Bigg Boss 7 Telugu: ‘బిగ్‏బాస్ విన్నర్ అతడే.. ప్రశాంత్‏ను ఎవరు చులకనగా చూడలేదు’.. సింగర్ దామిని..

బిగ్‏బాస్ లో నిలబడాలంటే కంటెంట్ ఇవ్వాలి. అప్పుడప్పుడు ఇతరులపైన సీరియస్ అవ్వాలి. కానీ ఇంట్లో చాలా మందికి పీఆర్ టీమ్ ఉంది. అలాగే నేను పీఆర్ టీంను ఏర్పాటు చేసుకుని వెళ్లాను. ఇంట్లోకి వెళ్లేముందు వారికి సూచన ఇచ్చాను.. నన్ను మాత్రమే హైప్ చేయండి. అందుకోసం ఎదుటివారిని కించపరిచేలా ఎలాంటి ప్రమోషన్ చేయకండి అని చెప్పాను. నా లక్ బాగాలేదు. ఎలిమినేట్ అయ్యాను. హౌస్ నుంచి బయటకి రాగానే రాహుల్ సింప్లిగంజ్ రతికా రోజ్ ఫోటోస్

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ విన్నర్ అతడే.. ప్రశాంత్‏ను ఎవరు చులకనగా చూడలేదు.. సింగర్ దామిని..
Dhamini

Updated on: Nov 03, 2023 | 3:42 PM

సింగర్ దామిని.. తెలుగు సినీ పరిశ్రమలో గాయనిగా గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవలే బిగ్‏బాస్ సీజన్ 7లోకి కంటెస్టెంట్‏గా అడుగుపెట్టింది. కానీ అనుహ్యంగా మూడో వారంలో ఎలిమినేట్ అయ్యింది. కానీ ఎలిమినేషన్‏కు ముందు నెగిటివిటీని కూడగట్టుకుంది. అందుకు కారణం లేకపోలేదు. టాస్కులో భాగంగా యావర్‏తో ఆమె ప్రవర్తించిన తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అటు నెగిటివ్ మాత్రమే కాదు.. పాజిటివ్‏గానూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. హౌస్‏లో వంటలక్కగా మారిపోవడం.. ముక్కు సూటిగా మాట్లాడింది. కానీ అంతే త్వరగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దామిని.. బిగ్‏బాస్ కంటెస్టెంట్స్.. విన్నర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

బిగ్‏బాస్ లో నిలబడాలంటే కంటెంట్ ఇవ్వాలి. అప్పుడప్పుడు ఇతరులపైన సీరియస్ అవ్వాలి. కానీ ఇంట్లో చాలా మందికి పీఆర్ టీమ్ ఉంది. అలాగే నేను పీఆర్ టీంను ఏర్పాటు చేసుకుని వెళ్లాను. ఇంట్లోకి వెళ్లేముందు వారికి సూచన ఇచ్చాను.. నన్ను మాత్రమే హైప్ చేయండి. అందుకోసం ఎదుటివారిని కించపరిచేలా ఎలాంటి ప్రమోషన్ చేయకండి అని చెప్పాను. నా లక్ బాగాలేదు. ఎలిమినేట్ అయ్యాను. హౌస్ నుంచి బయటకి రాగానే రాహుల్ సింప్లిగంజ్ రతికా రోజ్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయని తెలిసింది. అదే సమయంలో రాహుల్ కాల్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగి ఇంటికి వచ్చాడు. ఇద్దరం రతిక, బిగ్‏బాస్ షో గురించి మాట్లాడుకున్నాం. వీళ్లిద్దరితో ఎవరిది తప్పు అనేది జడ్జ్ చేయలేను. అంతకు ముందు హౌస్ లోనే రతిక తన ఎక్స్ ఎవరో నాకు చెప్పింది అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే ఇంట్లో శివాజీ ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు. ఇక ఈసారి బిగ్‏బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ అవుతాడు. ఎందుకంటే కామన్ మ్యాన్‏గా గుర్తింపు ఉంది. చాలా మంచి వ్యక్తి నామినేషన్లో మాత్రమే అలా రెచ్చిపోతాడు. ఆ ఒక్క విషయంలో ప్రశాంత్ అంటే ఇష్టం లేదు. కానీ అతడిని ఎప్పుడూ ఎవరూ చులకనగా చూడలేదు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. కాబట్టి మొదట్లో అడ్జె్స్ట్ కావడానికి సమయం పట్టింది. దాంతో జ్వరం వచ్చింది. ఆ సమయంలో అతడిని జాగ్రత్తగా చూసుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.