Bigg Boss 7 Telugu: నమ్మించి దెబ్బకొట్టిన అమర్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రశాంత్.. యావర్ దెబ్బకు శోభా శెట్టి అవుట్..

|

Nov 28, 2023 | 6:54 AM

తనకోసం అమర్ , ఇంటి సభ్యులతో పోరాడిన శివాజీని నామినేట్ చేసి పూర్తిగా నెగిటివిటీని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తన పాయింట్స్ కరెక్ట్ గా చెప్పి అర్జున్ ఇచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసేశాడు. ఆ తర్వాత అమర్ ఇచ్చిన షాక్‏కు కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్. ఇక రైతు బిడ్డ కారణంగా అమర్ కెప్టెన్ కాలేకపోయాడని చెత్త రీజన్ చెప్పింది శోభా శెట్టి. ఆ తర్వాత గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అందుకే నామినేట్ చేస్తున్నానంటూ యావర్ కు నామినేషన్ వేసింది. దీంతో నేను రాయడం నువ్వు చూశావా అంటూ యావర్ అడగడంతో లేదు అంటూ తెల్ల ముఖం వేసింది. ఈవారం నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగిందో చూద్దాం.

Bigg Boss 7 Telugu: నమ్మించి దెబ్బకొట్టిన అమర్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రశాంత్.. యావర్ దెబ్బకు శోభా శెట్టి అవుట్..
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 7 గతవారం ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈవారం నామినేషన్స్ పాయింట్ టూ పాయింట్ రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా SPY బ్యాచ్ మొత్తాన్ని SPA బ్యాచ్ టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారు. అలాగే కెప్టెన్సీ కోసం తనకు సపోర్ట్ గా నిలబడ్డ శివాజీకి షాకిచ్చాడు అర్జున్ అంబటి. తనకోసం అమర్ , ఇంటి సభ్యులతో పోరాడిన శివాజీని నామినేట్ చేసి పూర్తిగా నెగిటివిటీని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తన పాయింట్స్ కరెక్ట్ గా చెప్పి అర్జున్ ఇచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసేశాడు. ఆ తర్వాత అమర్ ఇచ్చిన షాక్‏కు కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్. ఇక రైతు బిడ్డ కారణంగా అమర్ కెప్టెన్ కాలేకపోయాడని చెత్త రీజన్ చెప్పింది శోభా శెట్టి. ఆ తర్వాత గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అందుకే నామినేట్ చేస్తున్నానంటూ యావర్ కు నామినేషన్ వేసింది. దీంతో నేను రాయడం నువ్వు చూశావా అంటూ యావర్ అడగడంతో లేదు అంటూ తెల్ల ముఖం వేసింది. ఈవారం నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగిందో చూద్దాం.

ఈ వారం నామినేషన్లలో ఇంటి సభ్యులకే కాదు.. ప్రేక్షకులకు సైతం షాకిచ్చాడు అమర్. ఎందుకంటే గత రెండు వారాలుగా తన కోసం నిలబడిన ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. నువ్వు స్టో్ర్ రూమ్ కు వెళ్లి డెడ్ అయిపోవడం నాకు నచ్చలేదు.. నీతో గేమ్ ఆడడం మిస్ అయ్యాను అంటూ సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేశాడు. అయితే అమర్ నామినేట్ చేయడం అస్సలు ఊహించని ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. నీకు సపోర్ట్ చేసినందుకు నాకే నామినేట్ చేస్తావని అనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అమర్ తనను తాను కవర్ చేసుకునేందుకు ట్రై చేశాడు. నువ్వు నాకు సపోర్ట్ చేయడం సంతోషం.. కానీ చేసిన తప్పు చెబుతున్నా… సరే ఏడవకు .. వెళ్లు అంటూ చెప్పాడు. కానీ ప్రశాంత్ మాత్రం అక్కడే నిలబడ్డాడు. నువ్వు నామినేట్ చేస్తున్నందుకు కాదు.. నిన్ను నమ్మినందుకు ఇప్పుడు బాధపడుతున్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. ఇక తన రెండో నామినేషన్ గౌతమ్ కు వేశాడు అమర్. ఫ్రెండ్ గా నన్ను కెప్టెన్ చేద్దామని నువ్వు ఎందుకు అనుకోలేదు.. అర్జున్ అన్నకు నాకు ఒకేసారి మాటిచ్చావు అంటూ నామినేట్ చేశాడు.

ఇక శోభా మాత్రం అర్థం లేని నామినేషన్స్ వేసి ఇంకా నెగిటివిని సొంతం చేసుకుంది. ముందుగా ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ.. నువ్వు అసలైన సేఫ్ట ప్లేయర్.. నీ వల్లే అమర్ కెప్టెన్సీ పోయింది అంటూ రీజన్ చెప్పింది. నేను నీకు చెప్పా మనం ఇద్దరం చివరకు వెళ్దామని.. అలా చేసి ఉంటే అమర్ కెప్టెన్ అయ్యి ఉండేవాడని అని చేప్పేసింది. ఇందుకు ప్రశాంత్ ఒప్పుకోలేదు. కానీ నా పాయింట్లు చెప్పేశాను అంటూ రంగు పూయడానికి వెళ్లింది. కానీ ప్రశాంత్ ఒప్పుకోలేదు. నువ్వు దోస్తాన్ గేమ్ ఆడుతున్నావ్ అని అన్నాడు. ఇక తర్వాత యావర్ కు వేసింది శోభా. లాస్ట్ వీక్ టాస్క్ జరిగినప్పుడు టిష్యూ మీద గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అని రీజన్ చెప్పింది. నేను రాయడం నువ్వు చూశావా అంటూ కరెక్ట్ పాయింట్ అడిగాడు యావర్. దీంతో లేదు చూడలేదు అంటూ ఒప్పుకుంది. మరి చూడకుండా ఎలా నామినేట్ చేస్తావ్ అంటూ తిరిగి క్వశ్చన్ చేయడంతో ఆన్సర్ ఇవ్వకుండా వెళ్లిపోయింది. ఇక ఈవారం అమర్ మినహా ఇంటి సభ్యులు మొత్తం నామినేట్ అయ్యారు.