ఇవ్వాళ్టి అంటే 69th ఎపిసోడ్‌లో.. రతిక ఫాదర్ రాములు వచ్చి రతికను గేమ్ పై ఫోకస్ పెట్టమని చెబుతారు. హౌస్‌లో అందరూ కొట్టుకోకుండా ఉండాలని.. బిగ్ బాస్ అయిపోయాక అందరికీ.. తన ఇలాకాలో మంచి దావత్ ఇస్తా అంటూ చెబుతాడు. రతిక తనకు బయట రెస్పాన్స్ ఎలా వస్తోంది. ఈ వారం నేను ఉంటానా ఎలిమినేట్ అవుతానా లేదా.. అని అడిగినా కూడా… రాములు ఏదో మొహమాటంతో అదేం లేదన్నట్టే ఆన్సర్ ఇస్తాడు. కప్పు నా బిడ్డదే అంటూ.. ఆమెలో ఆత్మ విశ్వాసం పెంచే ప్రయత్నం చేశాడు. ఇక చివర్లో రతిక రిక్వెస్ట్ చేయడంతో.. డీజె టిల్లు పాటకు.. తన కూతురితో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు రాములు.
ఇక మరో పక్క పల్లవి ప్రశాంత్ తన పేరెంట్స్ ఇంకారావడం లేదనే దిగాలుతో.. ఓ పక్కకు కూర్చొని ఉంటాడు. పొద్దటి నుంచి ఏమీ తినకుండా.. బిగ్ బాస్ మెయిన్ గేట్ వంకే చూస్తుంటాడు. కెప్టెన్ శోభ, ప్రియాంక ఎంత చెప్పినా.. ‘నాన్నో.. అమ్మో.. వస్తారు… వాళ్లతో కలిసి తింటా.. అన్నం కొంచెమే ఉంది అక్కా..’ అంటూ.. చెప్పి.. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు.
ఇక ఇంతలో ముద్ద బంతి పూలతో… పల్లవి ప్రశాంత్ తండ్రి రానే వస్తాడు. ఆ పూలు చూసిన హౌస్ మేట్స్ వచ్చేది… ప్రశాంత్ నాన్నే అని గుర్తు పట్టి ప్రశాంత్ కు చెబుతారు. ఇక హౌస్‌లోకి అదే బంతిపూలతో ‘బంగారం’ అని ప్రశాంత్ ను పిలుస్తూ.. హౌస్‌లోకి వస్తాడు. ఇక తన నాన్నను చూసిన పల్లవి ప్రశాంత్ … పరిగెత్తుకుంటూ వెళ్లి కాళ్ల మీద పడతాడు. ఇద్దరూ ఎమోషనల్ అవుతారు. ఒకరినొకరు సంబరంతో ఎత్తుకుంటారు. ఆ తరువాత హౌస్‌మేట్స్ అందర్నీ పలకరించిన ప్రశాంత్ ఫాదర్… పల్లవి ప్రశాంత్‌కు కొన్ని సలహాలు ఇస్తాడు. ఎవరితో జగడాలు పెట్టుకోవద్దని… నీ గేమ్ నువ్వు ఆడుకో అని.. ఇలాగే ఆడు అని చెబుతాడు. తండ్రి చెప్పిన మాటలకు కొడుకు పల్లవి ప్రశాంత్ కూడా సరే అంటాడు.
ఇక ప్రశాంత్ తండ్రి వెళ్లడంతో.. ఫ్యామిలీ ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఆ వెంటనే నెక్ట్స్ వీక్ కు ఎవరు క్యాప్టెన్ అవుతారా? బిగ్ బాస్ ఏం టాస్క్ ఇస్తారా? అనే చర్చ హౌస్‌మేట్స్‌లో మొదలైంది.
