Bigg Boss 9 Telugu : టాస్కులో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. భరణికి తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు..

బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. రమ్య మోక్ష ఎలిమినేషన్ తర్వాత నామినేషన్స్ కొత్తగా ప్లాన్ చేశారు. ఇదివరకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి తీసుకువచ్చి నామినేషన్స్ చేయించారు. అలాగే ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు కంటెస్టెంట్స్ శ్రీజ దమ్ము, భరణి హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Bigg Boss 9 Telugu : టాస్కులో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. భరణికి తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు..
Bharani

Updated on: Oct 28, 2025 | 9:06 PM

బిగ్ బాస్ సీజన్ 9 ఆట ఇప్పుడు మారింది. రమ్య మోక్ష ఎలిమినేషన్ తర్వాత ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కోరుకున్నట్లే శ్రీజ దమ్ము రీఎంట్రీ ఇచ్చింది. ఆమెతోపాటు భరణి సైతం హౌస్ లోకి అడుగుపెట్టాడు. అయితే వీరిద్దరి రీఎంట్రీ సమయంలో హౌస్మేట్స్ అభిప్రాయాలు అడిగారు బిగ్ బాస్. గతంలో వీరిద్దరు హౌస్ లో చేసిన పొరపాట్లను మిర్రర్ రాసి చెప్పాలని సూచించడంతో అందరూ తమ అభిప్రాయాలను చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను సైతం విడుదల చేశారు. ఇదంతా పక్కన పెడితే.. తిరిగి వచ్చినవారు ఎంతవరకు అర్హులో తేల్చేందుకు బిగ్ బాస్ వారికి టాస్కులు పెట్టారట. రెండు లెవల్లో జరిగిన ఈ టాస్కులలో ఒక లెవల్లో రోప్ పుల్లింగ్ టాస్క్ పెట్టరట. ఇక ఈ టాస్కులో ఇద్దరు కంటెస్టెంట్లకు హౌస్మేట్స్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

అయితే ఈ టాస్కులో భరణి కోసం ఇమ్మాన్యుయేల్, గౌరవ్ సపోర్ట్ చేయగా.. శ్రీజ కోసం డిమాన్, నిఖిల్ సపోర్ట్ చేశారట. ఈ టాస్కు ఫిజికల్ అయ్యిందట. దీంతో ఇమ్ముకు గాయాలు కావడంతో టాస్కు నుంచి తప్పుకున్నాడట. ఆ తర్వాత అతడి స్థానంలోకి రాము రాథోడ్ వచ్చాడట. ఇక ఆ తర్వాత టాస్కులో భరణి స్విమ్మింగ్ పూల్ లో పడడంతో తీవ్రంగా గాయపడ్డాట. వెంటనే అతడిని అర్దరాత్రి రెండు గంటలకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారట. అయితే భరణి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

దీంతో ఇప్పుడు భరణి రీఎంట్రీ పై సస్పెన్స్ పడింది. గాయాలతోనే హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా.. ? లేదా విశ్రాంతి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.అయితే ముందు నుంచి భరణికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. జనాల నుంచి సైతం అతడికి పాజిటివ్ ఓటింగ్ వచ్చింది. కానీ హౌస్ లో బంధాల మధ్య చిక్కుకోవడం.. తన గేమ్ పై ఫోకస్ తగ్గడంతో భరణి అనుహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు రీఎంట్రీ ఛాన్స్ వచ్చినప్పటికీ గాయపడడంతో తిరిగి హౌస్ లోకి వస్తారా లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?