AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ 8 ఫస్ట్ ప్రోమో మాములుగా లేదుగా.. ఊహించని ట్విస్టులు.. సందడి చేసిన నాని..

తాజాగా ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈసారి చాలానే ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ముఖాలు కనిపించకుండా ప్రోమో రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు మరింత క్యూరియాసిటీని కలిగించారు. కానీ కొందరి మాటలు, వాయిస్ చూస్తుంటే ఎవరెవరు హౌస్ లోకి వెళ్తున్నారంటే క్లారిటీ మాత్రం వచ్చేసింది.

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ 8 ఫస్ట్ ప్రోమో మాములుగా లేదుగా.. ఊహించని ట్విస్టులు.. సందడి చేసిన నాని..
Bigg Boss 8 Telugu
Rajitha Chanti
|

Updated on: Sep 01, 2024 | 12:52 PM

Share

బుల్లితెర అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్ 8 రియాల్టీ షో ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఈసారి ఊహించని కంటెస్టెంట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో బిగ్‏బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుండగా.. తాజాగా ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈసారి చాలానే ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ముఖాలు కనిపించకుండా ప్రోమో రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు మరింత క్యూరియాసిటీని కలిగించారు. కానీ కొందరి మాటలు, వాయిస్ చూస్తుంటే ఎవరెవరు హౌస్ లోకి వెళ్తున్నారంటే క్లారిటీ మాత్రం వచ్చేసింది.

తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్‏బాస్ స్టేజ్ పై సరిపోదా శనివారం మూవీ టీం.. న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ సందడి చేశారు. ఒక నాలుగు వారాలు హౌస్ కు హోస్ట్ గా ఉండాలంటూ నానిని ఆటపట్టించాడు కింగ్ నాగార్జున. ఆ తర్వాత రానా దగ్గుబాటి, నివేదా థామస్ స్టేజ్ పైకి వచ్చారు. 35 ఒక చిన్న కథ సినిమా ప్రమోషన్లలో భాగంగా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రోమో చివర్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి అసలైన ట్విస్ట్ ఇచ్చాడు. తనతోపాటు ఒక కంటెస్టెంట్ ను బయటకు తీసుకెళ్తానని..వారి పేరుతో పాటు మరో పేరును స్వైప్ చేస్తారంటూ చెప్పడం చూస్తుంటే ఈసారి హౌస్ ఫస్ట్ వీక్ నుంచే ట్విస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

బిగ్‏బాస్ సీజన్ 8 ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొదటిరోజే మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లనున్నారు. సీరియల్ యాక్టర్స్, యాంకర్స్ కూడా ఈసారి హౌస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం. కుమారీ ఆంటీ, శేఖర్ బాషా, బేబక్క, నటుడు నిఖిల్ ఇంకా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఈసారి హౌస్ లోకి సోలో ఏంట్రీ లేదు.. జంటగా వెళ్లాలని అంటున్నారు నాగార్జున.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్