ఇక ఆ చర్చ అలా సాగుతుండగానే.. బిగ్ బాస్ సీజన్‌లోకి వస్తాడు. వచ్చే వారం కెప్టెన్సీ కంటెడెర్స్‌గా పోటీ పడేందుకు ‘హో బేబీ’ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా… హౌస్‌లో ఉన్న ప్రతీ ఒక్కరి ముఖాల ఫోటోలు ఉన్న బేబీ ఫోటోలు ఉంటాయని.. బజర్గా బేబీ ఏడుపు వినబడగానే హౌస్‌లోని అందరూ పరుగెత్తుకెళ్లి.. బేబీని పట్టుకుని.. గార్డెన్లో ఓ మూలన ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ లోపలికి వెళ్లాలని చెబుతాడు. చివరగా ఎవరైతే లోపలికి వెళతారో.. వారి చేతిలో ఉన్న బేబీ..ని స్టోర్ రూంలో పెట్టాలని చెబుతాడు. అంటే బేబీ పై ఎవరి ఫోటో ఉంటుందో వారు కెప్టెన్సీ కంటెడర్స్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవుతారని వివరిస్తాడు బిగ్ బాస్.
ఇక గేమ్‌లో .. ఎవరికి వారు వారి స్ట్రాటజీలు ప్లే చేస్తారు. అయితే అందులో మళ్లీ అమర్ బలైపోతాడు. మొదట కాస్త బలంగానే ఆడినప్పటికీ.. కావాలనే ప్రిన్స్, గౌతమ్ కలిసి గేమ్ ఆడుతున్నారని ఫీలైన అమర్.. వాళ్లను ఎలాగైనా గేమ్ నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తాడు. అందులో భాగంగా పెద్ద డిస్కషన్ తర్వాత ప్రిన్స్‌ను ఎలిమినేట్ చేస్తాడు. కాని ఆ తరువాత రతిక రిక్వెస్ట్ చేయడంతో.. గేమ్ నుంచి బయటికి తప్పుకుంటాడు. కానీ ఆ వెంటనే రతిక కూడా.. వచ్చేయడంతో.. బాబు సాక్రిఫైస్ వేస్ట్ అవుతుంది.
ఇక ఆ తరువత ఫైనల్‌గా.. ఈ టాస్క్‌లో శివాజీ , అర్జున్ ఇద్దరూ మిగులుతారు. అయితే ఈక్రమంలోనే డాక్టర్ బాబు గౌతమ్ మళ్లీ తనకు అన్యాయం జరిగిందంటూ.. అందుకు శివాజీనే కారణం అంటూ రంగంలోకి దిగుతాడు. శివాజీ పై సీరియస్ అవుతాడు. బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్.. మీరు చెప్పినట్టే నడవాలా? మేం ఆడడానికి వచ్చాం? అంటూ.. నానా మాటలు అంటాడు. దీంతో శివాజీ కూడా ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. చూస్తుంటే మళ్లీ మళ్లీ వాదిస్తున్నావ్.. అసలు నీ బాధ ఏంటి అంటూ.. గౌతమ్ మీదికి వెళతాడ. తన లోని ఫైర్ యాంగిల్‌ను కూడా చూపిస్తాడు.
గౌతమ్ కూడా ఏమాత్ర తగ్గకుండా… శివాజీకి బదులిస్తాడు. ఇక్కడ అన్నీ నువ్వు చెప్పినట్టు నడవాలంటే కుదరదంటూ.. శివాజీకి గట్టిగా చెబుతాడు. ఓ దశలో ఇద్దరూ… పోటా పోటీగా ముందుకొచ్చి.. ఒకరి మీదికి ఒకరు దూసుకెళతారు. కొట్టుకున్నంత పని చేస్తారు. అదే ఆవేశంలో… గౌతమ్ అయితే.. మైక్ తీసి విసిరేస్తాడు. డోర్ ఓపెన్ చేయండి బిగ్ బాస్ బయటికి వెళతాను అంటూ… మెయిన్ డోర్‌ను బాదుతూ అరుస్తాడు. అయితే కెప్టెన్ అయిన శోభ.. గౌతమ్‌ను కాస్త కూల్ చేస్తుంది. ఆ తరువాత ప్రిన్స్ , అమర్ మధ్య మరో వివాదం చెలరేగుతుంది. అది కూడా ఓ రేంజ్‌లోనే సాగింది. ఇలా ఈ రోజు ఎపిసోడ్ హీటెడ్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌తో ఎండ్ అయింది.
– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..