Bigg Boss 7 Telugu: ప్రియాంకను ఎలిమినేట్ చేసిన రవితేజ.. పొట్టి పిల్ల గట్టిగానే సంపాదించిందిగా..

|

Dec 17, 2023 | 9:31 PM

యాంకర్ సుమ .. లోపలికి వెళ్లి తన ఫ్రెండ్ రోబో చేత అర్జున్ ను ఎలిమినేట్ చేయించింది. ఆ తర్వాత అర్జున్‏ను బయటకు తీసుకువచ్చింది. ఆ తర్వాత అర్జున్‏తో మాట్లాడిన నాగ్.. ఆ తర్వాత అతడి కోరికను నెరవేర్చాడు. అర్జున్ భార్య సురేఖను స్టేజ్ పైకి రప్పించి ఒక ఫోటో దిగారు నాగార్జున. అర్జున్ మాట్లాడుతూ.. తమకు పుట్టబోయే బిడ్డ పేరు ఆర్కా అనుకున్టనట్లు చెప్పాడు. ఇక తర్వాత ఈగల్ సినిమాకు ప్రమోషన్లలో భాగంగా మాస్ మాహారాజా రవితేజ బిగ్‏బాస్ స్టేజ్  పైకి వచ్చాడు. 

Bigg Boss 7 Telugu: ప్రియాంకను ఎలిమినేట్ చేసిన రవితేజ.. పొట్టి పిల్ల గట్టిగానే సంపాదించిందిగా..
Priyanka Jain
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. మొత్తం ఆరుగురు ఫైనలిస్ట్స్ అమర్, ప్రశాంత్, ప్రియాంక, యావర్, శివాజీ ఉండగా.. తొలి ఎలిమినేషన్ జరిగింది. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు అర్జున్ అంబటి. యాంకర్ సుమ .. లోపలికి వెళ్లి తన ఫ్రెండ్ రోబో చేత అర్జున్ ను ఎలిమినేట్ చేయించింది. ఆ తర్వాత అర్జున్‏ను బయటకు తీసుకువచ్చింది. ఆ తర్వాత అర్జున్‏తో మాట్లాడిన నాగ్.. ఆ తర్వాత అతడి కోరికను నెరవేర్చాడు. అర్జున్ భార్య సురేఖను స్టేజ్ పైకి రప్పించి ఒక ఫోటో దిగారు నాగార్జున. అర్జున్ మాట్లాడుతూ.. తమకు పుట్టబోయే బిడ్డ పేరు ఆర్కా అనుకున్నట్లు  చెప్పాడు. ఇక తర్వాత ఈగల్ సినిమాకు ప్రమోషన్లలో భాగంగా మాస్ మాహారాజా రవితేజ బిగ్‏బాస్ స్టేజ్  పైకి వచ్చాడు.

తర్వాత ఈగల్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అమర్ దీప్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు నాగార్జున. ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేస్తున్నాను బయటకు వచ్చేస్తే రవితేజ నెక్ట్స్ సినిమాలో నటించే ఛాన్స్ ఇస్తాను అని చెప్పడంతో క్షణం ఆలోచించకుండా పరుగులు పెట్టాడు అమర్ దీప్. తనపై అమర్ కు ఉన్న అభిమానం చూసి ఎమోషనల్ అయ్యాడు రవితేజ. అమర్ బయటకు రావడానికి తీసుకున్న నిర్ణయంపై అతడి భార్య తేజును అడగ్గా.. ఈ విషయంలో అమర్ డెసిషన్ ఫైనల్ అని చెప్పేశారు. ఇక తర్వాత అమర్‍ను లోపలికి వచ్చేయ్యాలని చెప్పారు.

ఇక ఆ తర్వాత రవితేజ చేతులతో నెక్ట్స్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరిగింది. అక్కడే ఏర్పాటు చేసిన బోర్డుపై రంగు ఇసుకను వేయడంతో ప్రియాంక ఫోటో కనిపించింది. దీంతో ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగ్. అనంతరం బిగ్‏బాస్ స్టేజ్ పైకి ఒంటరిగానే వచ్చేసింది ప్రియాంక. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన షోలో టాప్ 6లో నిలిచిన ఒకే ఒక అమ్మాయి ప్రియాంక. తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకుల మనసులను మరోసారి గెలిచింది. అబ్బాయిలతో సమానంగా ఫిజికల్ టాస్కులలో కలబడి పొట్టి పిల్ల గట్టి పిల్ల అనిపించుకుంది. అయితే ఇప్పుడు ఎలిమినేషన్ అనంతరం ప్రియాంక ఎక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంది.

బిగ్‏బాస్ సీజన్ 5లో టాప్ 6 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన ప్రియాంక.. తన ఆటతీరుతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. మొత్తం పదిహేను వారాలు హౌస్ లో ఉన్న ప్రియాంక వారానికి రూ.2.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. అంటే ఇప్పటివరకు మొత్తం రూ.37.5 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. మొత్తానికి జానకి కలగనేదు ఫేమ్ జానకిగా హౌస్ లోకి ఎంటరై ప్రియాంకగా తెలుగు అడియన్స్ హృదయాలను దొచుకుంది ప్రియాంక.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.