Bigg Boss 9 Telugu: మాటతో నెగ్గిన సంజన.. 15 వారాలకు విన్నర్ రేంజ్ రెమ్యునరేషన్.. ఎంతంటే..

బిగ్ బాస్ సీజన్ 9.. గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. శనివారమే ఫినాలే షూటింగ్ ప్రారంభం కాగా.. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరనేది తెలియనుంది. అయితే రెండో వారంలోనే ఎలిమినేట్ అవుతుందనుకున్న సంజన.. ఇప్పుడు టాప్ 5గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆమె పారితోషికం ఎంతో తెలుసా.. ?

Bigg Boss 9 Telugu: మాటతో నెగ్గిన సంజన.. 15 వారాలకు విన్నర్ రేంజ్ రెమ్యునరేషన్.. ఎంతంటే..
Sanjana

Updated on: Dec 21, 2025 | 4:35 PM

బిగ్ బాస్ సీజన్ 9.. చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లోనే ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. కళ్యాణ్ పడాల, తనూజ మధ్య ఎవరు విజేత కాబోతున్నారనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే ఈ సీజన్ ప్రారంభానికి ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. అగ్నిపరీక్షతో సామాన్యులకు ఛాన్స్ ఇచ్చిన బీబీ టీమ్.. ఆ తర్వాత సెలబ్రెటీ వర్సెస్ కామనర్స్ పేరుతో ఈసారి ఎక్కువగానే ఎంటర్టైన్ చేసింది. అయితే రావడంతోనే గుడ్లు దొంగిలించి మొదటి వారమే కంటెస్టెంట్లకు చిరాకు తెప్పించింది సంజన. ఆ తర్వాత ప్రతి ఒక్కరి వస్తువులు దాచేయడం.. ఫుటేజ్ కోసం అనవసర గొవడలు క్రియేట్ చేస్తూ.. ఇటు జనాలకు సైతం విసుగు పుట్టించింది. దీంతో ఆమె రెండు మూడు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందని భావించారు.

కానీ ఎవరు ఊహించని విధంగా టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది. ఇప్పుడు 15 వారాలకు గానూ విన్నర్ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. టాప్ 5 కంటెస్టెంట్లలో సంజన 5వ స్థానంలో ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే 5వ స్థానంలో బయటకు వచ్చేసింది సంజన. ఆమె తర్వాత నాల్గవ స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో కేవలం టాప్ 3 కంటెస్టెంట్స్ కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, తనూజ మాత్రమే ఉన్నారు. వీరిలో తనూజ, కళ్యాణ్ మధ్య ఎవరో ఒకరు విన్నర్ కానున్నారు.

ఇదెలా ఉంటే.. సంజన గల్రానీ.. ఒక్క ఎపిసోడ్ తో ఆమె గ్రాఫ్ అమాంతం మారిపోయింది. నామినేషన్స్ సమయంలో రీతూ, డీమాన్ స్నేహం గురించి ఆమె మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో సారీ చెప్పాలని హోస్ట్ నాగార్జున సీరియస్ అయ్యారు. కానీ తాను ఏం తప్పుగా మాట్లాడలేదని.. కేవలం తనకు అన్ కంఫర్టబుల్ గా ఉందని మాత్రమే చెప్పానని స్ట్రాంగ్ గా నిలబడింది సంజన. బయటకు వెళ్లడానికి సైతం సిద్ధం.. కానీ తప్పు చేయకుండా సారీ చెప్పనంటూ వాదించింది. దీంతో చేసేదేమి లేక.. చాలా సమయం రిక్వెస్ట్ చేసి మరీ సారీ చెప్పించారు. ఈ ఒక్క ఎపిసోడ్ తో సంజన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమె టాప్ 5 వరకు తీసుకువచ్చింది. ఇప్పుడు 15 వారాలకు ఆమె మొత్తం రూ.42 లక్షలు తీసుకున్నట్లు టాక్. ఆమెకు వారానికి దాదాపు రూ.2.80 లక్షలు చెల్లించినట్లు సమాచారం. బిగ్ బాస్ విజేతకు మొత్తం రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇప్పుడు సంజన సైతం విన్నర్ రేంజ్ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Cinema: వార్నీ.. ఈ క్రేజీ హీరోయిన్ ఈ విలన్ భార్యానా.. ? తెలుగులో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు..