బిగ్బాస్ హౌస్లో వారం రోజులుగా ఎమోషనల్ సీన్స్ చూస్తున్నాము. ఫ్యామిలీ వీక్లో ఒక్కొక్కరి కుటుంబసభ్యులు హౌస్లోకి వస్తుండడంతో సంతోషంతోపాటు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే యావర్, శోభాశెట్టి, శివాజీ, అమర్ దీప్, గౌతమ్, అర్జున్, అశ్విని, భోలే ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి రాగా.. తమ ఇంటి వాళ్లను చూడగానే తెగ సంబరపడిపోయారు. ఇక ఈరోజు పల్లవి ప్రశాంత్, రతిక కుటుంబసభ్యులు ఇంట్లోకి రాబోతున్నారు. తాజాగా పల్లవి ప్రశాంత్ తండ్రి హౌస్లోకి అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ముందుగా ప్రశాంత్ కోసం బంతిపూలను పంపించారు బిగ్బాస్. వాటిని చేతిలో పట్టుకుని చాలా రోజులు అవుతుంది నేనే పెట్టిన ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. ఆ తర్వాత బాపు బంగారం అంటూ చేతిలో బంతిపూలతో బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు ప్రశాంత్ తండ్రి.
ఇక తండ్రిని చూడగానే కాళ్లపై పడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్. కొడుకును కౌగిలించుకుని నిన్ను చూడక ఎన్ని దినాలైంది బిడ్డా అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్ తండ్రి. మా బాపు బిగ్ బాస్‌లోకి వచ్చాడంటూ.. తండ్రిని ఎత్తుకుని అరుస్తూ సంతోషపడిపోయాడు. తగ్గేదే లేదు బిడ్డా అంటూ ప్రశాంత్ తండ్రి చెప్పడం హైలెట్ అయ్యింది. . ఆ తర్వాత వారిద్దరి దగ్గరకు శివాజీ రాగా.. నా కొడుకును కన్న కొడుకులాగా చూసుకున్నారు అంటూ దండం పెట్టాడు ప్రశాంత్ ఫాదర్. ఇంట్లో ఒక్కొక్కరిని పలకరిస్తూ.. అమర్ దీప్తో అందరూ కలిసిమెలిసి ఉండండి.. కొట్లాడకండి అంటూ ఆప్యాయంగా చెప్పుకొచ్చారు. నేను చచ్చినా… బతికినా వీనితోనే అంటూ తన కొడుకు గురించి గొప్పగా చెప్పుకున్నాడు ప్రశాంత్ తండ్రి. ఆ తర్వాత తండ్రికి అన్నం తినిపించాడు ప్రశాంత్.
టాలెంట్ ఉపయోగించుకో.. నేను ఏం చెప్పినా నువ్వు ఏడవకు.. అమ్మ ఏడుస్తుంది అని చెప్పడంతో మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్. ఆ తర్వాత తండ్రితో కలిసి గార్డెన్ ఏరియాలో డాన్స్ చేయడంతో ప్రోమో ముగిసింది. బిగ్బాస్ సీజన్ 7లో రైతుబిడ్డగా అడుగుపెట్టాడు ప్రశాంత్. మొదటి వారం నుంచి టాస్కులలో అదరగొట్టేస్తూ రోజు రోజుకీ మరింత ఫేమస్ అయ్యాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.