Bigg Boss 8 Telugu Promo 2: ఆ ముగ్గురి మీద ఉన్న ఇంట్రెస్ట్ గేమ్ మీద లేదు.. సోనియా vs యష్మీ..

|

Sep 16, 2024 | 6:18 PM

ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో సోనియా వర్సెస్ యష్మీ మధ్య హీటెక్కించే డిస్కషన్ జరిగింది. నిఖిల్, అభయ్, మణికంఠ మీద ఉన్న ఇంట్రెస్ట్ నీకు గేమ్ మీద లేదంటూ సోనియాకు ఇచ్చిపడేసింది యష్మీ. అలాగే ఈ సీజన్ మొత్తం ప్రతి వారం నిన్నే నామినేట్ చేస్తానంటూ మణికంఠకు వార్నింగ్ ఇచ్చింది. అసలు ఎవరు ఎవరిని నామినేట్ చేశారో తెలుసుకుందామా.

Bigg Boss 8 Telugu Promo 2: ఆ ముగ్గురి మీద ఉన్న ఇంట్రెస్ట్ గేమ్ మీద లేదు.. సోనియా vs యష్మీ..
Bigg Boss 8 Telugu Promo 2
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 8 మూడో వారం నామినేషన్స్ టైమ్ వచ్చేసింది. అయితే ఈవారం హౌస్మేట్స్ మధ్య ఓ రేంజ్ ఫైట్ జరిగినట్లు ఇదివరకు వచ్చిన ప్రోమో చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా రెండు వారాలుగా అసలు నామినేషన్స్ లోకి రాని యష్మీని ఈసారి అందరూ కలిసి నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో సోనియా వర్సెస్ యష్మీ మధ్య హీటెక్కించే డిస్కషన్ జరిగింది. నిఖిల్, అభయ్, మణికంఠ మీద ఉన్న ఇంట్రెస్ట్ నీకు గేమ్ మీద లేదంటూ సోనియాకు ఇచ్చిపడేసింది యష్మీ. అలాగే ఈ సీజన్ మొత్తం ప్రతి వారం నిన్నే నామినేట్ చేస్తానంటూ మణికంఠకు వార్నింగ్ ఇచ్చింది. అసలు ఎవరు ఎవరిని నామినేట్ చేశారో తెలుసుకుందామా.

తాజాగా వదిలిన రెండో ప్రోమోలో కంటెస్టెంట్స్ మధ్య గట్టిగానే మాటల యుద్ధం నడిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోనియా వర్సెస్ యష్మీ, ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియ, ప్రేరణ వర్సెస్ నబీల్ మధ్య ఓ రేంజ్ డిస్కషన్ నడిచింది. పృథ్వీ, సోనియా ఇద్దరూ నైనికను నామినేట్ చేశారు. అయితే పృథ్వీ రెండో వారం చెప్పిన పాయింట్స్ మళ్లీ చెప్పడంతో కొత్తగా ఏం లేదా అంటూ అడిగింది. నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ నైనికను నామినేట్ చేసింది సోనియా. అసలు నువ్వు నాకు కాంపిటీషనే కాదంటూ కౌంటరిచ్చింది నైనిక. ఇక ఆ తర్వాత యష్మీని నామినేట్ చేసింది సోనియా. దీంతో నీకు నిఖిల్, అభయ్, పృథ్వీ మీద ఉన్న ఇంట్రెస్ట్ గేమ్ మీద లేదంటూ కౌంటరిచ్చింది.

ఆ తర్వాత ప్రేరణ, విష్ణు ప్రియ మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఆ సమయంలో విష్ణుప్రియ బ్రెయిన్ లెస్ ఫెలోస్ అని తిట్టగా.. యూజ్ లెస్ ఫెలోస్ అంటూ కౌంటరిచ్చింది ప్రేరణ. నీకు ఎమోషన్స్ ఉంది అన్నానా అంటూ నబీల్ పై సీరియస్ అయ్యింది ప్రేరణ. అరిస్తే గెలుస్తావంటే నీకంటే గట్టిగా అరుస్తా అంటూ నబీల్ కూడా ఇచ్చిపడేశాడు. మొత్తానికి ఈ వారం ప్రేరణ, యష్మీ, నైనిక, విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీ, సీత, అభయ్ నామినేట్ కాగా.. సోనియా, నిఖిల్, నబీల్, ఆదిత్య ఓం సేఫ్ అయ్యారు.

ప్రోమో చూసేయ్యండి.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.