బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఆరో సీజన్ అట్టర్ ప్లాప్ కావడంతో ఈసారి సీజన్ 7పై మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచే క్యూరియాసిటీ పెంచినప్పటికీ షో మొదలైన తర్వాత ఆ రేంజ్ ఉల్టా పుల్టా ట్విస్టులు కనిపించలేదు. మొత్తం 19 మందితో మొదలైన ఈ షో.. డిసెంబర్ 17న ముగిసింది. ఈ సీజన్ 7 విజేతగా కామన్ మ్యాన్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా.. అమర్ దీప్ రన్నరప్ అయ్యాడు. ఈ సీజన్ విన్నర్ ఎవరనేది చివరివరకు సస్పెన్స్ వచ్చింది. అమర్, ప్రశాంత్ మధ్య స్వల్ప ఓటింగ్ తేడా ఉండడంతో ఇద్దరిలో ఎవరు విన్నర్ కాబోతున్నారనే సందేహాలు చాలా మందిలో ఉండేవి. ఇక అంతా ఊహించినట్లుగానే ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ఇప్పటివరకు వచ్చిన అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించింది.ఈ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందట.
ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 17న ప్రసారమైన గ్రాండ్ ఫినాలేకు ఏకంగా 21.7 TVR (టెలివిజన్ వ్యూ రేటింగ్) లభించిందని.. ఒక రకంగా ఇది పెద్ద రికార్డ్ అని.. ఇంతటి ఆదరణ తమ షోకు అందించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది స్టార్ మా. ఇందుకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇప్పుడు బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2… అలాగే బిగ్‌బాస్ సీజన్ 8 కూడా మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
🌟✨Breaking all records! 🎉📺 Bigg Boss Telugu 7 Grand Finale achieved an astounding 21.7 TVR points, making it an unparalleled success! 🏆💥Thank you for making it the grandest celebration.🙌🌈 #BiggBossTelugu7 #StarMaa @DisneyPlusHSTel @iamnagarjuna @EndemolShineIND pic.twitter.com/kO1p2lXSoj
— Starmaa (@StarMaa) December 29, 2023
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ సెలక్షన్ కూడా జరిగిపోయిందని అంటున్నారు. అందులో పాట బిడ్డ భోలే షావలి, నయని పావని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క కూడా హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సరిగమప షోతో సింగర్‌గా పాపులరైన పార్వతిని కూడా సంప్రదించారట. వీరే కాకుండా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మరికొంతమంది పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Bigg Boss has made a spectacular return, launching with an electrifying bang! 🌟 The much-anticipated reality show has smashed records, achieving the highest TVR of 18.1 👌💯 #BiggBossTelugu7 #AkkineniNagarjuna @DisneyPlusHSTel #StarMaa pic.twitter.com/POLAsVvY8I
— Starmaa (@StarMaa) September 14, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.