బిగ్ బాస్ రచ్చ నాలుగో రోజు కాస్త ఎక్కువగానే కనిపించింది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అల్లర్లు, ఏడుపులు మధ్య నాలుగో రోజు రచ్చ రచ్చగా సాగింది. ఇక ఎట్టకేలకు షణ్ను తాజాగా కెమెరా ముందు కాస్త సందడి చేశారు. సందడి చేయడమే కాదు… హౌస్‌లో తన కో పార్టిసిపెంట్ నటి ఉమా గురించి ఓ సెంటిమెంటల్ కామెంట్ చేశాడు షణ్ను.
నాలుగో రోజు ఎట్టకేలకు షణ్ముఖ్‌కు స్క్రీన్ స్పేస్ దక్కింది. ఇన్నిరోజులు ఎవ్వరితో మాట్లాడకుండా .. ఎవ్వరిని పట్టించుకోకుండా ఉన్న షణ్ముఖ్ ఇప్పటికి నోరు విప్పాడు. ‘ఇంత మంది మధ్య తాను ఎప్పుడులేనని .. తనకు బిగ్ బాస్ సెట్ కావాడం లేదని.. దీనికంటే బయటకు వెళ్లి వీడియోలు చేసుకోవడం బెటర్’ అని మొన్నామధ్య ఓపెన్ అయిన షణ్ను…తాజా ఎపిసోడ్‌లో ఉమ తనతో మాట్లాడటం లేదని.. ఆమె చాలా ఓవర్ హైపర్‌గా ఉంటున్నారని చెప్పుకొచ్చాడు. ఇక తన తల్లి పేరు కూడా ఉమ కావడం వల్లే నామినేట్ చేయలేదని లేదంటే చేసేవాడినని కాజల్, సిరిల దగ్గర చెప్పుకున్నాడు షణ్ముఖ్.
ఇక పవర్ రూం యాక్సెస్ పొందిన హమీదా, మానస్, విశ్వ, సిరిలు మధ్య కెప్టెన్సీ కోసం సైకిల్ పోటీ జరిగింది. అయితే ముందు సిరి గేమ్ ఆడతా.. కానీ నేను పోటీ ఇవ్వలేనేమో అని భయంగా ఉంది అంటూ వెనకడుగేసే ప్రయత్నం చేసింది. అయితే సన్నీ, జెస్సీలు ఆమెకు దైర్యం చెప్పారు. దాంతో సిరి గేమ్‌లో పార్టిసిపేట్ చేసింది. చివరకు సిరినే విజేతగా నిలిచి మొదటి కెప్టెన్ అయ్యింది. మరోవైపు నాలుగు రోజుల్లోనే హౌస్‌లో గ్రూప్‌లు ఏర్పడ్డాయని సరయు ఆనీ మాస్టర్ దగ్గర ఎమోషనల్ అయ్యింది.