ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న కంటెస్టెంట్లకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్‌బాస్. ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అంటూనే.. ఇప్పుడు టాస్కులలో ఎవ్వరూ ఊహించిన ట్విస్ట్ ఇస్తూ ఆటను మరింత ఇంట్రెస్ట్‌గా మారుస్తున్నాడు. మొదట ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నది అర్జున్ అంబటి. కానీ ఆ పాస్ ను డిఫెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈరోజు విడుదలైన ఫస్ట్ ప్రోమోలో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరితో తలపడాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో యావర్ ను సెలక్ట్ చేసుకున్నాడు అర్జున్. వీరిద్దరి మధ్య బాల్స్ టాస్క్ పెట్టగా.. అందులో యావర్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు విడుదలైన సెకండ్ ప్రోమోలో.. మరోసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను డిఫైండ్ చేసుకోవాలని సూచించాడు. ఇందుకు మరో టాస్క్ రెడీ చేశాడు. కానీ ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే సభ్యులను స్వయంగా బిగ్‌బాస్ సెలక్ట్ చేశాడు.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఎవిక్షన్ పాస్ ను సొంతం చేసుకునేందుకు కేవలం ఒకరితోకాదు.. ఇద్దరితో డిఫైండ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్‌బాస్. ఇక ఇందుకు శివాజీ, ప్రియాంక టాస్కులో యావర్ తో తలపడ్డారు. ఈ ఛాలెంజ్ లో కంటెస్టెంట్స్ తమ విల్లును పైకి లేపి.. బాల్స్ కిందపడకుండా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్కుకు ప్రశాంత్, శోభా సంచాలక్ గా వ్యవహరించారు. అయితే టాస్క్ మధ్యలోనే శోభా, ప్రశాంత్ కంటెస్టెంట్లకు సలహాలు ఇస్తుండగా.. మధ్యలో మాట్లాడి అందరినీ డిస్ట్రబ్ చేస్తున్నావంటూ అసహనం వ్యక్తం చేశాడు శివాజీ.
ఇక ఈ టాస్కులో ముందుగా ప్రియాంక బాల్స్ బ్యాలెన్స్ చేయలేకపోయింది. దీంతో ఆమె గేమ్ నుంచి తప్పుకుంది. ఇక ఆ తర్వాత శివాజీ తన బాల్స్ పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. చేయి తీయాలని.. ఎక్కవసేపు పెట్టకూడదని చెప్పింది శోభా. అదే సమయంలో శివాజీ బాల్స్ పడిపోవడంతో.. వెంటనే సీరియస్ అయ్యాడు శివాజీ. ఎక్కువగా డిస్ట్రబెన్స్ గా ఉంది నీది అంటూ సీరియస్ కాగా.. మమ్మల్ని చూడకుండా బాల్స్ పై దృష్టి పెట్టాలని చెప్పాడు ప్రశాంత్. టాస్క్ ఫలితం చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించగా.. శివన్న ఎక్కువసేపు బాల్ పట్టుకున్నారు.. అందుకే ఆయనను అవుట్ చేశామంటూ శోభా చెప్పడంతో నీ ఇష్టం వచ్చినట్లు చెప్పుకో అంటూ లేచీ వెళ్లిపోయాడు శివాజీ. మీరు ఇలాంటి రాంగ్ ప్రోటేట్ చేయొద్దు అంటూ అరిచింది శోభా. దీంతో నీకంటే ఎక్కువ అరుస్తా అరవలేనా ?.. ఎందుకు అరుస్తున్నావ్ అంటూ శివాజీ సీరియస్ కావడంతో ప్రోమో ముగిసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.