బిగ్బాస్ ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ ఇంట్లో మరింత హీట్ పెంచింది. ఇక మంగళవారం నామినేషన్స్ లో ఒక్కొక్కరు చెప్పిన రీజన్స్ గురించి చర్చించుకున్నారు. అయితే ఇంటి సభ్యుల కోసం బిగ్బాస్ కొన్ని సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశాడు. ఆడియో కాల్.. వీడియో కాల్… ఇంటి నుంచి ఫుడ్ అంటూ మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే అంతా సక్రమంగా సాగితే బిగ్బాస్ షో ఎలా అవుతుంది. ఇక్కడే అసలు మెలిక పెట్టాడు పెద్ద బాస్. ఇంటి సభ్యులకు బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా గార్డెన్ ఏరియాలో 100 శాతం చార్జ్ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటిసభ్యుడికి కొన్ని సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. అయితే అందులో వారు ఎంచుకునే ప్రతి సర్ ప్రైజ్ కు బదులుగా బ్యాటరీలోని కొంత చార్జ్ తగ్గిపోతుంది. అంతేకాకుండా నియమాలను ఉల్లంఘిస్తే ఛార్జ్ తగ్గిపోతుందని చెప్పాడు. అయితే ఈ టాస్కులో హైలెట్గా నిలిచింది ఆదిరెడ్డి మాత్రమే.
ముందుగా శ్రీహాన్ను పిలిచి నాన్నతో వీడియో కాల్.. 58 శాతం.. సిరితో ఆడియో కాల్.. 30 శాతం.. ఇంటి నుంచి మటన్ బిర్యానీ కావాలంటే 15 శాతం బ్యాటరీ ఉపయోగించాలని చెప్పాడు. కచ్చితంగా మూడింటిలో ఒక్కదాన్ని సెలక్ట్ చేసుకోవాలి అనడంతో మటన్ బిర్యానీ తీసుకున్నాడు. ఆ తర్వాత సుదీప తన భర్తతో ఆడియో కాల్ మాట్లాడింది. ఇక ఆదిరెడ్డి తన భార్య కూతురితో వీడియో కాల్ మాట్లాడే ఆప్షన్ సెలక్ట్ చేసుకున్నాడు. తన సతీమణి.. కూతురిని చూడగానే ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత తన మాటలతో భర్తకు మరింత ధైర్యమిచ్చింది కవిత. ఒకప్పుడు బిగ్బాస్ కు వెళ్లొద్దని చెప్పాను. కానీ ఇప్పుడు గర్వపడుతున్నాను.
నీ తప్పు లేనప్పుడు అవతల వ్యక్తి ఎవరైన సరే ఆర్గ్యుమెంట్ చేయి.. అస్సలు వదలొద్దు.. విన్నర్ అయ్యి రావాలి. మూడు నెలలు మేం నిన్ను మిస్ అయ్యాం అనే ప్రశ్నకు నువ్వు విన్నర్ కావడమే సమాధానం అంటూ చెప్పుకొచ్చింది. ఇక భార్య మాటలకు భావోద్వేగానికి గురయ్యాడు ఆదిరెడ్డి. దీంతో గేమ్ బాగా ఆడతానని చెప్పాడు ఆదిరెడ్డి. భార్య కూతురితో మాట్లాడిన ఆనందంలో సంతోషంలో తేలిపోయాడు ఆదిరెడ్డి.