ఈరోజు శనివారం. బిగ్ బాస్‌కు సంబంధించి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ఇప్పటికే లీకువీరుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఒకరోజు ముందే షూటింగ్ జరుగుతుంది కాబట్టి.. విషయం బయటకు పొక్కడం ఆనవాయితీగా వస్తుంది. కానీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ఇంతవరకూ ఈ వీక్ ఎలిమినేషన్ గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. 12వ వారం ఆదిరెడ్డి, శ్రీహాన్, రాజ్, ఇనయ, ఫైమా, శ్రీసత్య, రోహిత్.. మొత్తం ఏడుగురు ఈవారం నామినేషన్స్‌లో ఉన్నారు. ప్రజంట్ ఉన్న సినారియోను బట్టి చూస్తే.. ఇనయ, రోహిత్, శ్రీహాన్ సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. అన్ అఫీషియల్ పోల్స్‌లో సైతం వీరే టాప్‌లో ఉన్నారు. మెరీనా బయటకు వెళ్లింది కాబట్టి.. ఆమె ఓట్లు కూడా రోహిత్‌కు పడినట్లు తెలుస్తోంది. దీంతో అతను కూడా సేఫ్. వెనుక ఏదైనా గూడుపుఠాణి జరిగితే తప్పితే.. రోహిత్ ఇంట్లోనే ఉండే అవకాశాలు మెండు. ఆదిరెడ్డికి బయట నుంచి గీతూ సపోర్ట్‌తో పాటు ఓ వర్గం ఫాలోయింగ్ బలంగానే ఉంది.
మొత్తానికి శ్రీసత్య, ఫైమా, రాజ్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు బయటకు వచ్చేయడం పక్కా. ఫైమా వద్ద ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి.. ఆమె ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతుంది. ఫ్యామిలీ వీక్ కొద్దిగా శ్రీసత్య డ్యామేజ్‌ను తగ్గించినప్పటికీ.. ఆమె వెళ్లిపోతుందని.. వెళ్లిపోవాలని బలంగా కాక్షింస్తున్నారు వీక్షకులు. అన్ అఫీషియల్ ఓటింగ్స్ ఏవి చూసినా శ్రీ సత్య బయటకు వెళ్లడం పక్కా అని స్పష్టం చేస్తున్నాయి.
మరి బిగ్ బాస్ ప్రేమ ఎక్కువయ్యో, గ్లామర్ కోసమో.. ఆమెను ఉంచాలనుకుంటే రాజ్ బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫైమాని ముందే సేవ్ చేసి.. చివరికి రాజ్ శ్రీసత్యలను ఉంచితే మాత్రం.. ఫైమా తన పాస్‌ని రాజ్ కోసం వినియోగించే చాన్స్ ఉంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి.. ఈ వారం ఎపిసోడ్‌ను బాగా రసవత్తరంగా నడిపే చాన్స్ ఉంది. లెట్స్ సీ.. ఏం జరుగుతుందో.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.