతం చాలా ముఖ్యం. కంటెస్టెంట్స్ బిహేవియర్, ఆట తీరు బట్టి ఓటింగ్ లెక్కలు మారుతుంటాయి. వారం రోజులుగా ఓ కంటెస్టెంట్ అత్యధిక ఓటింగ్ తో రెండో స్థానంలో సత్తా చాటింది. కట్ చేస్తే.. నిన్నటి ఎపిసోడ్ తో అట్టడుగుకు పడిపోయింది.
ఆమె మరెవరో కాదు.. సంజన గల్రానీ. మొదటి వారం నుంచి హౌస్మేట్స్ కు చుక్కలు చూపించింది సంజన. దీంతో ఆమెకు ముందు నుంచి కాస్త నెగిటివిటీ ఉంది. అయితే గత వారం రీతూ చౌదరి, డీమాన్ పవన్ ఫ్రెండ్షిప్ తనకు అన్ కంఫర్టబుల్ గా అనిపించిందంటూ నామినేషన్స్ లలో ఆమె మాట్లాడిన తీరుపై జనాలు మండిపడ్డారు. ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి అలా మాట్లాడకూడదంటూ నెట్టింట సంజనపై ట్రోల్స్ జరిగాయి. మరికొందరు మాత్రం సంజనకు మద్దతు ఇచ్చారు. ఇక ఇదే విషయం పై వీకెండ్ లో నాగార్జున సారీ చెప్పాలని అడగ్గా.. తనకు అనిపించింది మాత్రమే చెప్పానని.. సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకుని సారీ మాత్రం చెప్పనని గట్టిగా చెప్పేసింది. కావాలంటే బయటకు వెళ్లిపోతాను కానీ తప్పు చేయలేదని.. సారీ మాత్రం చెప్పనని స్ట్రాంగ్ గా తన మాటపై నిలబడింది. దీంతో చేసేదేమి లేక్ బిగ్ బాస్ సైతం వెనక్కు తగ్గాడు.
వీకెండ్ తర్వాత సంజనా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం సంజన స్టాండ్ తీసుకోవడం.. అలాగే రీతూ పై చేసిన కామెంట్స్ గురించి క్లారిటీ ఇవ్వడం జనాలను ఆకట్టుకుంది. కానీ నిన్నటి ఎపిసోడ్ లో ఆమె ప్రవర్తన మరోసారి ఆమెపై ప్రేక్షకులకు విసుగు పుట్టించింది. గతవారం ఇమ్మూను నాగార్జున పాట పాడమని అడగ్గా.. అమ్మ అని పిలిచి గుండె పిండకు రా అనే పాటను ఫిమేల్ వాయిస్ లో పాడాడు. ఇక ఈ పాటలోని ఒక లిరిక్ “తల్లిపాలు విషము రా ” అనే మాటను పట్టుకుని సాగదీసింది. ఇమ్మూను పిలిచి మరీ ఆ పాట ఎందుకు పాడావ్.. నేను విషము ఎప్పుడు ఇచ్చానురా అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇమ్మూ క్లారిటీ ఇచ్చినప్పటికీ సంజన మాత్రం కన్వీన్స్ కాలేదు. ఇమ్మూ వెళ్లిన తర్వాత కూడా ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది.
ఇదే విషయాన్ని సుమన్ తో డిస్కస్ చేశాడు ఇమ్మాన్యుయేల్. నాగార్జున సర్ అడగడంతో తనకు వచ్చిన పాట పాడానని.. తనకు ఆ ఉద్దేశం లేదంటూ ఎమోషనల్ అయ్యాడు ఇమ్మూ. ఒక పాటలోని అర్థాన్ని తనకు నచ్చినట్లుగా మార్చేసుకుని సంజన కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటని అడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదెలా ఉంటే.. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని.. సంజనతోపాటు సుమన్ శెట్టి సైతం ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..